డయాబెటిస్ రిస్కు తగ్గించు కోవడం ఎట్లా ?
క్రితం టపాలో మనం డయాబెటిస్ రిస్కు ఎట్లా కనుక్కోవాలో చూశాము కదా ! ఇప్పుడు మనం తీసుకోవలసిన నివారణ చర్యల గురించి కొంత తెలుసుకుందాం ! ఈ చర్యలన్నీ కూడా అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారి సలహాలే ! కాక పొతే వారు పొందు పరిచిన వివరాలు ఆగ్లం లో ఉన్నాయి ! ఈ క్రింద ఇచ్చిన లింకు మీద మీరు క్లిక్ చేస్తే అవి కనిపిస్తాయి. తెలుగు మాత్రమే వచ్చిన వారికోసం ఈ క్రింద ఆ నివారణ చర్యలు ఇవ్వడం జరుగుతూంది ! ఈ కారణాలన్నీమనలో చాలా మందికి తెలుసుకానీ ఈ కారణాలు ఏ విధం గా మధుమేహానికి లేదా డయాబెటిస్ కు కారణ మవుతాయో అవగాహన ఉండదు. అందువల్ల మనం ఆ విషయాలు కూడా తెలుసుకోవడం ఉత్తమం !
డయాబెటిస్ నివారణ చర్యలు:
1. ఊబకాయం
2. రక్తం లో అధిక గ్లూకోజు ( దీనినే హైపర్ గ్లైసీమియా అంటారు )
3. గర్భం దాల్చినపుడు వచ్చే డయాబెటిస్.
4. అధిక రక్త పీడనం అంటే హై బీ పీ
5. చెడు కొలెస్టరాల్
6. చెడు ఆహారపు అలవాట్లు
7. వ్యాయామం చేయక పోవడం
8. స్మోకింగ్ చేయడం
9. వయసు, మగ వారు, జాతి , ఇంకా కుటుంబం లో ఎవరికైనా డయాబెటిస్ అంత క్రితమే వచ్చి ఉండడం లాంటి ఇతర రిస్కులు.
ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి ” చెకప్ అమెరికా ” అనే డయాబెటిస్ నివారణ వివరాల కోసం !
టపాలో మీకు కావలసిన విషయాలు లభించక పొతే లేదా, ఇంకా వివరాలు కావలిస్తే , తెలియ చేయండి !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !
Good