ఫోలిక్ యాసిడ్ కేవలం గర్భ వతులకే ముఖ్యమా?
క్రితం టపాలో చూశాము కదా గర్భ వతులకు ఫోలిక్ యాసిడ్ విటమిన్లు ఎంత ముఖ్యమో !
మరి మిగతా వాళ్లకు ఈ విటమిన్ అవసరం ఉండదా? :
ఇటీవలి పరిశోధనల ద్వారా ఫోలిక్ యాసిడ్ , అదే B 9 విటమిన్ అన్ని వయసుల వాళ్ళకూ అతి ముఖ్యమైన విటమిన్ అని తెలిసింది.
వీర్య వృద్ధి : మగ వారిలో వీర్య కణాలను ఎక్కువ శక్తి వంతం గా చేయడం లో ఫోలిక్ యాసిడ్ ఉపయోగ పడ వచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. రోజూ 700 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ బిళ్ళలను తీసుకుంటే , వీర్య వృద్ధి ఫలితాలు గణ నీయం గా ఉంటాయని తెలిసింది. గుర్తుంచు కొండి , 700 మైక్రో గ్రాములు మాత్రమె ( మైక్రో గ్రాము అంటే గ్రాములో వెయ్యో వంతు మాత్రమె )
పక్షవాతం నివారణ : ఫోలిక్ యాసిడ్ విటమిన్ కొంత వరకూ , పక్షవాతం నివారణలో మనకు తోడ్పడుతుందని తెలిసింది.
క్యాన్సర్ నివారణ: పురుషులలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ , ఇంకా పెద్ద ప్రేగు క్యాన్సర్ ల నివారణ లో కూడా ఫోలిక్ యాసిడ్ ఉపయోగ పడుతుందని కొన్ని పరిశోధన ఫలితాలు నిరూపించాయి.
ఇటీవలి పరిశోధనలో ఫోలిక్ యాసిడ్ డిప్రెషన్ , ఊబ కాయం నివారణలో ఇంకా మన శరీరం నిరోధక శక్తి ని బలోపేతం చేయడం లో కూడా ఎంతో ఉపయోగ పడుతుందని తెలిసింది.
మరి మనకు ఇంతగా ఉపయోగ పడే ఈ ఫోలిక్ యాసిడ్ మనం తినే ఏ ఏ ఆహార పదార్ధాలలో ఉంటుందో చెప్పా గలరా ?! ప్రయత్నించండి !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !
( పైన ఉన్న చిత్రం ఇటీవలే ప్రపంచ సుందరి కిరీటం గెలుచు కున్న ఒలీవియా కల్పో అనే సుందరిది ! )