అనీమియా ( రక్త హీనత ) కీ ఇనుము కూ ఉన్న సంబంధం ఏమిటి ?:
మనం క్రితం టపాలలో మన దేహానికి అవసరమయే విటమిన్ల గురించి తెలుసుకున్నాం కదా , మరి మనకు అవసరమయే ఖనిజాల సంగతి కూడా చూద్దాం !
మనకు అవసరమయే ఖనిజాలలో ముఖ్యమైనది ఇనుము , అదే ఐరన్. మన పోషకాహారం లో ఇనుము లోపిస్తే అది రక్త హీనత కలిగిస్తుంది. మానవులలో సామాన్యం గా రమారమి అయిదు లీటర్ల రక్తం ఉంటుంది. మరి ఇనుము లోపం కలిగితే అయిదు లీటర్ల రక్తం కాస్తా తగ్గిపోయి నాలుగు లీటర్లు అవుతుందా ? దీనికి సమాధానం” కాదు ”. రక్త హీనత అనగానే రక్తం తక్కువ గా ఉన్నట్టు అర్ధం వస్తుంది కానీ , ఇనుము లోపించి నప్పుడు జరిగేది రక్తం పలుచ బడడం ! రక్తం తక్కువ అవడం అనేది , మన దేహం లో రక్తం ఏ భాగం నుంచైనా కారిపోతూ ఉంటే కానీ , లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ , జరుగుతుంది. మన రక్తం పలుచ బడ దానికి ప్రధాన కారణం మన పోషకాహారం లో ఇనుము లోపించడమే !
ప్రశ్న : మరి ఇనుము పుష్కలం మనం ఏవిదం గా తీసుకోగలం ?
జవాబు : శాక హారులకు :
ముదురు ఆకు పచ్చ రంగులో ఉండే ఏ ఆకు కూరలైనా , లేదా కూరగాయలైనా .
బీన్స్, సోయా బీన్స్, ధాన్యాలు , పప్పులు కూడా ఇనుము ఉండే పదార్దాలే !
మాంసాహారులు : మాంసం , కాలేయం లో ఇనుము బాగా ఉంటుంది.
ప్రశ్న: మనకు రోజూ ఎంత ఇనుము అవసరం ?
జవాబు : పురుషులకు ఎనిమిది మిల్లీ గ్రాములకు పైగా నూ , స్త్రీలకూ పద్నాలుగు మిల్లీ గ్రాములకు పైగానూ అవసరం ఉంటుంది.
ప్రశ్న: ఈ రోజుల్లో రక్త హీనత మనకు ఏవిధం గా వస్తుంది? :
జవాబు: రోజూ చిన్న పిల్లలకు ఆకు కూరలు లేని వంటలు వండి పెట్టడం వల్ల . అంతే కాకుండా , వారికి బజారులో దొరికే ” చెత్త తిండి ” లేదా జంక్ ఫుడ్ ” అలవాటు చేయడం వల్ల . బర్గర్లూ , పిజ్జా లూ , కేవలం అనారోగ్య కరమైన కానీ రుచికరం అయిన కాలరీలు ఇస్తాయి కానీ , పోషక విలువలు ఏవీ ఉండవు.
ప్రశ్న : స్త్రీలలో రక్త హీనత ఏవిధం గా వస్తుంది ?! :
జవాబు : స్త్రీలలో సామాన్యం గా రెండు విధాలు గా రక్త హీనత కలుగుతుంది. సహజమైన ఋతుక్రమం లో కలిగే రక్త స్రావం వల్ల , ఇనుము లోపిస్తుంది. ఇట్లా లోపం సహజం గా ఉన్నప్పుడు కనుక ఇనుము ను పోషకాహారం లో కూడా తీసుకోక పొతే , ఆ లోపం ఎక్కువ అవుతుంది. అది అనీమియా లక్షణాలు గా కనిపిస్తుంది.
ఈ రక్త హీనత లక్షణాలను గురించి వివరం గా వచ్చే టపాలో తెలుసుకుందాం !