నిజమైన ప్రేమ ఏంటి ?.2.
మరి అసలైన ప్రేమ ఎట్లా ఉంటుంది?:
నిజమైన ప్రేమ అంటే కేరింగ్ ( caring ) : గ్రీకులు ప్రేమను పలు విధాలు గా నిర్వచించారు. ఆపేక్ష , వాత్సల్యం, ఆప్యాయతా , అనురక్తి – ఇట్లా అనేక రకాలు గా ప్రేమ లక్షణాలను నిర్వచించారు. ఏ లక్షణాలతో నిర్వచించి నా , ప్రేమలో అతి ముఖ్యం గా కనిపించే ప్రధాన లక్షణం ,ప్రేమించిన వారు ప్రేమించ బడుతున్న వారిని ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు. ఈ కేరింగ్ అనే ఆంగ్ల పదాన్ని సరిగ్గా తెనిగీకరించాలంటే ‘ అనురాగం ‘ అనే పదం వాడ వచ్చు నెమో ! ఈ అనురాగం నిరంతరం ఉంటుంది ప్రేమిస్తున్న వారిలో. ప్రేమించ బడుతున్న వారి మీద.
ఈ ప్రేమికులు , ప్రేమ పాత్రులు ఏ విధమైన శారీరిక లేక మానసిక బాధ కు లోనైనా తట్టుకోలేరు ‘ ప్రియా నీ వేలికి గాయమయింది, నేను కట్టు కడతాను, ఆ వేలు నీ కుడి చేతి వేలు కూడా అయింది కదా ! నీవు ఆందోళన పడకు , ఆ గాయం మానే వరకూ నేను నీకు భోజనం స్పూన్ తో నీకు తినిపిస్తాను. సరేనా ” అంటారు. ” నీ ఒళ్ళు చూడు ఎంతగా మసిలి పోతుందో , తీవ్రం గా జ్వరం వచ్చినట్టు ఉంది, షాల్ కప్పుతాను నీ మీద , వెళ్లి పారాసేటమాల్ త్యాబ్లేట్స్ తెస్తాను వేసుకుని ఏ పనీ చేయకుండా రెస్ట్ తీసుకో బెడ్ లో అని చేతి లో చేయి వేసి తన పెదవులు ఆమె బుగ్గల మీద ఆనించి ధైర్యం చెప్పి స్వాంతన చేకూరుస్తారు ! చిన్న బాబో , పాపో పుడితే , అతి జాగ్రత్తగా వారిని తమ ఒడి లో కి తీసుకుని ముద్దాడతారు , వారి ఒడి లో ఒక అతి అందమైన ఆకర్షక పత్రాలున్న పుష్పం ఉన్నట్టు అనుభూతి చెందుతూ , ఆ ” పుష్పాన్ని ” ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ” అలాగే ప్రేమించే వారు , తమ తల్లి తండ్రులు కానీ , బంధువులు కానీ, వృద్ధులు గా ఉంటే వారిని అతి జాగ్రత్తగా నడిపించడమూ , లేదా వారికి కావలసిన పనులు శ్రద్ధ తో చేయడమూ కూడా చేస్తుంటారు. ఈ చర్యలు అన్నింటి లోనూ కేరింగ్ , లేదా అనురాగం ప్రేమించే వారిలో కలగలిసి ఉంటుంది. ఈ అనురాగం , రాగ ద్వేషాలకు అతీతం గా ఉంటుంది. సమయానుకూలం గా మారక ప్రేమించే వ్యక్తి జీవితాంతం ఉంటుంది. అది ప్రేమ లక్షణం !
నిజమైన ప్రేమ లో ఆకర్షణ ఉంటుంది ( attraction ) :
ఆకర్షణ ! ఎంతో అత్భుతమైన పదం ! సృష్టి లో ఆకర్షణ లేని జీవం , జీవితం లేదంటే అతిశయోక్తి కాదు ! ఉప్పొంగి లేచే కెరటాలు తీరం తాకడానికి ఉబలాట పడతాయి. అంటే కెరటాలు తీరం చేత ఆకర్షించ బడతాయి.
తుమ్మెద ఆకర్షణీయ మైన పుష్పం లోని మకరందం చేత ఆకర్షింప బడుతుంది. చిగురించే ప్రతి మొక్కా , ప్రతి ఆకూ , తమలో ఉత్తేజం కలిగించే , స్ఫూర్తి కలిగించే సూర్యుడి కాంతి వైపు ఆకర్షించ బడతాయి.
అంత సహజం గానే మనసు ప్రేమ మయం అయినప్పుడు , ఆకర్షణ ఆ ప్రేమలో నిక్షిప్తమై ఉంటుంది ఆమెలో ప్రతి ఆణువూ ఆకర్ష ణీయం అవుతుంది అతనికి ! ఆమె కాంతికి అతని ముఖం వికసిస్తుంది. అతని కాంతికి ఆమె హృదయం పులకరిస్తుంది. ఆమె వలపు తోట లో తీపి తలపుల పూలు విర బూస్తాయి ! నిజమైన ప్రేమలో ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య కోటి అయస్కాంతాల ఆకర్షణ పుడుతుంది. నిజమైన ప్రేమ లో వికర్షణ కు తావు ఉండదు, ఉంటే నిజమైన ప్రేమ అనిపించుకోదు !
వచ్చే టపాలో ఇంకొన్ని నిజమైన ప్రేమ లక్షణాలు తెలుసుకుందాం !