Our Health

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2012 at 7:16 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.3.


విటమిన్ A : విటమిన్ A మన శరీరానికి అవసరమయే అతి ముఖ్య విటమిన్. ” సర్వేంద్రియానాం నయనం ప్రధానం ” అంటారు. అట్లాంటి కంటిలో ఇంకో అతి ముఖ్య మైన భాగం రెటినా . ఈ రెటినా సరిగా పనిచేయక పొతే , మనం చూస్తున్నవి సరిగా కనిపించవు. రెటినా లో మనం కళ్ళు తెరిచి చూసే కాంతి ని గ్రహించే శక్తి కేవలం మనం క్రమం గా మన ఆహారం లో తీసుకునే విటమిన్ A వల్లనే వస్తుంది !
విటమిన్ A లోపం తో మన చర్మం లో ఉండే ఎపితీలియల్ కణాలూ , ఇంకా ఇతర కణాల పెరుగుదలకు ఒక గ్రోత్ హార్మోన్ లా పనిచేసి , వాటి ని ఆరోగ్యం గా అంటే చర్మాన్ని , ఆరోగ్యం గా ఉంచుతుంది. అంతే కాక మన కణాలలో జరిగే అనేక జన్యు పరమైన చర్యలకు కూడా విటమిన్ A అతి ముఖ్యమైనది.
మరి మనకు రోజూ ఎంత అవసరం ఈ విటమిన్ A ?
పిల్లల నుంచి పెద్ద వారి వరకూ రోజుకు కావలసిన విటమిన్ A కేవలం ఆరు వందలనుంచి , మూడు వేల మైక్రో గ్రాములు మాత్రమె .గుర్తు ఉంచుకోండి ,మైక్రోగ్రామ్ అంటే మిల్లీ గ్రాము లో వెయ్యో వంతు , లేదా గ్రాములో లక్షో వంతు మాత్రమె ! కానీ ఈ కాస్త కూడా మన శరీరానికి రోజూ లభ్యం కాక పొతే పరిణామాలు ( పైన చెప్పిన విధం గా ) తీవ్రం గా ఉంటాయి !
మరి ఈ విటమిన్ పుష్కలం గా వేటిలో ఉంటుంది ? :

శాక హారులైతే : పాలకూర , బచ్చలి కూర, చుక్క కూర , తోట కూర , లాంటి ఆకు కూరల్లో నూ , కారట్ , బ్రాకోలీ , చిలగడ దుంప లలోనూ , పచ్చి బటానీ లోనూ ,కొంత వరకూ గేదె పాలల్లోనూ ఉంటుంది !
మాంస హారులైతే : కోడి, మేక , చేప , ఈ జంతువుల కాలేయం అంటే లివర్ లో ఎక్కువ శాతం విటమిన్ A ఉంటుంది. కోడి గుడ్డు లో కొంత శాతం ఉంటుంది.
మంచి వెన్న లో నూ జున్నులో కూడా సరిపడినంత విటమిన్ A లభిస్తుంది !

మరి ఈ ఆకు కూరలనూ , కూర గాయలనూ ఎట్లా తింటే , వాటిలోనుంచి , మన శరీరానికి , వీలైనంత విటమిన్ A అందుతుంది ?

సామాన్యం గా విటమిన్ A కొవ్వులో కరుగుతుంది అంటే నూనె పదార్ధాలలో , అందువల్ల కొద్దిగా నూనెలో కానీ, వెన్న , లేదా నెయ్యి తో తాలింపు వేస్తూ ఉంటారు ,మన తల్లులూ , అమ్మమ్మలూ ( భార్యలు కూడా ఇట్లా చేయక పొతే , ఇక ముందు నుంచీ చేయడం మంచిది ! ) ఇట్లా చేయడం వల్ల కేవలం ఆ ఆకు కూరలు, కూర గాయాలతో చేసిన వంటలు , రుచి గా ఉండడమే కాకుండా , వాటిలో ఉన్న విటమిన్లు ముఖ్యం గా నూనె లో కరిగే విటమిన్ A ఎక్కువ శాతం శరీరానికి లభ్యం అవుతుంది ! చూశారా , తల్లులు సదా తమ సంతానం యొక్క ఆరోగ్యం కోరుకునే ఎంత దూర దృష్టి కలవారో !

  1. ఇంత ఉపయుక్తకరమైన పోస్ట్ రాసి, ఒక నటి చిత్రం పెట్టడం కాస్త ఇబ్బందిగా ఉంది…అన్యధాభావించకండి.

    • పద్మార్పిత గారూ, టపా నచ్చినందుకు కృతఙ్ఞతలు. రెండు కారణాల చేత నటి చిత్రం ఉంచడం జరిగింది.
      ఒకటి: ప్రపంచం లో అందమైన వ్యక్తులనన్నా , ప్రదేశాలనన్నా చూడ గలుగు తున్నామంటే , మన కళ్ళ వలననే కదా !
      అట్లాంటి కళ్ళు సరిగా పనిచేసి , మనకు అందమైన ప్రపంచాన్ని చూపిస్తూ ఉండాలంటే , వాటిని మనం ఎంత జాగ్రత్త గా ” చూసుకోవాలో ” తెలియ చేసేందుకే !
      రెండవ కారణం : వీలైనంత ఎక్కువ మంది కి ఈ టపా ( లు ) ఉపయోగ పడాలంటే , కేవలం మూసలో పోసినట్టు కాకుండా , కొంత ఆకర్షణీయం గా కూడా చేయాలని ప్రయత్నం !
      ఎక్కువ మంది అభ్యంతరం తెలియచేస్తే , నా ప్రయత్నం మానేస్తాను !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: