అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?
సాధారణం గా మనమందరమూ , అప్పు చేయడానికి సందేహిస్తూ ఉంటాము. మన ఆదాయం మించి ఖర్చులు అవుతున్నప్పుడు కంగారు పడతాము. ఎవరి దగ్గర అప్పు చేయ వలసి వస్తుందో అని, అప్పు చేయడానికి కూడా సంకోచిస్తూ ఉంటాము. వీలైతే అప్పు లేని జీవితం గడుపుదామని అనుకుంటాము.కానీ వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ , ఆదర్శాలకూ , ఆశయాలకూ భిన్నం గా ఉంటాయి కదా ! మనం, మన పరిస్థితులకు , క్రెడిట్ కార్డులు ఎంతవరకు కారణమో చూద్దాం !
అప్పు చేసే వారికి క్రెడిట్ కార్డ్ లు ” దేవుడిచ్చిన ” వరం ! ఈ ప్రపంచం లో అనేక కోట్ల మందిని ఒక్క సారిగా ఋణ గ్రస్తులను చేయడానికి ఉపయోగ పడే అతి చిన్న సాధనం ! అనేక పరిశీలనల వలన మనం కరెన్సీ అంటే డబ్బు నోట్ల రూపం లో మన చేతుల్లో ఉన్నప్పుడు , ఖర్చు చేయడానికి వెనుకాడు తాము , కానీ క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు , ఆ జంకు పోయి ” హుందాగా ” క్రెడిట్ కార్డ్ ఫ్లాష్ చేస్తూ ఉంటాము.మన చేతిలో ఉన్న డబ్బు తో కాకుండా క్రెడిట్ కార్డు ఇచ్చి కొన్న వస్తువులను , ఆనందం గా కొంటాము ! ఆ సమయం లో మనం అనుభవించే ఆనందం, డబ్బు పెట్టి ,కొనే సమయం లో వచ్చే ” విచారాన్ని ” కను మరుగు చేస్తుంది ! మన మానసిక స్థితిని క్రెడిట్ కార్డ్ ఆ విధం గా ట్యూన్ చేస్తుంది. చాలా పరిశీలనల వల్ల , మన చేతిలో డబ్బు నోట్ల రూపం లో ఉన్నప్పుడు , మనం జాగ్రత్త గా ఆచి తూచి ఖర్చు చేస్తూ ఉంటాం అని తెలిసింది.
చాలా మంది చేయని ఇంకో పని ఉంది ! అది డబ్బు విలువ తెలుసుకోవడం ! అంటే డబ్బు గురించి మనకు ఉన్న అవగాహన ఏమిటి ? మన జీవితాలలో డబ్బుకు ఏ స్థానం ఇస్తున్నాము, ఇవ్వదలుచుకున్నాం , ఇవ్వ బోతున్నామనే విషయాలను , వివరం గా తెలుసుకోవాలి. కేవలం మనకు ఉన్న డబ్బు బట్టే , మన ఆస్తిత్వమూ , ఉనికీ ఆధార పడి ఉందా? ఆ విధమైన ఆలోచన ఇంకేవరిదోనా , లేక మన నమ్మకమా ? డబ్బు లేక పొతే మనం లేమా ? ! ఈ ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు రాబట్టు కావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి , తమంత తామే !
క్రెడిట్ కార్డు తో ” ఋణాను బంధం ” ఎట్లా పెరుగుతుంది?:
ఒక ఉదాహరణ : లక్ష రూపాయలకు ఒక ఆకర్షణీయమైన టెలివిజన్, కనుక మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నట్టయితే , దానికి మీరు మినిమమ్ పేమెంట్ కేవలం నెలకు వెయ్యి రూపాయలు అనుకుంటే ,కనీసం నూట యాభై నెలలు కడుతూ ఉండాలి , వడ్డీ తో కలిపి ! మీరు ఆ సమయం అంటే కనీసం పన్నెండు సంవత్సరాలకు పైగా , నెలకు వెయ్యి రూపాయలు కడుతూ ఉంటే , కనీసం లక్షన్నర రూపాయలకు పైగా మీరు మీ శ్రమ ఫలితాన్ని క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అప్పు తీర్చడానికి ధార పోయాల్సిందే కదా ! అదే మినిమమ్ పేమెంట్ లో ఉన్న కిటుకు ! మానవులను దీర్ఘ కాలికం గా ” ఋణ గ్రస్తులను ” చేయడమే ! అదే మీరు ( మీ కోరికలను నియంత్రించుకుని ) ఆ టెలివిజన్ కొనకుండా, మీ డబ్బును నెలకు వెయ్యి రూపాయల చొప్పున బ్యాంకు లో వేసుకుంటే ( వచ్చే వడ్డీ తో సహా ) మీకు ఎంత డబ్బు జమా అవుతుందో ఊహించుకోండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
అతి సర్వత్ర వర్జయేత్
Good analysis doctor.. but some times we need to live for our society to showoff our IPhones, IPads incase of men and women ,jewellary incase of indian women..so these things are nonessential things.. we feel rush to buy.. we have seen how whole world went crazy for Iphone 5, though it is not a master piece people bought it.. so is the case with our indians regarding Akshaya Tritiya.. Marketing when amalgamated with sentiments…its Mad rush for people and gold rush for business
Dear Krishna,
I am not against anybody buying any latest gadgets.All purchases are OK, as long as they do not affect their mental and physical well being. The discretion is individual.
Dear Krishna,
I am not against anybody buying any latest gadgets.All purchases are OK, as long as they do not affect their mental and physical well being. The discretion is individual.