రతి వ్యాయామం కాదా.2.
మీ హస్త లాఘవం కూడా క్యాలరీలను దహించి ఆమె లో కామోత్తేజ దీపం వెలిగిస్తుంది ! :
క్యాలరీలు వ్యయం కావట్లేదు అనుకునే వారికి రతి ముందు వారి చేతులతో చూపించే ” చొరవ ” కూడా బాగా ఉపయోగ పడి, కనీసం అరగంటకు ఓ యాభై క్యాలరీలను దహిస్తుంది ! అంటే ఒక గంటకు వంద క్యాలరీలు ! ఓపికను బట్టి , హస్త లాఘవం ఒక గంట వరకూ చూపించ వచ్చు ! ప్రేయసీ ప్రియులు రతి ముందే ఒకరి నుంచి ఇంకొకరు ఆనందాన్ని దోచుకోవడమే కాకుండా పంచుకోవచ్చు కూడా ! ” చాలా సుతి మెత్తని , భావోద్వేగ పూరితమైన అనుభూతులు రేకెత్తించే స్పర్శ మీ చేతులతో , అతి నెమ్మది గా కలిగించాలి ! ఆమె దేహం మీద అతడూ , అతని దేహం మీద ఆమె కేవలం కర స్పర్శ తో నే క్యాలరీలను మండి స్తూ , రతికి ముందు అవసరమయే ఉష్ణోగ్రత జనింప చేయవచ్చు అంటారు సెక్సాలజిస్ట్ కింబాచ్ ! అంతే కాకుండా ఒకరినొకరు తమ దేహాలు పరస్పరం తగిలించు కుంటూ కూడా , అంటే కేవలం చేతులతో కాకుండా క్యాలరీలను కాల్చ వచ్చునంటారు ఆమె !
మర్దన తో అంటే మసాజ్ తో కూడా వేడిని పుట్టించ వచ్చు ! మీ మెసేజ్ ను ఎక్కడా రాయకుండా నే తెలప వచ్చు !
” మీ ప్రియుడికి మీ చేతులతో ఒక మంచి మసాజ్ , అదే మర్దన ఇచ్చినా కూడా మీలో ప్రేమ ప్రవర్ధనం అవుతుంది ” మీరు ప్రేమ తో , అతని శరీరం మీద మర్దన చేసే ప్రతి సారీ , మీ హృదయ స్పందన వేగం ఎక్కువ అవుతూ , మీలో కోరికల గుర్రాలను చెల్లా చెదురుగా పరిగెత్తిస్తుంది ” మీ శరీరాన్ని క్యాలరీలు కాల్చే మోడ్ లో పెడుతుంది ! ఇక్కడ కూడా ” మీరు ఎంత నిదానం గా , ఎంత ” లోతు గా ” మర్దన చేస్తే, అంత లాభం ! క్యాలరీలు దహించడం లోనూ , మీ ఆనందపు గ్యాలరీ లో మీ అనుభవాలను పదిల పరుచుకోవడం లోనూ ” అంటారు కింబాచ్ ! ఇంకో చిరు సూచన కూడా ఆమె చేశారు ! మీరు కేవలం శయన మందిరం లో కాక ఈ మసాజ్ ఇవ్వడం, పుచ్చుకోవడం , ఒక మసాజ్ బల్ల , అదే టేబుల్ ఉపయోగించడం ఉత్తమం ! మసాజ్ టేబుల్ మీద ఒకరుండి , ఇంకొకరు నుంచుని మసాజ్ చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి ! ” అని కూడా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Interesting
Okkannee entha sepu saavamantaaru… vyaayam…:@
ఒంటరి గారూ , వ్యాయామం మానవులకందరికీ ఆరోగ్య దాయకమండీ , మీరు ఒంటరి అయినా , జంటగా ఉన్నా కూడా ! శాస్త్రీయ పరిశోధనలు కనీసం రోజుకు అరగంట వ్యాయామం చేసినా , లాభాలు ఉంటాయి అని చెబుతున్నారు ! మీరు ” జంట ” గా అయే వరకూ నిరుత్సాహ పడకుండా , వ్యాయామం చేస్తూ , ఉండండి , కనీసం రోజూ ఓ అరగంట !