నిజమైన ప్రేమ.3.
ఎటాచ్ మెంట్ : నిజమైన ప్రేమ ఆప్యాయత తో నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక మాత్రు మూర్తి శిశువు తన గర్భం లో ప్రవేశించిన సమయం నుంచీ , తాను తుది శ్వాస తీసుకునే వరకూ , తన సంతానం మీద ఒకే రకమైన అవ్యాజమైన అనురాగం , ఆప్యాయత చూపిస్తూ ఉంటుంది. ఆ ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్ ఆ రకం గా వర్ధిల్లుతూ ఉంటుంది.
అదే రకం గా నిజమైన ప్రేమికుల ప్రేమ కూడా ఆప్యాయత , ఆపేక్ష తోలి చూపు నుంచి చిగురించి , దిన దిన ప్రవర్ధ మానమవుతుంది ! ఆ ఎటాచ్ మెంట్ అట్లా ప్రేమికులిరువురి లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక విధం గా చెప్పుకోవాలంటే దీర్ఘ కాలిక ప్రేమే ఎటాచ్ మెంట్ ! ప్రేమ పెరుగుతూ ఉంటే , దానితో పాటుగా ఎటాచ్ మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది !
కమిట్ మెంట్ : ప్రేమ పురోగమిస్తూ ఉన్న కొద్దీ ప్రేమికులు ఇరువురూ పరస్పరం కమిట్ మెంటు తో ( ప్రేమ ) జీవితం సాగిస్తూ ఉంటారు. ప్రేమ సాగర మధనం చేస్తూ ఉంటారు! ఎవరైనా ప్రియుడి ప్రవర్తన కామెంట్ చేసి ” అతడు ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు ” అని ఎవరైనా అంటే మీరు వెంటనే ” ఔను. అతను చాలా గంభీరం గా , ధైర్యం గా, ధీమా గా ఉంటారు ” అని అతని లోని పాజిటివ్ లక్షణాలను తెలియ చేస్తారు, మీ ఇరువురి మధ్య ప్రేమ ఘాటు గా ఉంటే ! అంటే కమిట్ మెంటు తో ఉంటే ! అదే కమిట్ మెంటు కనుక లోపిస్తే ” అతను నాతోటీ అంతే ! ఒక పట్టాన మాట్లాడడం అతి కష్టం ! మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాడో ఏమిటో !? అని అతని నెగెటివ్ లక్షణాలను అంటే లోపాలను వల్లె వేస్తూ ఉంటారు !
ఇంటిమసీ : నిజమైన ప్రేమ అంటే సన్నిహితం కూడా ! మనసులు కలిసినప్పుడు , పరస్పరం ఇరువురూ ఎప్పుడూ సన్నిహితం కోరుకుంటూ ఉంటారు! క్రమేణా , అతని లోని ప్రతి అణువూ ఆమెకు పిండి కొట్టినట్టు , ఆమెలోని ప్రతి అణువూ అతనికి కూడా అట్లాగే సంపూర్ణం గా అవగాహన అవుతుంది. గౌరీ శంకరులలాగా లో ఒకరు మమైకం అవుతారు. సన్నిహితం , స్నేహం గా మారి ఒకరి ఊపిరి లో ఇంకొకరి ఊపిరి గా ప్రేమ ప్రాణ వాయువు అవుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !
బాగుంది. ప్రేమ అనిర్వచనీయమైన అలౌకికానందం. It is ever lasting
good