మరి మీరు కావాలనుకునే అతడి దేహ భాష ఏమిటి ? .8.
5.వాడి చూపులు : మీ మీద మనసు పడే వాడి చూపులు చాలా వాడి గా ఉంటాయి. ఆ చూపులు మొదటి దశలో , తరచూ మీరు తనను గమనిస్తున్నారో లేదో అని తెలుసుకోడానికి .కానీ మీరు అతడి ని చూసినప్పుడు మాత్రం , తన చూపులు తిప్పుకుని , మిమ్మల్ని పట్టించుకున్నట్టు గా కనపడడు . అంటే మొదటి దశలో ఆ వాడి చూపులు మీతో దొంగాట ఆడతాయి. కానీ మీతో పరిచయం ఎక్కువ అవుతున్న కొద్దీ , అతడి చూపులు , తీక్షణం గా ఉండడమే కాకుండా , తదేకం గా కూడా ఉంటాయి. అంటే అదే పని గా మిమ్మల్ని వీక్షించడం జరుగుతుంది. కొన్ని సమయాలు ఆ చూపులు మీ ముఖాన్నే పరీక్షించుతూ ఉంటాయి. ముఖ్యం గా మీ కళ్ళు , పెదవులు , బుగ్గలు, మీ నడుము ………….. , అతడి మెమరీ కెమెరా లో మీ ఫోటోలు వివిధ భంగిమలలో అనేక వందల గిగా బైట్లను ఆక్రమించుకుంటూ ఉంటాయి. అన్ని ఫొటో లూ సప్త వర్ణాలలో ఉంటాయి ! మీ చిలిపి నవ్వులు , లేక మీరు ఎదో పని లో ఉండి , మీ తల మీద జుట్టు సవరించుకున్నప్పుడో , లేదా మీరు మీ మెడ ను సున్నితం గా మీ అందమైన వేళ్ళతో తాకు తున్నప్పుడో , లేదా మీరు తత్తర పడుతూ అతని ముందర మీ స్థన సౌందర్యం అతనికి కనపడకూడని , సిగ్గుతో మీ బట్టలను సవరించుకుంటున్న సమయం లోనో, లేదా ముందుకు వంగినప్పుడో – ఇట్లా అనేక పోజులు చక చకా అతని మనో ఆల్బం లో చేరి పోతూ ఉంటాయి. మీరు అతని సమీపం లో ఉన్నప్పుడు , అతని మీద ఆసక్తి తో , ఉద్వేగం చెంది, ప్రేమ వాంఛ , క్రమం గా కామ వాంఛ గా పరిణామం చెందుతుంది ! ఆ క్షణాలలో మీరు మధుర భావనల నావ లో సాగి పోతూ ఉంటారు. మీరు అనుభవించే ఆ ఉద్వేగం , మీ మనసులోనే ఉండక , మీ హృదయ వేగాన్ని ఎక్కువ చేస్తుంది , దానితో మీ గుండె కొట్టుకోవడం మీకు తెలుస్తుంది. ( శాస్త్రీయం గా ఆ పరిస్థితిని పాల్పి టే షన్స్ అని అంటారు ) మీరు, ఎగసి పడుతున్న మీ హృదయం, మీ అందాలను కూడా ఎక్కడ బయట పెడుతుందో అని అప్రయత్నం గానే తల వంచి మీ చాతీ వైపు చూసుకుంటూ, అతడు గమనిస్తున్నాడో లేదో అని రెప్ప పాటు లో మీ చూపులు మీ సౌందర్యాన్ని కాక అతడి చూపులను వెతుకుతుంటాయి. అవే క్షణాలలో ఆ మధుర దృశ్యాలు అనేక వందలు, తన కళ్ళతోనే ఫ్లాష్ కెమెరా లా తీసి తన మనో మెమరీ లో నిక్షిప్తం చేశాడని మీకు తెలియదు . ఎందుకంటే అతడు, మిమ్మల్ని గమనించనట్టు అమాయకత్వం నటిస్తాడు.
మీతో పరిచయం, కొంత దూరం ప్రయాణం చేసి , ప్రణయం గా పరిణామం చెందినప్పుడు , అతడి చూపులు మన్మధ బాణాలు గా మారి మీ హృదయాన్ని తాకుతుంటాయి. అప్పుడే మీకు కలిగే బాధను అనేక మంది కవులు ‘ తీయని బాధ ‘ గా వర్ణిస్తారు. ఆ దశలో , పరిచయమూ , చనువూ ఎక్కువ అయినా కూడా , చిత్రం గా మాటలు తక్కువ అవుతూ ఉంటాయి.
కానీ అతడి తీక్షణమైన చూపులు , మీ మతి పోగొడతాయి. ఎందుకంటే , అతడి చూపులు కేవలం మీ అందాలను చూడడమే కాకుండా , శయన మందిరం లో మీ అందాలను ఏ విధం గా ఆస్వాదించాలో అని కూడా , అతడు , తన యాక్షన్ ప్లాన్ ను , మీ అందాలతో సింక్రొనైజ్ చేస్తూ ఉంటాడు. అతడి మైండ్ ఒక మల్టీ కోర్ ప్రాసెసర్ లా అత్యంత వేగం గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, మీ గురించిన మానసిక , భౌతిక ఇన్ఫర్మేషన్ అంతా ! ఆ సంగతి మీకు కూడా స్పష్టం గా తెలుస్తూ ఉంటుంది ! అందుకే మీలో తీయని బాధ ! ఆ మధుర క్షణాల కోసం మీరు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఆ బాధ ఇంకా తీయని బాధ అవుతుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !