నవ్వితే లాభాలు.1.
ప్రశ్న : మరి రోజూ నవ్వుతూ ఉంటే లాభాలు ఏమిటి?:
జవాబు: మనం రోజూ కొంత సమయం మనస్పూర్తి గా నవ్వుకుంటూ ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. ఈ లాభాలను మనం ముఖ్యం గా మూడు రకాలు గా చెప్పుకోవచ్చు.
1. ఫిజికల్ గా లాభాలు అంటే మన శరీరానికి జరిగే లాభాలు :
a. మన నవ్వు మన రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది.
b. మనకు వత్తిడి అంటే స్ట్రెస్ ( stress ) కలిగించే హార్మోనులను తగ్గిస్తుంది నవ్వు.
c.మనకు నొప్పి తీవ్రతను కూడా తగ్గిస్తుంది మన నవ్వు.
d.మన శరీరం లో ఉన్న వివిధ కండరాలను వ్యాకోచ పరుస్తుంది నవ్వు.
e. గుండె జబ్బు లను కూడా తగ్గిస్తుంది నవ్వు.
2. నవ్వుతో మానసికం గా లాభాలు :
a. జీవితాన్ని అర్ధ వంతం చేయడమే కాకుండా , మన జీవితాలకు ఒక అమూల్యమైన రుచిని ఇస్తుంది మన నవ్వు.
b.మన లో ఉన్న భయాందోళనలు తగ్గిస్తుంది మన నవ్వు.
c. మన మానసిక వత్తిడిని కూడా తగ్గిస్తుంది నవ్వు.
d.మన మూడ్స్ ను లిఫ్ట్ చేస్తుంది మన నవ్వు.
e.మనలో ఆశావాద మనస్తత్వాన్ని వృద్ధి చేయడమే కాకుండా , మనలను ఎక్కువ గా రిసిలిఎంట్ గా చేస్తుంది.
3. మన నవ్వుతో మనకు సామాజికం గా లేదా సాంఘికం గా కూడా చాలా లాభాలు ఉన్నాయి.
a.మనకు ఇతర మానవులతో ఉండే సంబంధాలను బలిష్టం చేస్తుంది మన నవ్వు.
b.మనలను ఇతరుల చేత ఆకర్షింప బడేటట్టు కూడా చేసేది మన నవ్వే !
c.మనకు ఇతర మానవులతో ఉన్న ఘర్షణలను కూడా మాయం చేయడమో లేదా తగ్గించడమో చేయగల శక్తి నవ్వుకు ఉంది.
d.మనం ఇతర మానవులతో కలిసి కట్టుగా ఎక్కువ ప్రభావ శీలం గా పని చేయగలిగేట్టు కూడా చేయగలదు మన నవ్వు.
e.ఆ విధం గా మనకు ఇతరులతో ఉన్న సంబంధాలను కూడా దృ ఢ పరుస్తుంది మన నవ్వు.
వివరాలు వచ్చే టపాలో నవ్వుతూ తెలుసుకుందాం !