Our Health

8. మధుమేహం ( డయాబెటిస్ ) కాంప్లి కేషన్లు ఏమిటి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 26, 2013 at 7:13 సా.

8. మధుమేహం ( డయాబెటిస్ ) కాంప్లి కేషన్లు  ఏమిటి ?: 

Eye Complications Foot ComplicationsSkin ComplicationsHeart DiseaseHigh Blood Pressure Mental Health Hearing Loss 72x72

 
డయాబెటిస్ నివారణకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ,  ప్రీ డయాబెటిస్ ను ఎట్లా కనుక్కోవాలో క్రితం టపాలలో వివరం గా తెలుసుకున్నాం కదా ! మరి ఈ డయాబెటిస్  ఒక సారి వచ్చాక , ” ఏమవుతుంది ?  ఈ డయాబెటిస్ ను పథ్యం ఏమీ చేయకుండా అశ్రద్ధ చేస్తే ఏం పోతుంది ? ” అని అనుకుని ,పాటించ వలసిన ఆహార నియామాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు, చాలా మంది ! దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు ! అంతకు ముందు అన్ని ఆహార పదార్ధాలూ, ఏ పథ్య మూ  లేకుండా, తమ ఇష్టానుసారం గా తిని, ఒక్క సారిగా , కేవలం చెక్కెర ఉన్న తీపి పదార్దాలే కాకుండా , అసలు తినే ప్రతి పదార్ధం విషయం లోనూ అతి జాగ్రత్త పాటిస్తూ , ముళ్ళ దారిలో , పాద రక్షలు ఏమీ లేకుండా , నడిచిన విధం గా అనుభూతి చెందుతూ , జీవితం సాగించడం అతి కష్టం గా అనిపిస్తూంది చాలా మందికి ! అందు వల్ల విరక్తి తో కొంత కాలం పథ్యం  పాటించి , కొన్ని రోజులు వారి ఆహార పానీయ నియమాలను ఒక్క సారిగా సడలిస్తూ ఉంటారు చాలా మంది ! వారందరికీ ఒకటే సూచన ! 
ప్రపంచం లో కొన్ని రకాల ఆహారం తింటే విపరీతమైన ఎలర్జీ వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ! సీరియస్ గా ఎలర్జీ ఒక సారి వచ్చి ,మళ్ళీ ఎప్పుడూ , ఆ పడని ఆహారాన్నీ , ఆహార పదార్దాలనూ , మళ్ళీ జీవితం లో ముట్టుకొని వారు చాలా మంది ఉన్నారు ! డయాబెటిస్ కూడా ఇట్లాంటి పరిస్థితే, కాక పొతే , ఈ పరిస్థితిలో వచ్చే మార్పులు, ఒక్క సారిగా కాక , క్రమేణా , కాంప్లికేషన్ ల గా మారి , వివిధ అవయవాలకూ , ఇంకా తీవ్రం గా ఉంటే , ప్రాణాలకూ ముప్పు తెస్తుంది ! డయాబెటిస్ , ఒక రకం గా, మన దేహం  ఎక్కువ చెక్కర కు సరిగా స్పందించ లేక ఏర్పడే పరిస్థితి ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, కేవలం మన పాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్ అనే హార్మోనే కాక , మన దేహం లో అన్ని చోట్లా ఉన్న కండరాలు కూడా సరిగా స్పందించలేక పోవడం అని ! అంటే , పాంక్రియాస్ లో నుండి ఉత్పత్తి అయే  ఇన్సులిన్ అనే హార్మోను , నిత్య జీవితం లో, మనం తినే ఆహారం లో ఉండే చెక్కెర ను, మన శరీరం లోని వివిధ కణాలలోకి   ప్రవేశించే ట్టు  చేస్తుంది. కానీ మన ఆహారం లో , రోజు రోజు కూ  చెక్కర ఎక్కువ అవుతూ ఉంటే , ఇన్సులిన్ ఇక సరిపడినంత ఉత్పత్తి అవక, పాంక్రియాస్ కణాలు ” చేతులెత్తేస్తాయి ” ! ఇంకా , మనం ప్రతి రోజూ వ్యాయామం చేయక పోవడం వల్ల , మన కండరాలు కూడా ” మొండి కెత్తుతాయి  ”  ! దానితో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాక పోవడం తో పాటుగా,కండరాలు సక్రమం గా చెక్కర ను అంటే గ్లూకోజు ను ” పీల్చ ” లేక పోవడం తోడై , డయాబెటిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది ! మరి ఈ పరిస్థితి ఎక్కువ సమయం శరీరం లో ఉంటున్న కొద్దీ , ఎక్కువ గా ఉన్న చెక్కర , అదే గ్లూకోజు , రక్త నాళాల మీదా , వివిధ అవయవాలలోనూ, అనేక మార్పులు తీసుకు వస్తుంది ! వాటినే కాంప్లికేషన్ లు అంటారు ! 
పైన కొన్ని ఫోటోలు వరస గా ఉన్నాయి !వాటిలో ఏ విధం గా డయాబెటిస్ వల్ల  కాంప్లికేషన్ లు వస్తాయో , చెప్ప గలరా ? !!! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు ! 
  1. నిజంగా డయాబెటిస్ మీద సరియైన అవగాహన లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి గురించిన పూర్తి పూర్వాపరాలు తెలుసుకుంటే, పామున్న ఇంటిలో కూడా చక్కగా కాపరం చేయకలిగినట్లు, బతకచ్చు. చెప్పే సమయం డాక్టర్లకి ఉండటం లేదు. నిజంగా మీ బ్లాగ్ నిస్వార్ధంగా సేవ చేస్తున్నదే. మొన్న కొద్ది రోజుల కితం డయాబెటీస్ గురించి రాయమని అడుగుదామనుకున్నా, ఒక యువకునికి ఆ వ్యాధి అవచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భంగా, అతనికి కొంత చెప్పేను, చిత్రంగా ఆ రోజే మీరు దీని గురించి మొదటి టపా రాశారు. మంచి విషయం చెబుతున్నందుకు ధన్యవాదాలు. కామెంట్ పెద్దదయిపోయిందా? 🙂
    He is following ur blog and now happy taking treatment.Thank u once again

  2. కృతఙ్ఞతలు శర్మ గారూ! ఏ వ్యాధి బాధితులకైనా , ఆ వ్యాధి గురించిన అవగాహన ఎంతో ముఖ్యం ! శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది , వ్యాధి మూలాలు చాలా వరకూ తెలుసుకోవడం సాధ్య మవుతూంది. ఇక వ్యాధి గురించి విపులం గా తెలియచేయడం , వ్యాధి గురించిన పూర్తి వివరాలు ( ప్రింటు రూపం లో కానీ , వెబ్సైట్ ద్వారా కానీ మరి ఏ ఇతర మీడియా ద్వారా కానీ ) తెలియచేయడం, పేషంట్ సందేహాలు తీర్చడం, ప్రతి వైద్యుడి బాధ్యత కూడా !
    ” బాగు ” ఆశయం, వీలైనంత ఎక్కువ మందికి వైద్య విషయాల లో శాస్త్రీయ అవగాహన, ఉచితం గా కలిగించడమే కదా ! అందుకు నేను తీసుకునే ” ఫీజు ” కేవలం ” బాగు ” ను సందర్శించిన వారందరూ,వారు లాభం పొందుతూ, వారి బంధు మిత్రులకు , ” బాగు ” గురించి తెలియ చేయడమే !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: