పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?
నిన్నటి టపా లో మనం తెలుసుకున్నాం , పరీక్షల ముందు పిల్లలు పడే ఆందోళన, ఆతురత ,వారు రాసే పరీక్షలను ఎట్లా ప్రభావితం చేస్తుందో ! వారి అసలు మేధ ను ఎట్లా తక్కువ చేసి చూపిస్తుందో ! మరి ఆ ఆందోళన తగ్గించి వారి ప్రతిభను సరిగా చూపించేట్టు చేయడానికి వారు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !
1. ఆందోళనలను ముట్టడించడం ! :
చాలా మంది విద్యార్ధులు , పరీక్షకు ముందుగా , ఆందోళనా , యాంగ్జైటీ చెందినా , వారు పరీక్షా సమయం లో , ప్రశ్నలను చదివి , వారికి గుర్తు వచ్చిన సమాధానాలు రాస్తూ ఉంటారని. కానీ వారి ఆందోళనల వల్ల , వారి సమాధానాలలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.సాధారణం గా మన జ్ఞాపక శక్తి , వర్కింగ్ మెమరీ ఇంకా స్టోర్డ్ మెమరీ అని ప్రధానం గా రెండు రకాలు గా ఉంటుంది. మనము ఏ పని చేయాలన్నా , ఈ రెండు రకాల మెమరీ కూడా అవసరం. ప్రత్యేకించి వర్కింగ్ మెమరీ , పరీక్షలు రాసే సమయం లో ముఖ్యం గా అవసరం ఉంటుంది. ఎందుకంటే , ఇచ్చిన ప్రశ్నను అర్ధం చేసుకుని,మన మెదడులో నిక్షిప్తమై ఉన్న మెమరీ అంటే అంతకు మునుపు నేర్చుకున్న , విజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ , సమాధానం రాయడం జరుగుతుంది. పరీక్షల ముందు తీవ్రం గా ఆందోళన చెందిన విద్యార్ధులు , ఈ వర్కింగ్ మెమరీ ను సరిగా ఉపయోగించ లేక పోతారని తెలిసింది. ఎందుకంటే ఆందోళనా, యాంగ్జైటీ లు ,వారి వర్కింగ్ మెమరీ ను కొంత మేర వినియోగించు కుంటాయి , దానితో ప్రశ్నలకు , సమాధానాలు రాయడానికి సరిపోయేంత వర్కింగ్ మెమరీ మిగిలి ఉండదు. మరి ఈ సమస్యను అధిగమించడం కష్టమేమీ కాదంటారు , మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు. అది ఎట్లా అంటే , వారు ఎక్స్ ప్రెసివ్ రైటింగ్ అనే పధ్ధతి ని అనుసరించాలి.
ఎక్స్ ప్రెసివ్ రైటింగ్ అంటే ఏమిటి : ఈ పధ్ధతి లో విద్యార్ధి చేయవలసినది ,పరీక్ష రోజుకు ముందు , కేవలం పది నిమిషాలు తన ఆందోళన లనూ , యాంగ్జైటీ లనూ ,ఇంకా పరీక్ష గురించి తనకు ఉన్న భయాలనూ , ఒక పేపర్ మీద రాయడమే ! ఇట్లా చేయడం వల్ల వారు, వారి భయాందోళన లను తాత్కాలికం గా , తమ మెదడు లోనుంచి తీసివేసి , పేపర్ మీద పెడుతున్నారన్న మాట ! ఇట్లా చేయడం వల్ల పరీక్ష ముందు, విద్యార్ధుల భయాందోళన లు ఇంకా ఎక్కువ అవ గలవని కొందరు సందేహాలు వెలిబుచ్చినప్పటికీ , అనేక పరిశీలనల వల్ల , ఈ పధ్ధతి పాటించడం వల్ల విద్యార్ధులకు మార్కులు ఎక్కువ గా వస్తున్నాయని తెలిసింది. ఎందు వల్ల నంటే , ఇట్లా పేపర్ మీద రాసుకున్న విద్యార్ధులకు , ఉపయోగించడానికి , వారి వర్కింగ్ మెమరీ పూర్తిగా వినియోగం లోకి వస్తుంది ( భయాందోళన లు పేపర్ మీదకు మార్చ బడ్డాయి కాబట్టి ) ఈ పరిస్థితిని ఇంకో ఉదాహరణ ద్వారా వివరించ వచ్చు. మనం కంప్యూటర్ వాడుతున్నపుడు , అనేక సైట్లను ఒకేసారి ఓపెన్ చేశామనుకోండి. అప్పుడు మనకు కావలసిన సైటు మనకు దొరకడం ఆలస్యం అవుతుంది ఎందుకంటే, కంప్యూటర్ లో మెమరీ ఎక్కువ ఉన్నా కూడా , వర్కింగ్ మెమరీ , అంటే ప్రాసెసింగ్ పవర్ పరిమితం గా ఉంటుంది కాబట్టి , వీలైనంత వరకూ , మనం ఒక సమయం లో ఒక సైటు నే చూస్తూ ఉండాలి ( ప్రాసెసింగ్ స్పీడు ఎక్కువ గా ఉన్న కంప్యుటర్ లకు ఇట్లాంటి సమస్యలు ఉండవనుకోండి ! )
వచ్చే టపాలో మిగతా పద్ధతులు !