B 1 థయమిన్ లోపానికి కారణాలు ఏమిటి ?:
పైన ఉన్న చిత్రం ఒక స్పార్క్ ప్లగ్ ది. థయమిన్ విటమిన్ కూ , మన ఆరోగ్యానికీ , వాహనాలలో ఉండే ఈ స్పార్క్ ప్లగ్ కూ ఉన్న సంబంధం ఏమిటి అనుకుంటున్నారు కదూ ! ఏ వాహనం నడవాలన్నా , పరిగేట్టాలన్నా , స్పార్క్ ప్లగ్ లో నిప్పు రవ్వ రానిదే , సాధ్య మవ్వదు. అంటే ప్రతి వాహనానికీ , ఈ స్పార్క్ ప్లగ్ అత్యంత ముఖ్యమైన భాగం. అదే విధం గా థయమిన్ విటమిన్ కూడా మన శరీరం లో జరిగే కీలక జీవ రసాయన చర్యలకు స్పార్క్ ప్లగ్ లా పని చేస్తుందని ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. మన జీవిత ” వాహనం ” కూడా ఆరోగ్యం గా, సవ్యం గా సాగాలంటే , ఈ థయమిన్ విటమిన్ స్పార్క్ ప్లగ్ లాగా పని చేస్తుంది ! దీనితో మనకు ఈ థయమిన్ విటమిన్ ప్రాముఖ్యత అర్ధం అయింది కదా !
మనం మన ఆహారం సంపూర్ణం గా అంటే అన్ని పప్పులూ , ఆకు కూరలూ , కూరగాయలూ తింటున్నా కూడా , మనం ఆ ఆహారాలనూ , వంటలనూ , తయారు చేసుకోవడం లోనూ , లేదా ఇతర పదార్ధాలతో తినడడం వల్ల నో , మన శరీరం లో థయమిన్ ప్రవేశించినా , మన శరీర కణాలకు చేరుకోక , వ్యర్ధం అవుతుంది. ఆ కారణం గా మనలో థయమిన్ లోపం , ఆ లోప లక్షణాలు కూడా కనిపించ వచ్చు. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము :
వంటలో లోపాలు : ధాన్యాలు అంటే , గోధుమ , వరి , జొన్నలు , మినుములు , కంది పప్పు , పెసర పప్పు, ఇట్లాంటి పప్పు దినుసులు , వాటి పోట్టులోనే ఈ B విటమిన్ అత్యధికం గా ఉంటుంది. కానీ సామాన్యం గా ఆకర్షణీయం గా ఉండడం కోసం చాలా దుకాణాలలో ఈ ధాన్యాలను పాలిష్ చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాక వాటిని కొన్న తరువాత వంట గదిలో అనేక సార్లు కడిగి ఉడికిన తరువాత తెల్లగా కనపడ డానికీ , పొట్టు వాసన రాకుండా ఉండడానికీ అనేక ప్రయత్నాలు చేసి , ఆ ధాన్యాలలో ఉన్న పోషక విలువలు, విటమిన్లు , వృధా చేస్తుంటాము.
అంతే కాక , అత్యధిక వేడి లో , ఎక్కువ సమయం ఉడికిస్తే కూడా పోషక విలువలు తగ్గి పోతాయి. ముఖ్యం గా ఆకు కూరలూ , కూర గాయలూ ఇట్లా ఎక్కువ సమయం , అధిక వేడి లో వండడం వల్ల వాటిలో ఉన్న విటమిన్లు కోల్పోతాయి.
కాఫీలూ , టీలూ , వక్క పొడి : టీలూ కాఫీలూ ఎక్కువ గా తాగితే , జర్దా, వక్కపొడి ఎల్లకాలం నములుతూ ఉంటే కూడా మనం తీసుకునే ఆహారం లో ఉన్న థయమిన్ విటమిన్ మనకు అంటే మన శరీరం లోని కణాలకు అందదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది.టీ లోనూ , కాఫీ లోనూ , ఇంకా వక్క పొడి , జర్దా లలో ఉండే కొన్ని రసాయన పదార్ధాలు , థయమిన్ విటమిన్ ను విరిచేస్తాయి అంటే దానిని పనికి రాకుండా చేస్తాయి ( అప్పుడు పాలు విరిగితే మనకు ఆ విరిగిన పాలు ఎట్లా ఉపయోగ పడవో , అట్లా అవుతుంది థయమిన్ విటమిన్ ! )
సరిగా వండని చేపలు : కొన్ని రకాల చేపలలో ( ప్రత్యేకించి చెరువు చేపలలో ) థయమిన్ విటమిన్ ను విరిచేసే తయమినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనివల్ల థయమిన్ విటమిన్ అంతా విరిచి వేయబడి మనకు ఏ విధం గానూ పనికి రాకుండా పోతుంది.
మరి ఆల్కహాలికులలో ( అంటే అతిగా మద్యం సేవించే వారిలో ) థయమిన్ లోపం ఎందుకు ఉంటుంది?:దీనికి చాలా కారణాలు ఉన్నాయి :
1. సాధారణం గా అతిగా మద్యం సేవించే వారు , వారి కడుపులో పోషక విలువలున్న ఆహారాన్ని కాక , ప్రధానం గా మద్యం తో నింపు తారు.
2. దానితో మన జీర్ణ కోశం లో ఉండే కణాలు మద్యం లో మునిగి పోయి , ఆహారం లో ఉండే థయమిన్ ను ” పీల్చుకో ” లేవు.
3. అతిగా సేవించే మద్యం కాలేయం అంటే లివర్ లోని కణాలను కూడా పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం లో ప్రవేశించే థయమిన్ నిలువ అవ్వడానికి వీలు పడదు ( సామాన్యం గా మనం మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ థయమిన్ ఆహారం లో తీసుకుంటే , అది మన కాలేయం అంటే లివర్ లో నిలువ చేయబడుతుంది )
4.అంతే కాక మద్యం థయమిన్ ను మన శరీర కణాలకు చేర నీయదు.
గమనించ వలసిన విషయం ఏమిటంటే , ఈ మార్పులు , చాలాకాలం , ఎక్కువ గా మద్య పానం చేసే వారిలో వస్తాయి. ఒక సారి ఈ మార్పులు వచ్చాక వారు మతి మరుపు తెచ్చుకుంటారు , కంఫ్యుస్ అవుతూ ఉంటారు. తికమక పడుతూ ఉంటారు.ఏకాగ్రత కోల్పోతారు. చీటికీ మాటికీ విసుక్కుంటూ ఉంటారు , చుట్టూ ఉన్న వారి బుర్ర తినేస్తూ ఉంటారు , ఎందుకంటే , వారి బుర్ర , నిరంతరం మద్యం లో ” మునిగి ” విటమిన్లు లోపించి సరిగా పని చేయదు కనుక ! కానీ వారు ఈ విషయాన్ని ఒప్పుకునే పరిస్థితి లో ఉండరు. మీరు గమనించారో లేదో , అతి గా తాగే వారు , వారి పరిస్థితిని అంత తేలిక గా ఒప్పుకోరు. వారి నిస్సహాయ స్థితిని వారి కోప తాపాలనూ , వారి కుటుంబ సభ్యుల మీదా , ( తల్లి తండ్రులూ , భార్య ల మీదా ) అమాయకులైన తమ సంతానం మీదా అంటే చిన్నారుల మీదా చూపిస్తూ ఉంటారు. ఇది చాలా విచార కర పరిస్థితి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Thanks again doctor for this beautiful comparison between spark plug and B1..but after observing how we are wasting many great properties with our bad cooking methods.. i am just tempted to take shortcut of 1 bflex forte/night though i don’t have any problem 🙂 .. there should be some initiatives be taken by media about cooking methods and about polished, pesticised 🙂 grains…with the help of doctors,chefs,cooking specialists and of course celebrities ..:)
I do not know if you are deficient of the vitamin ( B1 or thiamine ). This post is to make visitors be aware of the reasons for deficiency and how deficiency will affect our health.
keep following the posts for more interesting and educational topics.
తాగుబోతులు వారి మాట తప్పించి మిగిలినవారి మాట వినరు, వింటే తాగరు కదా!
చాలా మంది ( అతి గా చాలా కాలం మద్యం తాగే వారి ) కి , మద్యం ఏమో తాదు లో తాగితే ఏమవుతుంది , దీర్ఘ కాలం తాగితే ఏమవుతుంది అనే విషయాల మీద అవగాహన చాలా తక్కువ గా ఉంటుంది. ఒక సారి ” మందు దాసు ” లయిన తరువాత పరిస్థితి విషమిస్తుంది. మీరన్నది నిజమే !