…. స్ఫూర్తి రాజ బాట లోకి ఎట్లా వెళ్ళ గలం ?:
6. సమయం తీసుకోండి : మీరు నిర్ణయించుకున్న లక్ష్యం లేదా పనిని కొన్ని భాగాలు గా విభాజించుకోండి. మానవ మస్తిష్కం అంటే మెదడు మనం చేసే పనులు చిన్న చిన్నవి గా ఉన్నప్పుడు వత్తిడి తక్కువ గా ఉండి మనం ఆ పనిని ఉత్సాహం తో చేయగలగ డానికి మోటివేట్ చేస్తాయి.అందువల్ల మన లక్ష్యం మొత్తం మీద పెద్దదైనా , చిన్న చిన్న భాగాలు గా విభజించి ఒక నిర్ణీత సమయం ప్రాతిపదిక గా కనుక పూర్తి చేయగలుగుతూ ఉంటే , మనం మన లక్ష్యాన్ని ఉల్లాసం గా సకాలం లో చేరుకో గలుగుతాము ! అంతే కాక , చేసే పనులు చాలా రకాలు గా ఉంటే , మనకు వీలైనప్పుడు ఒక్కో పని కూడా పూర్తి చేస్తూ ఉండ వచ్చు . అంటే మనం ఒకే పనిని పూర్తి అయే వరకూ చేయ నవసరం లేదు. ఇట్లా చేయడం వల్ల ఒకే పని చేస్తున్నప్పుడు కలిగే విసుగును మనం నివారించు కోవచ్చు ! కాస్త చేసే పనులలో వెరైటీ కనుక ఉంటే !
7. ఆత్మావలోకనం : జీవితం లో ఒక వయసు వచ్చిన తరువాత అంటే టీనేజ్ దాటినప్పుడు , కొంత పరిణితి వస్తుంది ఆలోచనలలో, చేతలలో ! ముఖ్యం గా మనం చేసే పనులకు మనమే బాధ్యత వహించడం కూడా జరుగుతుంది. అంటే మనం మనం చేసే పనులు పొర పాటు కనుక అవుతే దానికి ఇతరులను నిందించ లేము ! అందువల్ల తరచూ ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి మనలో మనమే ! మన జీవితం లో మనం తీసుకో బోయే నిర్నయాలకూ, చేరుకోవాలనుకునే లక్ష్యాలకూ , మనమే ప్రేరణ కావాలి ! ” నేను ఈ పని చేయగలను ” ” నేను బ్రేక్ తీసుకునేది ( అంటే విరామం ) తీసుకునేది నేను చేస్తున్న ఈ పని పూర్తి చేసిన తరువాత మాత్రమె ” అని మనకి మనమే ఒక క్రమ శిక్షణ అలవరచు కోవాలి. దీనినే వర్క్ ఎథిక్స్ అంటారు !
8. విరామం ఖచ్చితం గా పాటించండి : క్రమ శిక్షణ మనం చేయబోయే పని ఎప్పుడు చేయాలి , ఏమి చేయాలి , అసలు చేయాలా వద్దా అనే విషయాలు చేస్తున్న వారికి తెలిసినట్టు ఇతరులకు తెలియవు. అంటే మీకు తెలిసినట్టు ఇతరులకు తెలియవు. అందువల్ల మీరు చేస్తున్న పని నుంచి తీసుకునే విరామం కూడా ఖచ్చితం గా పాటించాలి, అంటే ఎక్కువ సేపు విరామం తీసుకున్నా , మీరు చేస్తున్న పని ని మాత్రం అశ్రద్ధ చేయక , మీరనుకున్న సమయానికి చేయగలిగేట్టు ఉండాలి !
9. మిమ్మల్ని అభినందించుకోండి : మీరు పూర్తి చేసిన పనులకూ , లేదా పని పూర్తి చేసి లక్ష్యం చేరుకున్నప్పుడూ మిమ్మల్ని మీరు తప్పకుండా అభినందించు కోవడం మరచి పోకండి ! చేర వలసిన గమ్యం చాలా దూరం లో ఉన్నా మైలు రాళ్ళు దాటుతున్నప్పుడు మిమ్మల్నిమీరు అభినందించు కుంటూ ఉంటే , అది మీకు సేద తీర్చడమే కాకుండా , లక్ష్యాన్ని ఉత్సాహం తో చేరుకోడానికి ప్రేరణ కూడా అవుతుంది !
10. సెలెబ్రేట్ చేసుకోండి : అంతే కాకుండా , తాత్కాలిక లక్ష్యాలను చేరుకున్నప్పుడు ( ఆ మాటకొస్తే పూర్తి చేసిన ప్రతి పనికీ ) మీకు నచ్చిన విధం గా సెలెబ్రేట్ చేసుకోండి ! అంటే మిత్రులతో ఒక సినిమా కు వెళ్లడమో , ఒక మంచి భోజనం చేయడమో ఇలాంటివి ! ఇట్లా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటే మన మెదడు కూడా మన లక్ష్యాలను చేరుకోడానికి మనకు తెలియకుండానే ఉత్సాహం , ప్రేరణ వస్తూ ఉంటాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
interesting
Very interesting