5. గురకకూ ఒసా ( OSA ) కూ ఉన్న సంబంధం ఏమిటి ?
మునుపటి టపాలలో, గురక గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదా ! మరి గురకకూ అబ్ స్ట్ర క్టివ్ స్లీప్ అప్నియా కూ ఉన్న సంబంధం ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ! ఓసా ( OSA ) పేరు లోనే మనకు ఆ పరిస్థితి గురించి చాలా వరకు అర్ధం అవుతున్నది కదా ! మన నిద్రను భంగం చేసే అవరోధ కర పరిస్థితి అన్న మాట ! ఈ ఓసా గురించి వివరాలు తెలుసుకునే ముందు , ఈ పరిస్థితిని అశ్రద్ధ చేస్తే కలిగే ఆరోగ్య ప్రమాదాలు తెలుసుకుంటే , ఈ పరిస్థితి ప్రాముఖ్యత విశదం అవుతుంది.
అశ్రద్ధ చేయబడిన ఓసా ఈ క్రింది పరిణామాలకు దారి తీయవచ్చు
1. అధిక రక్త పీడనం ( హైపర్ టెన్షన్ )
2. పక్షవాతం ( స్ట్రోకు )
3. గుండె పోటు.
4. ఊబకాయం ( ఒబీసిటీ )
5. మధుమేహం ( డయాబెటిస్ టైప్ టూ )
ఈ ఓసా లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి ?
1. పగలు విపరీతం గా నిద్ర ముంచుకు రావడం ( అంటే రాత్రులు ఓసా వల్ల తెలియకుండానే నిద్ర భంగం అవడం వల్ల )
2. గొంతు నొప్పి తోనూ గొంతులో మంటల తోనూ ఉదయం లేవడం
3. మతి మరుపు గా ఉండడం , ఏకాగ్రత కోల్పోవడం
4. చీటికీ మాటికీ చీకాకు పడుతూ ఉండడం , ఇతరులను విసుక్కోవడం !
5. తలనోప్పీ , డిప్రెషన్ , ఇంకా యాంగ్జైటీ లాంటి లక్షణాలు కలగడం
6. సెక్స్ లో ఉత్సాహం కోల్పోవడం
7. ఇంకా తీవ్రం గా లక్షణాలు ఉంటే , పురుషులలో అంగ స్థంభన సమస్యలు కూడా ఉత్పన్నం అవవచ్చు .
8. ఎకాగ్రత , లోపించి , పగటి పూట కూడా నిద్ర మత్తు ఎక్కువ గా ఉన్న వారు కారు , మోటార్ సైకిల్ , లాంటి వాహనాలు నడిపే సమయం లో ప్రమాదాలకు
గురి అయ్యే రిస్కు ఎక్కువ అవుతుంది.
గురకకూ , ఓసా కూ ఉన్న సంబంధం శులభం గా గుర్తు ఉంచుకోవాలంటే ,” ఒసా లో గురక సామాన్యం గా ఉంటుంది కానీ అన్ని గురకలూ ఓసా కు దారితీయక పోవచ్చు ! ”
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !