పని సూత్రాలు . 42. మీ దైన పరిచయాల వలయం ఏర్పరుచుకోండి !
మీరు పని చేసే ఏ చోట అయినా , మీ తెలివి తేటలనూ , మీ కష్ట పడే స్వభావాన్నీ , సొమ్ము చేసుకుందామనుకునే బాసులే కాకుండా , మిగతా ఉద్యోగులు కూడా మీ ఉపయోగం పొందుదామని చూస్తూ ఉంటారు ! మీ తో పనులు చేయించు కోవడమో , లేదా బాధ్యతా యుతమైన పనులు చేసే సమయం లో ఆ పనులు మీ మీదకు నెట్టి , వారు చల్లగా జారు కుందామనో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ! మరి మీరు పనిసూత్రాలకు నిబద్ధులై ఉండి, అట్లాంటి వారి ప్రయత్నాలను గమనిస్తూ అప్రమత్తం గా ఉండాలి ! మీరు వారికి ఒక ఉదాహరణ కావాలి ! ఒక ఆదర్శం కావాలి , మీ సుగుణాల ద్వారా ! అంటే మీరు నిజాయితీ గా ,విశ్వాస పాత్రులు గానూ , దయాగుణం తోనూ , స్నేహ పూర్వకం గానూ ఉండాలి మీ సహా ఉద్యోగులతో సంబంధాల విషయం లో ! అట్లా ఉంటే , మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని విశ్వసించడం మొదలు పెడతారు ! మీ సలహా తీసుకోడానికి వెనుకాడరు ! సహాయం అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు రావడానికి సందేహించరు ! అంతే కాక మీ కు నిత్యం ” దగ్గర ” గా ఉంటారు ! అందుకే మీరు, మీకు విశ్వాస పాత్రమైన స్నేహితులనూ , పరిచయాలనూ , పెంపొందించు కుంటూ ఉండాలి ! మీరు నిజాయితీ గా నూ విశ్వాస పాత్రులు గానూ మీ ఉద్యోగం చేస్తూఉంటే , మీతో ” చేయి కలపడానికి” అనేకమంది ఉద్యోగులు ముందుకు వస్తారు ! మీరు సదా మీ చిరునవ్వుతో , ఇతర ఉద్యోగుల సమస్యలను అర్ధం చేసుకుని , మానవతా దృక్పధం తో మీకు చేతనైనంత సహాయం చేస్తూ , వారి కి సహకరిస్తూ ఉంటే,మీరు వారి విశ్వాసం సునాయాసం గా పొంద గలరు ! మీరు వారికి చేసే ప్రతి చిన్న సహాయమూ , మీకు వారి లాయల్టీ రూపం లో అందుతూ ఉంటుంది ! మీలో అట్లా నాయకత్వ లక్షణాలు పరిణితి చెందడమే కాకుండా, మీరు మీ దీర్ఘ కాలిక లక్ష్యాలను చేరుకోవడం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి ! ఈ విధం గా మీరు రోజూ వేసే ప్రతి అడుగూ, మీ లక్ష్యాన్ని చేరుకునే దూరాన్ని తక్కువ చేస్తుంది !
ఇంకో పని సూత్రం తరువాతి టపాలో !
Good. kindly put search widget in ur blog