ఆమె మనసు, ఆమె ముఖం చూసి ఎట్లా తెలుసుకోవచ్చు ?.4.
క్రితం టపాలో ఆమె మనసు, ఆమె చూపుల వాలకం చూసి, ఆ ఎక్కు పెట్టిన చూపుల బాణాల వాడి చూసి , ఎట్లా తెలుసుకో వచ్చో , తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆమె ముఖం చూసి , ఆమె మనసు ఎట్లా తెలుసుకో గలమో చూద్దాము ! గుర్తు ఉంచుకోండి , మనం, ఎంత తెలుసుకున్నా , కేవలం ఆమె మనో సముద్ర తీరం లో గులక రాళ్ళు ఏరుకునే వాళ్ళమే ! ఆమె మనసు లోతు తెలుసుకో గలిగే డీప్ సీ డైవర్స్ ము కాము కదా !
3.ముఖం పరిశీలించండి : మీ మీద మనసు పడే యువతి ముఖం లో ఆమె మనో భావాలు ప్రస్పుటం గా కనిపిస్తాయి , ఆ ముఖాన్ని పరిశీలించి , అర్ధం చేసుకునే వారికి ! ఎందుకంటే , ఆ ముఖం, మీ మీద మనసు పడ్డ నాటి నుంచీ , పున్నమి చంద్రుడి లా దిన దినాభి వృద్ధి చెందుతూ ఉంటుంది, కాంతి తో ! ప్రత్యేకించి ఒక స్థిరమైన చోట నుంచి ఆ వెలుగు రాక పోయినా హాలు మొత్తం మీద ఆ ముఖం కాంతులు వెద జల్లుతుంది ! ఆ వెలుగు లో కూడా మీరు, తడుము కుంటూ, ఆమె మనసు అర్ధం చేసుకోలేక పొతే, అంతే సంగతులు !
మీరు ప్రత్యేకించి ఆమె కను బొమ్మలూ , కనులూ , ఆమె పెదవులూ పరిశీలించండి !
ఆమె కను బొమ్మలు అంటే ఐ బ్రోస్ కనుక పైకి పోనిస్తే అంటే రైజ్ చేస్తే , ఆమె మీరు చెప్పే విషయం శ్రద్ధ తో , వింటున్న దన్న మాట ! ఆ ఎగరేసిన కను బొమ్మలతో జత గా ఆమె చిరు నవ్వును కూడా కలిపితే , మీరు చెప్పే విషయాలను ఆమె అంగీకరిస్తున్న దన్న మాట ! యువతులు తాము తమ కళ్ళను మీ కళ్ళతో కలిపి , తమ కను బొమ్మలను కూడా పైకి చేస్తే , వారు ( మిమ్మల్ని ) ఇష్ట పడుతున్నట్టు అనుకోవాలి !
పెదవులు : ఆమె పెదవుల గురించి ఎంత చెప్పినా తక్కువే కదా ! ఇప్పటికే అనేక మంది కవులు ఆమె పెదవులను , దొండ పండు వంటి వి గానూ , తమలపాకుల లాగానూ వర్ణించారు. లేత ఎరుపు రంగులో ఉన్నా , ఆ పెదవులు ప్రతి పురుషుడి జీవితం లో ఇంద్ర ధనుస్సు లో ఉన్న రంగులన్నీ తెచ్చి, ఆ పురుషుడి చేత మన్మధ బాణాన్ని ఎక్కు పెట్టిస్తాయి ! వణుకుతున్న ఆమె పెదవులు, ప్రతి పురుషుడి లోనూ ఎక్కడ లేని వేడి పుట్టిస్తాయి ! పట్టు వంటి సుతి మెత్తని ఆమె పెదవులు గుట్టుగా ప్రేమ పట్టును పురుషుడి పైన అతి గట్టిగా బిగిస్తాయి. అందు వల్లనే, ప్రతి సినిమాలో ,హీరోయిన్ చేత పెదవులు కొరికించు తాడు, తల కాయలో ‘ రస కాయ ‘ ఉన్న ప్రతి దర్శకుడూ , నిర్మాతా కూడా ( లేక పొతే కలెక్షన్ లేక వాళ్ళు నాలిక కరుచు కోవలసి ఉంటుంది కదా ! ) అంతటి మహాత్తరమైనవి ఆమె పెదవులు !
మీ పొందులో , లేదా మీ సమీపం లో , తడబడుతూ ఉన్న ఆమె పెదవులూ, లేదా నాలుక కొద్దిగా బయటకు తెచ్చి , తడి ఆరకుండా నా అన్నట్టు చప్పరించ బడుతున్న ఆ పెదవులు, ఆమె మీ అ టెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు ! మీ మీద ఆమె తన ఆసక్తి ని ఆ విధం గా తెలుపుతూ ఉండ వచ్చు ! తన పెదవుల తడి ఆరకుండా ఆమె చేసే ప్రయత్నాలూ , పడే తంటాలూ , మీరు ఆమె మీద చూపించే ఆసక్తిని ఎండి పోకుండా అప్రయత్నం గా చేసే ప్రయత్నం కూడా కావచ్చు ! ఇక శాస్త్రీయం గా చెప్పుకోవలసి వస్తే , ఆమె కామ పరం గా నైనా , లేదా ప్రేమ పరం గా నైనా ఉత్తేజం చెంది, అరౌజల్ లేదా ఉద్రేక పడుతున్నప్పుడు , ఆమె పెదవులూ , నోరూ కూడా వాటి తడి ఆరిపోయి , డ్రై గా అవుతాయి ! తాను వలచిన పురుషుడి అధర సంగమం తో నే ఆ తృష్ణ తీర గలదు అన్న కోరిక ఉన్నట్టు గా !
కను రెప్పలు : ఆమె కను రెప్పలు, మీ పైన కనుక ఆసక్తి ఉంటే , టపా టపా అని కొట్టుకుంటూ ఉంటాయి ( అంటే బ్లాగు లో టపా అనుకోకండి పొరపాటు పడి ! ) మరి మామూలు గా కను రెప్పలు టిపా టిపా అని కొట్టు కుంటాయా అని మీరు సందేహ పడ వచ్చు. ఎవరి కను రెప్పలూ , శబ్దం చేస్తూ కొట్టు కోవు కదా ! ఇట్లా రాయడం లో ఉద్దేశం ఏమిటంటే , సామాన్యం గా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటాయి ఆమె కనురెప్పలు , ప్రత్యేకించి మీ మీద ఆసక్తి ఉంటే !
కను పాపలు : అంటే ప్యూపిల్స్ అంటే మళ్ళీ విద్యార్ధులని అర్ధం చేసుకోకండి ! మన కంటి లో వెలుగును నియంత్రిస్తూ ఉండే భాగం, దీనినే ప్యూపిల్ అంటారు. వెలుగు ఎక్కువగా ఉన్నప్పుడు , ప్యుపిల్ వ్యాసం తక్కువ అయి కంటి లో ఉన్న రెటీనా అనే భాగాన్ని రక్షిస్తుంది. అట్లాగే వెలుగు తక్కువ గా ఉన్నప్పుడు, ఉత్తేజం పొందినప్పుడూ , అంటే ప్రత్యేకించి ప్రేమోత్తేజం కానీ, కామోత్తేజం కానీ పొందినప్పుడు ఈ ప్యూపిల్ వ్యాసం ఎక్కువ అయి దృష్టి సరిగా ఉండడానికి సహాయ పడుతుంది, తక్కువ వెలుతురూ లో కూడా ! మీ మీద ఆసక్తి ఉన్న ఆమె కనుపాపలు పెద్దవి గా అవుతాయి, మీతో నీలి నీడలలో సరస సల్లాపాల కోసం అలవాటు పడుతున్నట్టు గా !
నాసికా పుటాలు అంటే నాస్ట్రిల్స్ : మీ మీద ఆసక్తి ఉన్న యువతి నాసికా పుటాలు అంటే నాసికా రంధ్రాలు, అప్రయత్నం గానే పెద్దవి అవుతాయి. తీవ్ర మైన ఉత్తేజం పొందితే , ఇట్లా జరుగుతుంది.
ఇట్లా పెద్దవైన నాసికా పుటాలతో పెద్దవైన కనుపాపలు , తడి ఆరుతున్న , వణుకుతున్న పెదవులు, ఈ లక్షణాలు మీరు ఆమెలో గమనించితే , మీరు తక్షణమే కర్తవ్యోన్ముఖులు కావాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని ఆమె దేహ బాషలు !