Our Health

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఏప్రిల్ 1, 2013 at 6:47 సా.

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త ! 

సాధారణం గా , మనం చేసే ఉద్యోగాలలో , ఇతర కొలీగ్స్ , లేదా ఇతర ఉద్యోగులలో అధిక శాతం  మంచి వారే ! వారూ మన లానే , కష్టపడి పని చేసే స్వభావం కల వారే ! కానీ కొద్ది శాతం మంది , మన మీద అసూయా ద్వేషాలు కలిగి ఉంటారు ! ఏదో రూపం లో వెన్ను పోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! ధర్మరాజుకు అందరూ మంచి వారిలానే కనిపించారు ట ! అంటే , ధర్మరాజు అందరిలోనూ మంచినే చూసే వాడుట ! కానీ దుర్యోధనుడు అందరిలోనూ చెడునే చూసే వాడుట ! అంటే దుర్యోధనుడికి అందరూ చెడ్డ వారిలానే కనపడ్డారు ట ! మీరు ధర్మరాజులూ , దుర్యోధనులూ కానవసరం లేదా ప్రస్తుత భారతం లో ! మీకు కావలసినది అప్రమత్తత ! మనం చీకటి గా ఉన్న దోవలో వెలుతురు తోడు లేకుండా నడవడానికి  సందేహిస్తాము !  కానీ ఆ చీకటి లో నడుస్తే, ఎప్పుడో కానీ  పాము కాటు వేయడం కానీ, లేదా ముళ్ళు గుచ్చుకోవడం కానీ , లేదా  గోతి లో పడడం కానీ సంభవించదు  ! ఎప్పుడో జరుగుతాయని , మనం చీకటి లో ఏ  దీపమూ లేకుండా నడవం కదా ! అదే పరిస్థితి మనం చేసే ఉద్యోగం కూడా !  మీ పని మీరు సవ్యం గా చేస్తూ , మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే వారి గురించి మీరు అప్రమత్తత తో ఉండాలి ! ఎప్పుడూ ! మీ అప్రమత్తత మీకు విరోధులను తక్కువ చేస్తుంది. అట్లాగే మీ ఆపదలను కూడా తక్కువ చేస్తుంది ! 
అందుకు మీరు ఏమి చేయాలి ? 
1. వ్యక్తి గత విలువలు నిర్ణయించుకోవడం !  మీరు చేసే ఉద్యోగం లో అప్రమత్తులై ఉండడం అంటే, ముందుగా ,  మీకు మీరు గా,  కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి ! ఆ విలువలు మీ శీలాన్ని అంటే మీ క్యారెక్టర్ ను దృ ఢ మైనది గా చేస్తాయి ! ఇతరులు వేలు పెట్టి మీలో తప్పులు ఎంచ డానికీ , లేదా వెన్ను పోటు పొడవడానికీ జంకుతారు ! మీరు ఏర్పరుచుకునే వ్యక్తిగత విలువలు అనేకం ఉండవచ్చు ! కానీ అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగం లో మీ సమగ్రత అంటే ఇంటిగ్రిటీ ను బలోపేతం చేసేవి గా ఉండాలి ! 
ఉదాహరణకు : మీరు ఈ క్రింది విధం గా,  మీలో మీరు ప్రతిన బూన వచ్చు : 
” నేను నా ఉద్యోగం కోసం ఇతరులను ( అంటే ఇతర ఉద్యోగులను ) ఏరకంగానూ శారీరికం గానైనా , మానసికం గానైనా హింసించను !”
నేను పని చేసే కంపెనీ నిబంధనలు ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించను ”
” నేను నా నీతి నియమాలను కూడా ఎప్పుడూ పాటిస్తాను ” !
” నా యజమాని శ్రేయస్సుకూ , నా కుటుంబ శ్రేయస్సు కూ ఎప్పుడూ పాటు పడతాను ” !
”ఉద్యోగం లో నాకు తెలిసిన నిపుణత అంటే స్కిల్స్ , ఇతర ఉద్యోగులకు , ఏ స్వలాభాపేక్షా  లేకుండా నేర్పుతాను”  ! 
నేను ఉద్యోగం చేసే చోట , ఇతర సహోద్యోగులు ఎవరైనా పదోన్నతి పొందినా , నేను ఏ విధమైన అసూయా ద్వేషాలను పొందను , వారిమీద ప్రదర్శించను ”
ఈ రకమైన వ్యక్తి గత విలువలను మీకు మీరే ఏర్పరుచుకునే లక్ష్మణ రేఖలు ! వీటికి బద్ధులై ఎప్పుడూ , మీ పూర్తి శక్తి యుక్తులను మీరు చేసే ఉద్యోగం లో ప్రదర్శించడం అలవాటు చేసుకుంటే, మీరు మానసికం గా అత్యంత బలవంతులవుతారు ! దానితో మీ లక్ష్యాలు మీరు చేరుకోవడం సులభమవడమే  కాకుండా ,మీ ఉద్యోగం లో మీకు శత్రువులు ఏర్పడరు, ఒకవేళ ఏర్పడినా,  వజ్రం లాంటి మీ శీలాన్ని ఛే దించ లేరు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
  1. దుర్యోధనుడి గూర్చి వ్రాసింది తప్పు, ఇక్కడ చదువుకోండి…సోది మనుషులు చెప్పేది ఎందుకు నమ్మాలి గుడ్డిగా..
    http://en.wikipedia.org/wiki/Duryodhana#Positive_Traits

    సలహాలు ఇవ్వటం కాదు. అందరూ ఇవ్వగలరు సలహాలు. అనుభవాలు పంచుకోండి.

  2. భయంకర్ గారూ , మీరు సూచించిన లింక్ లో వ్యాసం మొదటే ఈ క్రింది గమనిక ఉంది !
    ” This article has multiple issues. Please help improve it or discuss these issues on the talk page.
    This article needs additional citations for verification. (December 2012)
    The neutrality of this article is disputed. (December 2012) ”

    నేను దుర్యోధనుని గురించి ప్రస్తావించడం, కేవలం ఇతరులనందరినీ , మంచి వారు అనుకున్నా, మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి , ప్రత్యేకించి మన ఉద్యోగాలలో, అని చెప్పడానికే జరిగింది ! ఇది మీకు ఆమోదయోగ్యం గా లేనందుకు చింతిస్తున్నాను !
    ఇక నా అనుభావాలంటారా, నేను, నా అనుభవాల గురించి రాసుకునేంత ” పెద్ద వాణ్ని ” ఇంకా కాలేదనుకుంటున్నా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: