ప్రేమంటే ఏమిటి?
ప్రేమ : మానవ జీవితం లో అతి విలువైన పదం. జీవితం లో వివిధ దశలలో వివిధ రకాలు గా ఈ ప్రేమ మానవులకు పరిచితం.
మానవుడి ప్రత్యెక అనుభూతులు , ఎమోషన్స్ లో అతి ముఖ్యమైనది ప్రేమ. దీనికి చదువు తో సంబంధం లేదు , ధనం తో సంబంధం లేదు. రంగు రూపాలతో పని లేదు.
కుల మతాలతో పని లేదు. దేశ జాతులతో ప్రమేయం లేదు. ప్రాణం ఉన్న ప్రతి మానవుడి జీవితం లో అనివార్యమై ఉంటుంది ప్రేమ. మానవ జీవితం లో ఇంత లోతు గా పెన వేసుకు పోయిన ఈ ప్రేమ అంటే ఏమిటి ? దేనిని మనం ప్రేమ అంటాము ? ఏది ప్రేమ కాదు ? ఇష్టమైన ప్రతి వారినీ ‘ ఐ లవ్ యు ‘అంటే వారిని ప్రేమిస్తున్నట్టేనా ? అది ప్రేమ అవుతుందా ? ఈ ప్రేమ కు ఏమైనా ప్రత్యెక లక్షణాలు ఉంటాయా ? కేవలం ఇవ్వడమేనా ? పుచ్చుకోవడం ఏమీ ఉండదా ? అట్లాగే , కేవలం పుచ్చుకొవడమే నా ఇచ్చే అవసరం ఏమీ ఉండదా ? అసలు ఈ ప్రేమ వ్యవహారం చాలా సులభమే నా? లేదా జటిలమా ?
అమూల్యమైన ఈ ప్రేమ అనే ఎమోషన్ ఉచితం అయినప్పటికీ , మానవులు మరి ఎందుకు ఆ పని చేయలేక పోతున్నారు ? ఆధునిక ప్రపంచం లో ప్రేమను తిరిగి పొందలేక పోతున్నా రా ?
ఈ విషయాల గురించి వచ్చే టపా నుంచి తెలుసుకోవడం మొదలెడదాం !
మీ అనుభవం లో మీకు ప్రేమ మీద ఉన్న అభిప్రాయాలు తెలపండి !