పని సూత్రాలు . 17. మీ స్టైల్ ఎట్లా కనిపించాలి ?:
1. మీ ప్రత్యేకమైన స్టైల్ ఇతరులకు కనిపించాలంటే , మీ ట్రేడు మార్కు బట్టలనే ఎప్పుడూ ధరించండి !
2. బట్టలను ఎప్పుడూ చాలా బిగుతు గా అంటే టైట్ గా ఉన్నవి ధరించకండి ! ఎందుకంటే , బిగుతు గా ఉన్న బట్టలు , మీరు ఏ కారణం చేత వేసుకుంటున్నా , మీరు చాలా పీనాసి గా కనిపించడం జరుగుతుంది ! అంటే మీరు మీ కోసం మంచి బట్టలు కూడా కొనరన్నతేలిక అభిప్రాయం ఏర్పడుతుంది చూసే వారికి . కొద్దిగా వదులు గా ఉన్న బట్టలు వేసుకుంటే , మీలో ఎంతో ” నాణ్యత ” అంటే క్వాలిటీ , ఎంతో హుందాతనం కనిపిస్తుంది మీలో , ఇతరులకు !
3. మీరు వేసుకునే బట్టలు కొంత ఆలస్యం గా కొంటున్నా , మంచి నాణ్యత గల బట్టలు కొనండి ! అంటే మీరు ఆరు నెలలకు ఒక సారి చవక బట్టలు కొనే కంటే, తొమ్మిది నెలలకు ఒకసారి , మంచి నాణ్యత గల బట్టలు కొనుక్కుని వేసుకుంటూ ఉండండి !
4. ఆభరణాలను మీ ఆఫీసులో తక్కువగా ధరించండి ! కానీ పెట్టుకునేవి చాలా నాణ్యత గల , ఖరీదు గల వాటినే పెట్టుకోండి ! విచ్చల విడి గా ఖర్చు చేసి ఆభరణాల ఎగ్జిబిషన్ కోసమా అన్నట్టు ఆఫీసు కు పెట్టుకోవడం మీ అలంకరణ పట్ల మీకున్న రుచి అంటే టేస్ట్ మీద ఇతరులకు అనుమానాలు రేకెత్తిస్తుంది ! అంతే కాక విపరీతం గా ఖర్చు చేస్తుంటే , మిమ్మల్ని మీ ఇతర కొలీగ్స్ ” వేరు చేసి చూసే ‘ ప్రమాదం ఉంటుంది ! అంటే మీరు వారి ”గ్రూపు ” కు చెందిన వారిగా వారు భావించరు !
5. మీరు యువతులయితే , మీరు ఏ మేకప్ వేసుకుంటే ఎక్కువ అందం గా కనబడతారో , అదే మేకప్ రోజూ వేసుకుంటూ ఉండండి ! ఎండా కాలానికీ, వానా కాలానికీ , లేదా చలికాలానికీ , ఇట్లా ఒక్కో ఋతువు కు ఒక్కో మేకప్ వేసుకోవడం పని సూత్రాలకు విరుద్ధం ! మిమ్మల్ని అందం గా గుర్తు ఉంచుకునే మేకప్ నే ఎప్పుడూ వేసుకుంటూ ఉండండి !
6. చాలా నిరాడంబరం గా వస్త్ర ధారణ చేసుకోవడం కన్నా , కాస్త డాబు దర్పం గా నే ఉండేట్టు మీ బట్టలు వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం అలవాటు చేసుకోండి !
7. మీరు మీ శరీరం మీద బట్టలైనా , పాదరక్షలైనా , లేదా ఆభరణాలు అయినా ధరించేప్పుడు మీరు ప్రత్యేకం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం !
అవి ఎప్పుడూ , నాణ్యత ఉన్నవీ , ప్రియమైనవీ , స్టైలిష్ గా ఉన్నవీ , అవి ధరించిన మిమ్మల్ని గుర్తు పట్టేవీ అయి ఉండాలి . అంతే కాక అవి మీ అందాన్నీ , హుందా తనాన్నీ ఇనుమడింప చేసేవి గా ఉండాలి !
పని సూత్రాలలో మీ వస్త్ర ధారణా , మీరు ధరించే ఆభరణాలూ , పాదరక్షలూ , మీ మేకప్ , ఇవన్నీ , మీలో ఉన్న కళా దృష్టి ని ప్రతిబింబించడమే కాకుండా , స్టైలిష్ గా కూడా కనిపించాలి ! ఉద్యోగం లో మీ పురోగతి కి ఇవి ఎంత గానో సహకరిస్తాయి !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !