B కాంప్లెక్స్ విటమిన్లు చాలా కాంప్లి కే టెడా ?:
B కాంప్లెక్స్ విటమిన్లు : ఈ రకమైన విటమిన్లు ముఖ్యం గా ఎనిమిది రకాలు.
1. విటమిన్ B 1 లేదా థియమిన్ విటమిన్ Vitamin B1 (thiamine) :
2. విటమిన్ B 2 లేదా రిబోఫ్లావిన్ Vitamin B2 (riboflavin)
3. విటమిన్ B 3 లేదా నియాసిన్ లేక నియాసినమైడ్ విటమిన్ ( Vitamin B3 – niacin or niacinamide)
4. విటమిన్ B 5 లేదా పాంటో తేనిక్ యాసిడ్ విటమిన్ ( Vitamin B5 (pantothenic acid)
5.విటమిన్ B 6 లేదా పైరిడాక్సిన్ విటమిన్ ( Vitamin B6 -pyridoxine, pyridoxal, or pyridoxamine, or pyridoxine hydrochloride)
6. విటమిన్ B 7 లేదా బయోటిన్ విటమిన్ ( Vitamin B7 – biotin)
7.విటమిన్ B 9 లేదా ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( Vitamin B9 – folic acid)
8. విటమిన్ B 12 లేదా కోబాలమిన్ విటమిన్లు ( Vitamin B12 – various cobalamins; commonly cyanocobalamin in vitamin supplements)
మరి B కాంప్లెక్స్ విటమిన్లు అన్ని ఎందుకు ఉన్నాయి ?:
మొదట్లో B విటమిన్లన్నీ ఒకే రసాయన నిర్మాణం ఉన్నవి గా అనుకున్నారు శాస్త్రజ్ఞులు. కాల క్రమేణా వీటి రసాయన నిర్మాణం లో స్పష్టమైన తేడాలు గమనించారు. అంతే కాక వివిధ రకాలకు చెందిన B విటమిన్లు మన దేహం లో వివిధ కీలక జీవ రసాయన చర్యలలో ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలుసుకున్నారు. ఇట్లా తెలుసుకోవడం శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది , రసాయన నిర్మాణాలను విశ్లేషించే అవకాశం కలిగినందుకు. ఒక్కో రసాయన నిర్మాణం కనుక్కున్నప్పుడల్లా ఆ B విటమిన్ కు తోకలు తగిలించడం మొదలెట్టారు 1,2,3,5, 6,7,9 అని. అందు వల్ల ఇన్ని B విటమిన్లు ఊడి పడ్డాయి, మన తల తినెయ్య డానికి అని అనుకోకండి , నిజానికి ఈ B విటమిన్లు మన బుర్రలు సరిగా పని చేయడానికి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఈ B విటమిన్లు ( ఏ కారణం చేతనైనా ) తక్కువ అయిన వాళ్ళు , వారి చుట్టూ ఉన్న వారి ” బుర్ర ” తినేస్తారు ! ఇది ఎట్లా జరుగుతుందో కూడా మనం వివరం గా తెలుసుకుందాం !
నవీన మానవ జీవితం లో ఈ విటమిన్ల అంటే ప్రత్యేకించి B విటమిన్ల పాత్ర చాలా ముఖ్యమైనది. కేవలం మనం B విటమిన్లు మన శరీరానికి అవసరమనే కాకుండా ఎందుకు అవసరమో వివరం గా తెలుసుకుంటే , మనకు , మన ఆరోగ్యానికీ ఈ విషయం చాలా ఉపయోగ పడుతుంది. కేవలం మనకు ఈ విటమిన్లు అవసరమైనంత మాత్రాన వెంటనే మందుల షాపు కు వెళ్లి కొనుక్కువడం చేయకుండా , సహజ సిద్ధమైన ఆహారం లో ఈ విటమిన్లు మనకు ఎట్లా ఉపయోగ పడతాయో కూడా మనం గ్రహించాలి. అంతే కాక మద్యం , పొగాకు , మన దేహం లో ఈ విటమిన్లను ఎట్లా హరింప చేస్తాయో కూడా మనం వివరం గా తెలుసుకుంటే , అప్పుడు మనం మద్యం తీసుకోవడం , అదే మందు పుచ్చుకోవడం , లేదా పొగాకు పీల్చడం కూడా అసలు చేయవచ్చో లేదో కూడా గ్రహించ డానికి , మనకు ఒక రకం గా ” జ్ఞానోదయం ” అవుతుంది.
మరి వచ్చే టపా నుంచి ఈ B కాంప్లెక్స్ విటమిన్లు ఒకదాని తరువాత ఒకటి గా తెలుసుకుందాం !