స్త్రీ హింస – భారత్ లో(మచ్చుకు 2010 ) గణాంకాలు !
( ఒక బ్లాగు సందర్శకుడు క్రితం టపాలో ఇచ్చిన గణాంకాల మీద సందేహం వెలిబుచ్చడం జరిగింది. అతనికే కాక, మిగతా వారికి కూడా వివరం గా తెలియ పరచాలానే ఉద్దేశం తో ఈ క్రింది లింక్ ను యధా తదం గా ఆంగ్లం లో ఇవ్వడం జరిగింది ) .
ఈ గణాంకాలు భారత్ లో 2010 సంవత్సరం లో సేకరించినవి. వీటిద్వారా స్త్రీల మీద హింస ఏ రకం గా ఉంటుందో , ఎంత తీవ్రం గా ఉంటుందో కూడా మనకు విశదమవుతుంది ! ఇక్కడ మనమందరం గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ గణాంకాలు అన్నీ కేవలం రిపోర్ట్ చేసిన లేదా రిపోర్ట్ చేయబడిన సంఘటనల ద్వారా సేకరించినవే ! అంటే మనం ఊహించుకోవచ్చు , రిపోర్ట్ అవకుండా అసలు ఏవైనా సంఘటనలు జరుగుతున్నాయా ( !!!??? ) అవుతే ఎన్ని రెట్లు ఎక్కువ గా జరుగుతున్నాయో కూడా ఊహించు కోవచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం !
నేను అదే అడిగాను ఊరు పేర్లు వ్రాయమని – వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని వాళ్ళకి కావలసినవి నేను సమకూర్చగాలిగితే సమకూర్చుదాం అని.
ఇక రెండవది మా ఇంట్లో వచ్చి ఎవరూ అడగలేదు మరి ఈ లెక్కలు ఎక్కడివి?
సరే అడిగారు అనుకుందాం అందరూ నిజాలే చెప్పారు అని ఏమిటి నమ్మకం?
మూడవ విషయం ఇద్దరూ తగువులాడుకున్న విషయాలు గురించి చర్చించారా?
ఇక నేను పురుషాధిక్య సమాజంలో వ్యక్తిని కాబట్టి అలా మాట్లాడుతున్నాను అని అందరూ అనుకుంటారు, నిజం చెప్పనా నా బంధవులు తప్ప ఏ ఆడవాళ్ళు నన్ను మనిషిగా చూడట్లేదు(అంటే నేను అలా చూస్తున్నాను అని మీరు అద్దం నా ముందు పెడతారేమో పెట్టొద్దు, నా శరీర ఆకృతి నాకే నచ్చదు ఇక ఎదుట వారికి ఎలా నచ్చుతుంది)
నా బాధలు నావి, నేను చేసిన తప్పులకు నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను, కానీ నా దరిద్రం ఏమిటో ఇంకొకరు చేసిన తప్పు నేను ఎందుకు చెయ్యలేదు అని ప్రతీ ఒక్కడూ చూపించే వాళ్ళే.
ప్రసాదు గారూ ,
ఈ టపాలు మిమ్మల్ని ఉద్దేశించినవి కాదు కదండీ ! మీకు సందేహాలు ఉంటే , అవి మీ వ్యక్తిగతమైనవి ! ఇక నమ్మడం నమ్మక పోవడమనే విషయం కూడా పూర్తిగా మీ ఇష్టా ఇష్టాల మీద ఉంటుంది ! ఇక్కడ గుర్తుంచు కోవలసినది ఏమిటంటే , ఎవరి మీదా నా అభిప్రాయాలను రుద్దే ఉద్దేశం లేదు. నాకు తెలిసిన విషయాలను కొన్నింటిని ఈ బ్లాగు ద్వారా తెలిపి, తెలుగు వారికి ఆ విషయాల మీద అవగాహన ఎక్కువ చేద్దామను కుంటున్నాను ! ఇంకో విషయం. స్త్రీ హింస గురించి టపా రాస్తుంటే , పురుష హింస లేదని కాదు, మీరు అది అనుభవించారో ఏమో నాకు తెలియదు కూడా ! ఎప్పుడూ ఆనంద కరమైన విషయాలే రాస్తూ ఉంటే , వాస్తవాలకు దూరం గా నే ఉండడం జరుగుతుంది కదా ! అంతే కాక , హింస కు ఎవరు గురి అయినా , మానసిక విశ్లేషణ చేసుకోవడం మంచిదే కదండీ , వాస్తవాలను దాట వేయకుండా ! ఇక ఈ హింస ను ఏవిధం గా నివారించడం కానీ తగ్గించడం కానీ చేయాలి ? అంటే, అది ప్రతి ఒక్కరి మీదా ఆధార పడి ఉంటుంది. ఉత్సాహం ఉంటే , మిగతా టపాలు కూడా చూడండి, లేక పొతే ఈ టపాలు మీరు మౌస్ తో ఒక్క క్లిక్ చేస్తే మాయ మవుతాయి కదా !
భారత దేశమే కాదు, ఈ విషయం లో పాశ్చాత్య దేశాలూ ఘోరమయిన పరిస్థితిలోనే ఉన్నాయి. కొంతలో కొంత మేలు సత్వర న్యాయం జరుగుతుంది, అక్కడ. అక్కడ కూడా హింస జరగకుండా చూసే చర్యలు పూజ్యమేననుకుంటా.హింసకి ఆద్యులు వారేనేమో 🙂 కొన్ని దేశాల హింసా చరిత్ర కూడా ఇవ్వండి సార్.
చక్క గా విశ్లేషణ చేశారు శర్మ గారూ ! మీకు తెలుసు కదా ప్రపంచం లో జరుగుతున్న హింస గురించి రాయాలంటే నేను నా ఉద్యోగం మానేసి , ఫుల్ టైం బ్లాగింగ్ చేయాలి ( అది కూడా సరిపోదేమో ! )
మీరన్నట్టు , మిగతా దేశాలు శాంతి యుతం గా ఏమీ లేవు ! కాకపొతే పోలీసులు , చట్టానికి సంబంధించినంత వరకూ, బ్రిటన్ చాలా నయం. ( నేను ఇక్క్డడ ఉంటున్నా కాబట్టి ఈ విషయం చెప్ప గలుగు తున్నా ! )
ఇక హింసకు ఆద్యులు ఎవరైనా, మన ( భారత ) దేశం లో , సమాజం లో జరిగే హింసాత్మక సంఘటనలన్నింటినీ రాజకీయం చేసి ( మన నేతల లాగా ) ” ఇదంతా విదేశీ కుట్ర ” అందామంటారా ?!!
(నా టపాల లో రాద్దామనుకున్నది కేవలం స్త్రీ హింస గురించే కదా ! )