Our Health

సీ విటమిన్ కూ , ఫ్రీ రాడికల్స్ కూ ఉన్న సంబంధం ఏమిటి?

In ప్ర.జ.లు., మానసికం, Our Health on డిసెంబర్ 29, 2012 at 6:19 సా.

సీ విటమిన్ కూ , ఫ్రీ రాడికల్స్ కూ ఉన్న సంబంధం ఏమిటి?

Vitamin C benefit

సి విటమిన్ నే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. నీటిలో కరిగిపోయే మిగతా B కాంప్లెక్స్ విటమిన్ లలానే ఈ విటమిన్ కూడా నీటి లో కరిగి పోతుంది. సీ విటమిన్ కూడా మనకు రొజూ కావలసిన అత్యవసరమైన విటమిన్.
మరి ఈ సి విటమిన్ మన దేహం లో ఏ ఏ పనులు చేస్తుంది ?:( పైన ఉన్న చిత్రం చూడండి )
చర్మం , కండరాలూ , ఇంకా రక్త నాళాల నిర్మాణం లో విటమిన్ c అత్యంత కీలకమైన పనులు చేస్తుంది.మనకు గాయాలు తగిలినప్పుడు , మళ్ళీ ఆ గాయం మానడానికి అవసరమయే కణ జాలం నిర్మాణం లో విటమిన్ C ముఖ్యమైనది. కార్టిలేజ్, ఎముకలూ , ఇంకా దంతాలూ నిర్మాణానికి కూడా విటమిన్ c అతి ముఖ్యమైనది.
ఫ్రీ రాడికల్స్ కూ విటమిన్ c కీ ఉన్న సంబంధం ఏమిటి ?: ఆధునిక శాస్త్ర విజ్ఞానం లో అనేక పరిశోధనల ద్వారా ఫ్రీ రాడికల్స్ గురించి అనేక వివరాలు తెలిశాయి. ఈ ఫ్రీ రాడికల్స్ గురించి చెప్పుకోవాలంటే , ఇవి మన దేహానికీ, ఆరోగ్యానికీ హానికరమైన కలుషితాలు. ఇవి మన శరీరం లో ప్రవేశించినా , ఏర్పడినా , మళ్ళీ విసర్జింప బడ కుండా మన దేహం లోనే దీర్ఘ కాలికం గా ఉంటే , అవి క్యాన్సర్, గుండె జబ్బు , ఇంకా ఆర్త్రైటిస్ లకు కారకాలు కావచ్చు. విటమిన్ సీ జీవ రసాయనం యాంటీ ఆక్సిడెంట్ కుటుంబానికి చెందినది. ఇది ఫ్రీ రాడికల్స్ ను తక్కువ చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.  మనం విటమిన్ c ను మన ఆహారం లో క్రమం గా తీసుకోక పొతే , ఫ్రీ రాడికల్స్ పేరుకు పోయి , అవి వివిధ హానికర పరిణామాలకు నాంది ఆవ వచ్చు ! అందుకే విటమిన్ సీ ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవాలి ! 

ఈ విటమిన్ సీ లేదా ఆస్కార్బిక్ యాసిడ్ ఏ ఏ ఆహార పదార్ధాలలో ఎక్కువ గా ఉంటుంది ?:

Vitamin C source

ఈ విటమిన్ సీ లోపిస్తే కలిగే పరిణామాలు ఏమిటి ?:
క్రింద చిత్రం లో చూడండి

Vitamin C deficit

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: