కలలూ – అంతరార్ధాలూ.7.
ఉచ్చారణ :
కలలో మీకు వివిధ యాక్సెంట్ లతో అంటే వేరు వేరు ఉచ్చారణ లతో మాట్లాడుతున్న వారు కనిపించడం జరిగితే , అది మీకు అర్ధం కాక పోతూ ఉంటె , మీరు మీ భావాన్ని, మీ అనుభూతులనూ , సరిగా ఇతరులకు , తెలియ చేయ లేక పోతున్నట్టు అనుకోవచ్చు. అంతే కాక , మీరు మీ జీవితం లో ఎదుర్కునే అనేక పరిస్థితులలో , మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేక , తడ బడుతున్నారనుకోవచ్చు.
ప్రమాదం జరిగినట్టు కల వస్తే : ఈ విధం గా కల రావడం సామాన్యం గా జరుగుతూ ఉంటుంది. ఈ కల ముఖ్యమైనది కూడానూ ! అందువల్ల మీకు వీలైనంత గా ఈ కల గురించి నోట్ చేసుకోవాలి ! ఏ ప్రమాదమైనా జరిగినట్టు కల కనుక వస్తే , అది , మీలో పేరుకు పోయిన లేదా నిగూ ఢ మై ఉన్న అనేక మానసిక సంఘర్షణలు , ఉద్రిక్త హావ భావాలూ , కోపోద్రేకాలకూ సంకేతం ! అంటే ఈ రకమైన ఎమోషన్స్ ఎదో విధం గా బయట పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ అపరిష్కృతం గా ఉన్న ఎమోషన్స్ మీద మీ దృష్టి కేంద్రీకరించి , వాటి పరిష్కార మార్గాలు వెతకాలి ! వివిధ వాహనాలలో ప్రయాణం , ప్రమాదానికి లోనవుతే , వివిధ అర్ధాలు ఉంటాయి.
విమానాలు: చాలా మంది కి విమానాలు కలలో వస్తూ ఉంటాయి. ఈ కలల అర్ధాలు పరిశీలిద్దాము.
విమానాశ్రయం : మీరు కేవలం విమానాశ్రయం కలలో చూస్తే మీ జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం జరగ పోతున్నట్టు , అంటే ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అన్న మాట. మీరు ఆ పరిస్థితి లో ఏ నిర్ణయం సమంజసమైనదో తెలియక సందిగ్ధం లో ఉంటారు. అంతేకాక విమానాశ్రయం మీకు ఒక హాలిడే ఆవశ్యకతను కూడా సూచిస్తుంది.
విమానం లో ఎగురుతూ ఉంటే : విమానాన్ని మీరే నడిపిస్తూ ఎగురుతూ ఉంటే , మీ జీవిత గమనం లో మీరు పూర్తి కంట్రోలు తో అంటే నియంత్రణ తో ముందుకు సాగి పోతున్నట్టు. అదే ఇంకెవరైనా విమానాన్ని నడుపుతూ , మీరు కేవలం వారితో ప్రయాణం చేస్తూ ఉంటె , మీ జీవితాన్ని ఇంకెవరో నియంత్రించు తున్నట్టు , అందులో మీ ప్రమేయం తక్కువ గా ఉన్నట్టు అనుకోవాలి.
మీ ఎదురుగా విమానం ఎగురుతూ ఉంటే : మీరు నుంచుని చూస్తూ ఉన్నప్పుడు, మీ ఎదురుగా విమానం గాలిలో ఎగురుతున్నట్టు కల వస్తే, మీరు మీ ఆశయాలనూ, గమ్యాలనూ సరిగా, ఉన్నతం గా నిర్దేశించు కున్నారనీ , ఆ గమ్యాలు మీరు అందుకో గలవేననీ కూడా అనుకోవచ్చు.కానీ మీ ఎదురుగా విమానం కూలి పోయినట్టు కల వస్తే, మీ పధకాలు సఫలీకృతం కాలేక పోతాయి అని సూచిస్తుంది. అప్పుడు మీ పధకాలను రివ్యూ అంటే పునశ్చరణం చేసుకుని, లోపాలను సరి దిద్దుకోవాలి !
మీరు విమానం, అంటే ఫ్లయిట్ మిస్ అయినట్టు కల వస్తే : ఈ కల మీ లో ఉన్న ప్రయత్న లోపాన్ని తెలియ చేస్తుంది. అంటే మీరు తీసుకో బోయే కీలకమైన నిర్ణయాలలో , ఎదో లోపం ఉందని . అప్పుడు మీరు మీ నిర్ణయాలనూ , లక్ష్యాలనూ మళ్ళీ పరీక్షించుకుని , తదనుగుణం గా మార్పులు చేసుకోవాలి విజయ పధం వైపు దూసుకు పోయే విధం గా !
వచ్చే టపాలో ఇంకొన్ని కలలూ , వాటి అంతరార్ధాలూ !
Good