అంతర్జాలం లో మీ కుటుంబ ఆరోగ్య వివరాల పేటిక , మైక్రోసాఫ్ట్ ” హెల్త్ వాల్ట్ ” Health Vault ” !
మైక్రో సాఫ్ట్ వారు అంతర్జాల వాడక దారులందరికీ అందిస్తున్న విలువైన కానుక హెల్త్ వాల్ట్ !
1. మీ ఆరోగ్య వివరాలన్నీ పొందు పరుచు కోవచ్చు అంతర్జాలం లో !
2. మీ బీపీ మానిటర్ ను మీ కంప్యూటర్ తో అనుసంధానం చేసుకోవచ్చు !
3. మీ హృదయ స్పందన మానిటర్ ను అనుసంధానం చేసుకోవచ్చు
4. మీ రక్తం లో చెక్కర ను సూచించే గ్లూకోజు మానిటర్ ను అనుసంధానం చేసుకోవచ్చు
5. మీ రక్త పరీక్షల , ఎక్స్ రే ల వివరాలను కూడా పొందు పరుచు కోవచ్చు ఇక్కడ !
6. మీరు తీసుకునే మందుల వివరాలు , మీకు ఉన్న ఎలర్జీ ల వివరాలు కూడా ఇక్కడ చేర్చ వచ్చు !
7. మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలనూ ఈ సాఫ్ట్ వేర్ లో ఎక్కించు కోవచ్చు !
8. మీరు ప్రపంచం లో ఎక్కడైనా ( అంతర్జాలం ఉన్న చోట ) మీ వివరాలను ఓపెన్ చేసి చూసుకోవచ్చు !
9. మీరే కాక , మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు !
మీకు కావలసినదేమిటి ?:
మైక్రో సాఫ్ట్ వారు మీకు ఈ అవకాశాన్ని ఉచితం గా అందిస్తున్నారు ! మీకు కావలసినదల్లా మీ కంప్యుటరూ , ఇంకా మీ హాట్ మెయిల్ ( ఈమెయిలు ) అడ్రసూ ! మీకు ఒకవేళ ఇప్పటికే లేకపోతే , హాట్ మెయిల్ లో మీ ఈమెయిలు అడ్రస్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఉచితమే !
శ్రీవిజయ నామ సంవత్సరం లో మీరు మీ కోసమూ , మీ కుటుంబ సభ్యుల కొసమూ , అంతర్జాలం లో హెల్త్ వాల్ట్ ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారా ? అయితే ప్రయత్నించండి ! మైక్రో సాఫ్ట్ వారి ఉచిత కానుక ” హెల్త్ వాల్ట్ ” ! మిగతా అన్ని వివరాలకూ www .healthvault.com చూడండి !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !