జీవన శైలి లో మార్పుల తో 50 % క్యాన్సర్ లు నివారించ వచ్చు !
ప్రశ్న: మనం వివిధ క్యాన్సర్ ల గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటాము. మరి వాటి నివారణకు మనం చేయ వలసినది ఏమైనా ఉందా ? లేక అంతా దైవాధీనమా ?
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న . సాధారణం గా మనం వివిధ క్యాన్సర్ ల గురించి వింటూ ఉంటాము. తెలిసిన వారికి ఆ క్యాన్సర్ వచ్చింది , లేదా వీరికి ఈ క్యాన్సర్ వచ్చింది. ‘ అయ్యో పాపం, ఆరోగ్యం గా తిరిగే వాడు లేదా చాలా ఆరోగ్యం గా ఉండేది ఆమె ‘ అని కూడా మనం అనుకుంటూ, కలత చెందుతూ ఉంటాము , బాధ పడుతూ ఉంటాము.
ఇటీవల ప్రపంచ క్యాన్సర్ కాంగ్రెస్ అంటే ప్రపంచ క్యాన్సర్ మీటింగ్ ఒకటి జరిగింది, కెనడా లో ( క్యుబెక్ అని ఒక పట్టణం లో ). ప్రపంచం లోని వివిధ దేశాలలో ఉన్న క్యాన్సర్ స్పెషలిస్టులు ఈ మీటింగ్ లో తమ తమ పరిశోధనా ఫలితాలను తెలిపారు. వాటి సంగ్రహమే ఈ టపా.వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన గ్రహం కోల్దిజ్ అనే శాస్త్రజ్ఞుడు తన పరిశోధనా ఫలితాలను ‘ ప్రపంచం లో వివిధ దేశాలలో క్యాన్సర్ నివారణ చర్యలను విస్తృతం గా అమలు పరిస్తే , వచ్చే పదిహేను , ఇరవై సంవత్సరాలలో , అనేక రకాల క్యాన్సర్ లను చాలా వరకూ నివారించ వచ్చు ‘ అని ఘంటా పధం గా చెప్పాడు. ప్రస్తుతం అమెరికా లోని యుటా రాష్ట్రం లో స్మోకింగ్ చేస్తున్న వారు కేవలం పదకొండు శాతమే ! అంటే స్మోకింగ్ చేసే వారు, అనేక చర్యల ఫలితం గా చాలా తక్కువ అయ్యారు. గ్రహం అంచనా ప్రకారం , స్మోకింగ్ నివారణ చర్యలను వివిధ దేశాలలో, ఇదే విధం గా , ఖచ్చితం గా అమలు చేస్తే , స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్ లను మూడు వంతులు నివారించ వచ్చు అని పేర్కొన్నాడు.
అదే విధం గా ఊబకాయం అంటే ఒబీసిటీ ప్రస్తుతం కనీసం ఇరవై శాతం క్యాన్సర్ లకు కారణం. వివిధ దేశాలలో ప్రజలు , ఊబకాయం లేకుండా , నివారణ చర్యలు తీసుకుంటే , ఒక ఇరవై ఏళ్ళ లో ఒబీసిటీ వల్ల కలిగే వివిధ క్యాన్సర్ లను యాభయి శాతం వరకూ నివారించ వచ్చు. మనకందరికీ తెలిసిందే కదా , ఒబీసిటీ నివారణ కేవలం మనం తీసుకునే రెండు చర్యల వల్ల సఫలం అవుతుంది. ఒకటి డయట్. రెండు ఎక్సర్సైజ్.
అట్లాగే బాల్యం లో , తప్పని సరిగా టీకాలు వేయించుకోవడం వల్ల కూడా క్యాన్సర్ లను వంద శాతం నివారించు కోవచ్చు. ప్రత్యేకించి హ్యూమన్ పాపిలోమా వైరస్ , హెపటైటిస్ బీ ఇంకా సి వైరస్ లు కలిగించే క్యానర్ లకు టీకాలు అందుబాటు లో ఉన్నాయి. ఇది మన వైద్య శాస్త్ర విజ్ఞానం చేసిన విశేషమైన పురోగతి. ఈ టీకాలను సరి అయిన సమయం లో చేయించు కుంటే ఈ వైరస్ లు కలిగించే అనేక క్యాన్సర్ లను వంద శాతం నివారించు కోవచ్చు.టమాక్సిఫెన్ అనే మందు కూడా కొన్ని రకాల రొమ్ము లేదా స్తన క్యాన్సర్ లను కనీసం యాభయి శాతం నివారిస్తుంది అని అనేక పరిశోధనల వల్ల విశదమైంది. అదే విధం గా మనం సామాన్యం గా జ్వరం వచ్చినప్పుడు వేసుకునే యాస్పిరిన్ టాబ్లెట్ కూడా పెద్ద ప్రేగు లేదా కోలన్ క్యాన్సర్ ను కనీసం నలభై శాతం నివారిస్తుంది.
తెలిసింది కదా , మానవులలో వచ్చే అన్ని క్యాన్సర్ లూ దైవాధీనం కాదు , మానవాధీనం కూడా అని ! నివారణ మీ చేతులలో నే ఉంది కదా ! కాల యాపన ఎందుకు ఆచరణకు? !
( రొమ్ము క్యాన్సర్ , సెర్వికల్ క్యాన్సర్ , లంగ్ క్యాన్సర్ నివారణ చర్యల గురించి , విపులం గా క్రితం టపాలలో తెలియ చేయడం జరిగింది. వీలు చేసుకుని బాగు ఆర్కివ్స్ లో చూడండి మీ ‘ బాగు ‘ కోసం ! )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
good