Our Health

పక్ష వాతం ( stroke ).4. రకాలూ , కారణాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 22, 2012 at 5:26 సా.

పక్ష వాతం ( stroke ).4. రకాలూ , కారణాలూ ! 

క్రితం టపాలో మనం సర్వ సాధారణం గా వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా  మెదడు లో రక్త లోపం తో వచ్చే పక్ష వాతం గురించీ , వాటిని నివారించడం లో మానవుల జీవనశైలి లో మార్పుల గురించీ తెలుసుకున్నాం కదా ! 
ఇప్పుడు రెండవ కారణమైన హెమరేజిక్ స్ట్రోక్ లేదా రక్త స్రావం వల్ల వచ్చే స్ట్రోక్ లేదా పక్ష వాతం గురించి తెలుసుకుందాం !
హెమరేజిక్ స్ట్రోక్ ను సెరిబ్రల్ హేమరేజ్  లేదా ఇంట్రా క్రేనియల్ హేమరేజ్ అని కూడా అంటారు.  సెరిబ్రల్ హేమరేజ్ అంటే మెదడు లో కలిగే రక్త స్రావం లేదా ఇంట్రా సెరిబ్రల్ హేమరేజ్ అంటే కూడా మెదడు లోపలి భాగాలలో కలిగే రక్త స్రావం అన్న మాట. 
ప్రశ్న : దీనికి కారణాలు ఏమిటి ? : 
జవాబు: మెదడు లో రక్త స్రావానికి ప్రధాన కారణం  అధిక రక్త పీడనం లేదా హై బీ పీ.  ఈ అధిక రక్త పీడనం వల్ల , అతి సున్నితమైన రక్తనాళాలు మెదడు లో ఉండేవి ,  ఈ రక్త నాళాలు చిట్లి పోవడం జరుగుతుంది. ఇట్లా రక్తనాళాలు చిట్లడం వల్ల ,  మెదడులో రక్త స్రావం అవుతుంది. అంటే బ్లీడింగ్. ఇట్లా బ్లీడింగ్ అవడం వల్ల , ఆ యా ప్రాంతాలలో మెదడు పనిచేయడం ఆగి పోతుంది.   
ప్రశ్న : మరి హై బీ పీ కి కారణాలు ఏమిటి ? 
 
జవాబు : 1. ఊబ కాయం లేదా ఓబీ సిటీ 
               2. వ్యాయామం లేక పోవడం లేదా చాలా తక్కువ గా ఉండడం.
               3. స్మోకింగ్ 
               4. అతి గా మద్యం సేవించడం.
పైన ఉన్న కారణాలు  మనం జాగ్రత్త గా గమనించి నట్లయితే ,  రెండు ,  నాలుగు  కారణాలు ఒకటో కారణాన్ని ప్రభావితం చేస్తాయి.  ఒకటీ , మూడు కారణాలు అధిక రక్త పీడనాన్ని కలిగిస్తాయి.  
 జీవితం ఎప్పుడూ ఆందోళన మయం గా ఉంటే , తీవ్రమైన మానసిక వత్తిడి ఏర్పడుతుంది. తీవ్రమైన మానసిక వత్తిడి తో ఎక్కువ కాలం, అంటే రోజులో ఎక్కువ భాగం తో పాటుగా , ఎక్కువ సంవత్సరాలు కూడా వత్తిడి ఉంటే , దాని ప్రభావం అధిక రక్త పీడనం గా చూప వచ్చు. 
ఈ అధిక రక్త పీడనం , పైన చెప్పిన ఏ కారణాల వల్ల నైతే నేమి ?  , మెదడు లోని అతి సున్నితమైన రక్త నాళాల ను చిట్లించి ,  పక్ష వాతానికి హేతువు అవుతుంది. 
అరుదు గా కొందరికి పుట్టుక తో వచ్చిన లోపాల వల్ల మెదడు లో రక్త నాళాలు కొన్ని బలహీనమైన వి గా ఉంటాయి. ( వీటిని ఆంగ్లం లో సెరిబ్రల్ ఎన్యురిజం అంటారు )  అందువల్ల వారి రక్త పీడనం లో ఏమాత్రం హెచ్చు తగ్గులు ఏర్పడినా , అవి తట్టుకోలేక చిట్లి పోతాయి. ఈ పరిస్తితి , అరుదుగా  వయసులో ఉన్న యువతీ యువకుల కు కూడా ఎర్పడ వచ్చు 
పైన ఉన్న చిత్రం చూడండి. ఇంకా ఆసక్తి ఉంటే , క్రింద ఉన్న వీడియో కూడా చూడండి. సందేహాలు ఉంటే తెలియ చేయండి. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
  1. డాక్టర్ గారు, ఇన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే భయమేస్తోంది 🙂

    • భయం ఎందుకు శర్మ గారూ ,
      జాతస్య మరణం ధృవం అన్న విషయం మనకందరికీ తెలిసినదే కదా ! తగిన జాగ్రత్తలు తీసుకుంటే , మన జీవితాలను ఎక్కువ గా అనుభవించ గలుగుతాము , ఎక్కువ సఫర్ అవకుండా !
      అంటే బాధ పడకుండా ! ఈ టపాల ఉద్దేశం , ఆరోగ్యం మీద అవగాహన పెంచడానికే గానీ , భయం కలిగించడానికి ఏమాత్రం కాదు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: