దేహ భాష ( బాడీ లాంగ్వేజ్ ):
ప్రశ్న : బాడీ లాంగ్వేజ్ , అదే అచ్చ తెలుగులో దేహ భాష అంటే ఏమిటి ?
జవాబు: మన శరీరం మనకు తెలియకుండా మన గురించి ఎదుటి వారికి తెలియ చేస్తూ ఉంటుంది. మన నడక, మన చేతి కదలికలూ , మన ముఖం మీద కనపడే మన హావ భావాలూ , ఇవన్నీ కూడా మన గురించి ఎదుటి వారికి తెలియచేస్తాయి.ఇక్కడ గమనించ వలసినది , మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నే, మన గురించి తెలియ చేస్తూ ఉంటామన్న మాట. దీనినే దేహ భాష లేదా బాడీ లాంగ్వేజ్ అంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ నిత్య జీవితం లో మనకు ఎంతో ముఖ్యం.విద్యార్ధ్లులకు లిఖిత పరీక్షల తరువాత , మౌఖిక పరీక్ష సమయం లో , ఆ తరువాత ఉద్యోగాల వేట లో ఉండే ( అనేక ? !!! ) ఇన్తర్వ్యూ లలోనూ , బాడీ లాంగ్వేజ్ ప్రాముఖ్యత ఎంతో ఉంది. ( లంచాలు ఇచ్చి తెచ్చుకునే ఉద్యోగాల ఇంటర్వ్యూ లలో ఎక్కువగా ప్రయాస పడనవసరం లేదు , అంటే అసలు ‘బాడీ ‘ ఇంటర్వ్యూ లో లేక పోయినా ఉద్యోగాలు వస్తాయి కదా ! )
అట్లాగే ఒక యువకుడు , యువతి తో పరిచయం అవుతున్నప్పుడూ , అట్లాగే యువతి , యువకుడి తో స్నేహం కోరుతున్నప్పుడూ , టీచర్లు , లెక్చరర్లు పాఠాలు చెపుతున్నప్పుడూ కూడా , ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.ఇక నటులు , నటీ మణులు కావాలనుకునే వారికి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు , ఎందుకంటే , వారు బాడీ లాంగ్వేజ్ నేర్చుకోకుండా నటనకు పనికి రారు కదా అప్పుడు వారితో సినిమా తీస్తే వారే పెట్టుబడి పెట్టి తీసినది గా మనం సులభం గా అర్ధం చేసుకోవచ్చు కదా !
మనం సామాన్యం గా అంటూ ఉంటాము , ‘ వాడు ఏంటో కొండ ముచ్చు లా కూర్చున్నాడు ‘ ! అని. అంటే కోతులు, కొండముచ్చులూ కొండల మీద ఈ కదలికా లేకుండా కూర్చుంటూ ఉంటాయి. అంటే మన హావ భావాలూ , శరీర కదలికలూ మనకు జీవం పోస్తాయి, కేవలం చెట్లూ చేమలూ లాగా కాకుండా ! బాడీ లాంగ్వేజ్ లేకపోతే మనం కూడా ( ?!!! )
ప్రేమ భావనలూ , కామ భావనలూ , స్నేహ భావనలూ కూడా నోటి భాష అవసరం లేకుండానే , మనం తెలుసుకోవచ్చు కదా కేవలం బాడీ లాంగ్వేజ్ , అదే దేహ భాష ను తెలుసుకుంటే !
మరి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి వచ్చే టపా నుంచి వివరం గా తెలుసుకుందాము !
well said