రతి ( సెక్స్ ) వ్యాయామం కాదా ? :
అన్యోన్య దాంపత్య జీవితం లో రతి అంతర్భాగమే కదా ! ఆరోగ్య వంతులైన దంపతులు తరచూ రతి లో పాల్గొంటూ ఉంటే , అది వారి మానసిక ఆరోగ్యానికే కాక, శారీరిక ఆరొగ్యానికీ ఎంతో మంచిది ! ప్రేమానురాగాలతోనూ , భావావేశ పూరితం గానూ , పాల్గొనే ప్రతి రతీ , అనేక ఆనందాలు కలిగించడం తో పాటుగా అనేక వందల క్యాలరీల ను కూడా కాల్చి, ప్రేమలో వేడిని పుట్టిస్తుంది ! శాస్త్రీయ పరిశోధనల వల్ల రతి కార్యక్రమం లో ప్రతి చర్యా , స్త్రీ పురుషుల శక్తిని ( క్యాలరీ ల రూపం లో ) ఉపయోగించడం తో పాటుగా, వారిలో నూతన శక్తిని కూడా ఆవిష్కరిస్తుంది ! ఒక నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది !
ఈ క్రింద ఉన్న వివరాలు చూడండి ! ఇవన్నీ స్త్రీ పురుషుల బరువు షుమారు డెబ్బై కిలోల బరువు ఉన్న స్త్రీ పురుషుల ను ఆధారం గా చేసికొని గుణించినవి.
1. చుంబనం : ( ముద్దు ) : స్త్రీ పురుషులు ఒకరినొకరు రతి క్రియ మొదలు పెట్టే ముందు ఒక అరగంట కనుక ఒకరి మీద ఒకరు ( ఆకాశం ప్రేమావ్రుతం అయాక ! ) ముద్దుల వర్షం కురిపించుకుంటే , ఆ ముద్దు తీవ్రతను బట్టి , మీరు అరవై ఎనిమిది క్యాలరీల ను వ్యయం చేస్తారు ! మీ ప్రేమ ఘాటు గా ఉంటే , మీరు వ్యయం చేసే క్యాలరీలు ఎక్కువ అవుతాయి అంటే , మీరు తొంభై క్యాలరీల వరకూ వ్యయం చేయవచ్చు ! జయా కింబాచ్ అనే లాస్ ఏంజెల్స్ కు చెందిన సెక్సాలజిస్ట్ ” మీరు వ్యయం చేసే క్యాలరీలను ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు , మీరూ మీ భాగాస్వామీ కాస్త పొజి షన్లు సర్దుబాటు చేసుకుంటే ! ” అని కూడా శలవిస్తున్నారు ! వారి ఉవాచ ప్రకారం,శయన మందిరం లో ప్రియుడి మీదగా ప్రియురాలు చేరి, అతని పెదవుల మీద ఒక చుంబనం అందించి , మళ్ళీ దూరం గా జరగడం చేయమంటున్నారు ! ఇట్లా ముద్దులను స్త్రీ ” అందని ద్రాక్ష పళ్ళ లా , అందించీ అందించకుండా ముఖాన్నీ ( తన శరీరాన్నీ ) దూరం గా జరుపుతూ ఉంటే , వ్యాయామం అవడమే కాకుండా , క్యాలరీలు కూడా వ్యయమవుతాయి ! అంటున్నారు ఆమె !
2. వలువలు తీయడం : స్త్రీ పురుషులు రతి క్రియ కు ముందు బట్టలు తీసుకునే సమయం లో కూడా కనీసం ఎనిమిది నుంచి , పది క్యాలరీలు ఖర్చు చేస్తారని తెలిసింది . ఒక ఇటాలియన్ సెక్స్ స్పెషలిస్టు , పురుషుడు కనుక తన చేతులతో కాక తన పళ్ళతో అంటే దంతాలతో, పెదవులతో స్త్రీ ధరించిన బ్రా ను కనుక ఊడ దీస్తే , అప్పుడు, కనీసం అరవై నుంచి డెబ్బై క్యాలరీలు ఖర్చు అవుతాయని ప్రవచించారు ! గిల్డా కార్ల్ అనే సైకో తెరపిస్ట్ ” వడి వడి గా బట్టలు తీసుకుంటే ఉండే ఆనందం కన్నా ,నింపాదిగా , ఒకరినొకరు ఆడించు కుంటూ, దొంగాట లాడుతూ , కొంత సస్పెన్స్ తో కనుక ఈ ( నగ్నం గా సిద్దమయే ) క్రియ జరిగితే కూడా ఒక రకమైన వ్యాయామం అయి , క్యాలరీలు ఖర్చు అయినా , ఆనందం కూడా దక్కుతుందని అంటారు ఆమె !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !
Really interesting. we know this. The younger generation should know about this
True. All these scientists are giving us the ” Vatsayana’s kama sutras ” in a new ” bottle ” !
The younger generation is feeling that speaking about sex is a taboo. vulgarity is to be hated. The discrimination is required.