కలలూ , అంతరార్ధాలూ . 6.
1. వదిలి వేయడం :
నిద్రలో మిమ్మల్ని మీ తల్లి దండ్రులు గానీ , స్నేహితులు గానీ , లేదా భార్య , లేదా ప్రియురాలు , లేదా ప్రియుడు ఏ ప్రదేశం లో నైనా వదిలి వెళ్లి పోతున్నట్టు మీకు కల వస్తే , అది మీలోని అభద్రతా భావాన్ని తెలియ చేస్తుంది.
మీకు సహకారమూ , సహాయమూ అవసరమని కూడా సూచన ఇస్తుంది. ఈ సహాయ సహకారాలు మీరు చేస్తున్న లేదా చేయబోయే కార్యాల లో కావచ్చు , లేదా మీ జీవిత గమనం లో కావచ్చు. లేదా నిజ జీవితం లో మీరు నిజం గా మీరు కోల్పోయిన అత్యంత విలువైన వ్యక్తులను స్పురణ కు తెస్తూ వచ్చే కల కావచ్చు ! ఇట్లా కల రావడం మీ లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవలసిన అవసరాన్ని తెలియ చేసే సూచన కావచ్చు !
ఇట్లాంటి కల కనుక మీకు తరచూ వస్తూంటే , మీ బాల్యం నుంచీ మనసు మూలల్లో దాగున్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నట్టు భావించ వచ్చు ! ఆ సందర్భం లో మీరు ఆ కారణాలను విశ్లేషించుకుని , సరి చేసుకుంటే , అట్లా కలలు రావడం తగ్గుతుంది. అదే, మీ అంతట మీరు ఎవరి ప్రమేయమూ లేకుండా మీరు ఉన్న చోటిని కానీ , చేస్తున్న పనిని కానీ అసంపూర్ణం గా వదిలి వేసి వెళ్లి పోతున్నట్టు కల కనుక వస్తే , అది మీ బాధ్యతా రాహిత్యాన్ని చెపుతుంది ! అంటే మీరు చేస్తున్న పనిని శ్రద్ధ తో చేయకుండా ” ఆ పనిని దాటవేయ డానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా అనుకోవచ్చు. మీరు మీ జీవితం లో ముఖ్య మైన నిర్ణయాలు తీసుకోవడం లో మీరు సందిగ్ధం లో పడతారని కూడా ఇట్లాంటి కలలు తెలియ చేస్తాయి. అప్పుడు మీరు తక్షణ కర్తవ్యం గా ఆ పనిని బాధ్యతా యుతం గా చేయడానికి పూనుకోవాలి !
2. ఎత్తుకు పోవడం , అమాంతం గా తీసుకు పోవడం :
మీకు కలలో మిమ్మల్ని అమాంతం గా , అంటే ఒక్క సారిగా , లేదా బలవంతం గా మీరు ఉన్న చోటి నుంచి కానీ , మీరు నిద్రలో ఉన్నప్పుడు తట్టి లేపి కానీ, మీకు తెలియని చోటికి కనుక తీసుకు వెళుతున్నట్టు కల వస్తే , వెంటనే మీకు మెలకువ కూడా వచ్చి చాలా ఆందోళన పడడం కూడా జరుగుతుంది. ఈ రకమైన కల సామాన్యం గా మీకు బాగా సన్నిహితం గా ఉన్న వ్యక్తులు , మీ ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా , మీ జీవితాన్ని నియంత్రించు తున్నట్టు , లేదా తమ గుప్పెట లో పెట్టుకోవాలని చూస్తున్నట్టు అనుకోవచ్చు. ఆ పరిస్థితులలో మీరు , మీ జీవిత నావ చుక్కాని ని మీరే తీసుకుని అలలు , ఆటు పొట్ల దిశ గా కాకుండా , ఆనంద తీరాల వైపు మరల్చు కోవాలి ! అంటే , ఇతరుల ” మాయ ” మాటలకు తల ఊపకుండా , మీ సహజ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒకరు ఇంకొకరిని బలవంతం గా తీసుకు పోతుంటే , మీరు కేవలం మూడో వ్యక్తిగా ఆ ప్రదేశం లో ఏమీ చేయకుండా నుంచున్నట్టు కనుక కల వస్తే , అది మీ జీవితం లో మీరు తీసుకునే నిర్ణయాల లో మీ నిస్సహాయ స్థితిని సూచిస్తుంది.
వచ్చే టపాలో ఇంకొన్ని కలల అర్థాలు తెలుసుకుందాం !
Really interesting