Our Health

విటమిన్ డీ ( vitamin D ) లోపం ఉంటే ఏమవుతుంది?

In ప్ర.జ.లు., Our Health on డిసెంబర్ 30, 2012 at 7:56 సా.

విటమిన్ డీ ( vitamin D ) లోపం ఉంటే ఏమవుతుంది?

 

( పై చిత్రం లో సూర్య రశ్మి , మన చర్మం ద్వారా D  విటమిన్ ను ఎట్లా తయారు చేస్తుందో చూప బడింది !  ) 

D విటమిన్ నీటిలో కరగదు. ఇది నూనె పదార్ధాలూ , లేదా క్రొవ్వు పదార్ధాల లో మాత్రమె కరుగుతుంది. మనం గమనించే ఉంటాము, చిన్నప్పుడు , మన పెద్ద వాళ్ళు , నెలల పిల్లలకు మొదట దేహమంతా కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ పూసి కొద్ది సేపు నీరెండ లో కూర్చో పెట్టే వారు. దానికి కారణం ఏమిటంటే సూర్య రశ్మి లో ఉన్న అతి నీల లోహిత కిరణాలు, నూనె పూసి ఉన్న చర్మం లో కొన్ని జీవ రసాయన చర్యలు జరిపి , విటమిన్ D ను విడుదల చేస్తాయి. ఇట్లా విడుదల అయిన D విటమిన్ మన శరీరం లో వివిధ భాగాలలో , వివిధ చర్యలు జరిపి , ఎముకల పెరుగు దలకే కాక , రోగ నిరోధక శక్తి కి కూడా ఎంత గానో ఉపయోగ పడుతుంది !

ఈ D విటమిన్ కనుక లోపిస్తే చిన్నారులలో ఎముకలు సరిగా పెరగని వ్యాధి వస్తుంది. అందుకే చిన్నారులలో D విటమిన్ సమృద్ధి గా ఉండాలి. అంటే ఇక్కడ గమనించ వలసినది కేవలం వారిని సూర్య రశ్మి లో ఉంచడమే కాక , వారికి , వారు రోజూ తీసుకునే ఆహారం లో D విటమిన్ కూడా తగిన పాళ్ల లో ఉండేట్టు పెద్ద వారు గమనించాలి ! ఒక సారి పెరిగే వయసులో ఈ విటమిన్ లోపాన్ని సరి చేయక పొతే , సరిగా పెరగని , వంకర గా పెరుగుతున్న ఎముకలు , తిరిగి సవ్యం గా పెరగ లేవు ఎందుకంటే , యుక్త వయసు దాటాక ఎముకలు పెరగడం ఆగి పోతుంది కదా ! అందుకే ముందుగానే , శ్రద్ధ తీసుకోవాలి ! 

క్రింది చిత్రం లో  ఏ ఏ ఆహార పదార్ధాలలో ఈ విటమిన్ D సమృద్ధి గా ఉంటుందో చూప బడింది.

 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

వ్యాఖ్యానించండి