(తాత్కాలిక ) పక్ష వాతం. 9. మరి నివారణ ఎట్లా ?
ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం గురించి చాలా విషయాలు తెలిశాయి. మరి ఈ తాత్కాలిక పక్ష వాతాన్ని నివారించడానికి చేయ వలసినది ఏమైనా ఉందా ?
జవాబు: మినీ స్ట్రోక్ లేదా తాత్కాలిక పక్ష వాతం చాలా ఆకస్మికం గా వస్తుంది. చాలా తక్కువ సమయమే ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చినప్పుడు తీవ్రం గా రావచ్చు. అంటే అప్పుడు వచ్చే పక్ష వాతం తాత్కాలికం కాక , శాశ్వతం గా అంగ వైకల్యం కానీ మాట పోవడం కానీ కలిగించ వచ్చు. అందు వలన ఒక సారి మినీ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే , లేదా ఆ లక్షణాలు అసలు కనిపించక ముందే , మనం ఆరోగ్య ప్రధాన చర్యలు చేపట్టి, వాటిని తు.చ. తప్పకుండా నిత్యమూ ఆచరిస్తే , అవి తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చి మనలను ఆరోగ్య వంతులు గా ఉంచుతాయి, చాలా కాలం పాటు. మరి ఆ నివారణ చర్యల వివరాలు చూద్దాము.
1. అతి బరువు , ఊబ కాయం లేదా ఒబీ సిటీ తగ్గించు కోవడం : అతి గా బరువు గా ఉంటే , ఆ పరిస్థితి తప్పకుండా , అధిక రక్త పీడనానికీ , మధుమేహానికీ , గుండె జబ్బు కూ దారి తీయడం అనివార్యం. అతి బరువు తగ్గడానికి తీసుకోవలసిన చర్యల గురించి ముందు ముందు తెలుసుకుందాం.
2.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.: దీని వల్ల రక్త పీడనం తగ్గడమే కాకుండా , పక్ష వాతం, గుండె జబ్బులూ, క్యాన్సర్ లూ వచ్చే అవకాశాలు తగ్గి పోతాయి.
3.ఆరోగ్య ఆహారపు అలవాట్లు :
a.యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువ గా ఉన్న ఆహారం తినడం.
b.ఉప్పు రోజూ ఆరు గ్రాములకన్నా మించ కుండా ఉన్న ఆహారం తినడం.
c.వీలైనన్ని కాయ గూరలు రోజూ తినడం.
d.నూనె పదార్ధాలు ముఖ్యం గా సాచురే టెడ్ ఫ్యాట్స్ తక్కువగా తినడం.
e.స్మోకింగ్ చేయక పోవడం, చేస్తుంటే వెంటనే మానడం.
f.మద్య పానం చేయక పోవడం, ఒక వేళ చేస్తుంటే మితం గా తాగడం.
పైన వివరించిన ఈ చర్యలు అన్నింటి లోనూ ఏ ఒక్కటి అశ్రద్ధ చేసినా , మనం రిస్కు ను ఎక్కువ చేసుకుంటున్నట్టే !
ఆసక్తి ఉన్న వారు , ఈ క్రింది వీడియో తప్పకుండా చూడండి, చాలా వివరం గా ఉన్నాయి పక్ష వాతానికి నివారణ చర్యలు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !