స్త్రీల మీదా, బాలికల మీదా హింస ఏ రకాలు గా ఉంటుంది ?:
మనం క్రితం టపాలలో ” మన ” భారత దేశం లో స్త్రీల మీద హింస గురించిన గణాంకాలు ( మచ్చు కి 2010 సంవత్సరం ) చూశాము కదా !
ఇప్పుడు మనం భారత స్త్రీల మీదా ఆడ శిశువుల మీదా ఈ హింస ఏ రకాలు గా ఉంటుందో చూద్దాం !
1. మన దేశం లో సర్వ సాధారణమైన హింస , స్త్రీల మీద జరగ దానికి ప్రధాన కారణం ” ఇచ్చిన కట్నం తో ( ” భర్త ” గానీ , భర్త తరుఫు వారు గానీ ) సంతృప్తి చెందక , ఆ కోపాలూ , అసంత్రుప్తులూ ఆ అమాయక స్త్రీ మీద నిరంతరం గా ఏదో రూపం లో చూపించడం జరుగుతుంది. అనుమాన పిశాచం తో వేధింప బడిన ” భర్త ” కానీ వారి తరుఫు వారు కానీ వివిధ తీవ్రత ల లో ” భార్య ” ను హింసించడం జరుగుతుంది. ఈ అనుమానపు పిశాచి ఆవహించిన ఒక ” భర్త ” చేసిన నిర్వాకం తండూరి మర్డర్ గా తీవ్ర సంచలనం కలిగించింది కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ లో !
( ఈ తండూరి హత్య వివరాలలోకి వెళితే , నయనా సహాని ఒక అందమైన స్త్రీ ( పైన ఉన్న ఫోటో చూడండి ) , ఆమె అనేక తీపి కలలు కంటూ , ఒక కాంగ్రెస్ నేత , ఎమ్మెల్యే కూడా అయిన సుషీల్ శర్మ ను వివాహమాడింది. నయనా సహానీ స్వతహా గా కాంగ్రెస్ కార్యకర్త . సుషీల్ శర్మ స్నేహితుడు మత్లూబ్ కరీం కూడా కాంగ్రెస్ కార్య కర్త. మత్లూబ్ కరీం కు నయనా సహానీ ముందే తెలిసి ఉండడం తో , వారి స్నేహం , సుషీల్ శర్మ లో అనుమాన పిశాచం దిన దినాభి వృద్ధి చెందడానికి దోహద పడ్డది. ఒకరోజు , ఇంటికి తిరిగి రాగానే , మద్యం సేవించి , ఫోనులో మాట్లాడుతూ ఉన్న నయనా సహానీ సుషీల్ శర్మ కంట బడ్డది ! దానితో విపరీతం గా కోపోద్రేకుడైన సుషీల్ శర్మ భార్య ఎవరికీ ఫోన్ చేసిందో నంబర్ చూసి కనుక్కున్నాడు. అది మత్లూబ్ కరీం దే ! వెంటనే సుషీల్ శర్మ తన సొంత భార్యను పిస్టల్ తో షూట్ చేసి చంపేశాడు ! తరువాత ( నయనా సహానీ శవాన్ని , తన స్నేహితుడైన కేశవ్ కుమార్ రెస్టారెంట్ ఒకటి ” బగియా ” అని ఉంది , అక్కడికి తీసుకు వెళ్ళాడు ! కేశవ్ కుమార్ ను ఉపాయం చెప్ప మన్న్నాడు శవాన్ని మాయం చేసే ఉపాయం ! తాను , తన భార్యను హత్య చేశాడనే నిప్పు లాంటి నిజాన్ని , తండూరీ నిప్పుల్లో కప్పేసి దాచేద్దామని అనుకున్నాడు ! అందుకోసం కేశవ్ కుమార్ సహాయం తో మరణించిన తన భార్య నయనా సహానీ శరీరాన్ని ముక్కలు ముక్కలు గా చేసి , తండూరి కుంపటి లో వేశాడు ! అనుమాన పిశాచి కాస్తా పూర్తిగా ఆవహించి సుషీల్ శర్మ ను ఒక మానవ పిశాచి గా, ఒక మానవ కసాయి గా మార్చేసింది ! నిజాన్ని నిప్పుల్లో కప్పేద్దామని అనుకున్న మానవ కసాయి ఎత్తు పారలేదు ! ఆ రాత్రి , కాపలా పోలీసులు ఇద్దరి కంట , ఎప్పుడూ తండూరీ పొగ గొట్టం లోనుంచి వచ్చే పొగ , ఇంకా ఎక్కువ గా , ( నర ) మాంస వాసనతో వస్తూ ఉంటే , అనుమానించి, రెస్టారెంట్ లో కి వెళ్ళారు. ఆ సమయం లో కేశవ్ కుమార్ తో సహా సుషీల్ శర్మ తప్పించుకుని పారి పోయాడు. ఒక వారం రోజుల తరువాత పోలీసులకు లొంగి పోయాడు. శవ పంచనామా ( పోస్ట్ మార్టం ) మొదటి సారి జరిపినప్పుడు దొరకని రెండు బుల్లెట్ లు , ( ? !! ) రెండో సారి ఒక ప్రొఫెసర్ జరిపిన పంచనామా లోనయనా సహానీ తల, మెడ భాగాల లోదొరికాయి ! . దానితో సుషీల్ కుమార్ కు కోర్టు వారు మరణ దండన విధించారు కనీసం పది ఏళ్ళు గా ఆ ” పిశాచ కుమార్ ” జైలు చువ్వలు లెక్క పెడుతూ ఉన్నాడు, సుప్రీం కోర్టు తీర్పు కోసం ! )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
This type of cases are not exclusive to India only, they are universal.