ప్ర.జ.లు.15. ఇన్ ఫిడిలిటీ లక్షణాలు:
6.సొంత షోకు: ఎఫైర్ లలో పడ్డవారు , లేదా పెట్టుకుంటున్న వారు , తమ స్వంత వేష ధారణా , వ్యక్తిగత గ్రూమింగ్ అంటే పోషణా , అందం, ఆకర్షణా , ఇట్లాంటి విషయాల మీద , మునుపెన్నడూ లేని శ్రద్ధ చూపుతారు. లేటెస్టు హెయిర్ స్టయిల్ లు చేయించుకోవడం, జిమ్ కు వెళ్ళడం , అందమైన అలంకరణలు చేసుకోవడం , ఆకర్షణీయం గా కనిపించడం ,మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.
7. జీవితేచ్చ పెరుగుతుంది: అంత వరకూ దిగాలు పడి , జీవితం మీద, జీవించడం మీద అంత గా ఉత్సాహం చూపని వారు కూడా, ఎఫైర్స్ పెట్టుకోగానే , అత్యంత ఉత్సాహం తో , జీవితం లో ఆశా జనకమైన మార్పులు కోరుతూ , అందు కు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక విధం గా చెప్పుకోవాలంటే , ఎఫైర్స్ పెట్టుకుంటున్న వారు , డిప్రెషన్ బూజు దులుపుకుని ,ఆశ , ఉత్సాహాల వెలుగు తో ఇన్ ఫిడిలిటీ ‘ పధం ‘ వైపు పయనిస్తారు. అంతే కాక , అంతకు ముందు ఎపుడూ చేయని సాహస వంత మైన కార్యాలు , ఆటలూ , పర్యటనలు , ఇట్లాంటివి కూడా ఎంతో ఉత్సాహం తో చేపడుతూ ఉంటారు. ఉదా: ప్రకాష్ , ఇంటి పట్టున భార్యను అంటి పెట్టుకునే ఉండేవాడు ఎపుడూ ! ఆటలలో , వ్యాయామం లో ఎక్కువ ఉత్సాహం చూపే వాడు కాదు. అట్లాంటిది , ఒక రోజు ఉన్నట్టుండి , భార్య తో బజారు కు వెళ్లి టెన్నిస్ ఆట కు కావలసిన సరంజామా అంతా కొనేశాడు. అంతే కాక , మంచి డిజైనర్ స్పోర్ట్ షార్ట్స్ తీ షర్ట్ లు కూడా కొన్నాడు. భార్య ఆశ్చర్య పోయినా , ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు , పైగా చాలా ఆనంద పడ్డది కూడా , తన భర్త ఆరోగ్యం విషయం లో ఎక్కడ లేని శక్తి ఉత్సాహం తెచ్చుకుని ,తగిన వ్యాయామాలూ , ఆటలు ఆడడం మొదలు పెడుతున్నందుకు. ప్రకాష్ ఆటలు, ఆఫీసులో తన లేడీ కొలీగు తో జత కట్టి , టెన్నిస్ తో పాటుగా ఆడే ప్రేమాటలూ, కామ వాంఛ ల మాచ్ లూ అని ఏమాత్రం తెలియదు ఆమెకు !
8. అసమంజసమైన సమర్ధన : ఈ ఇన్ ఫిడిలిటీ లక్షణాలు ఉన్న వారు , వారు చేస్తున్న పనులనూ , వ్యవహారాలనూ , చాలా అసమంజసం గా సమర్ధించు కుంటారు. అంటే వారికి ఆ విషయం అర్ధమైనా , తమ పొరపాటును , చాలా తీవ్రం గా సమర్ధించు కుంటారు, ఎట్టి పరిస్థితులలోనైనా ! ఉదా: ‘ ఏమండీ , నా ప్రక్కన పడుకుని రాత్రంతా నిద్ర పోనిచ్చే వారు కాదు ,మీ చిలిపి పనులతో , ఇప్పుడు అది లేక పోగా మీరు కూడా నిద్ర పోవట్లేదు , ఎప్పుడూ , మొబైల్ తో ఎవరికో టెక్స్ట్ లూ , గుస గుసలూ , ఎవరితో చేస్తున్నారండీ , మీ ఆఫీసులో ఉన్న ఆ రమ తో నేనా? ! అని పొరపాటున అడిగితే ‘ పిచ్చి పిచ్చి గా నోరు పారేసుకోక , నీ వాదనలకూ , అపవాదులకూ అర్ధం పర్ధం లేకుండా పోతుంది మరీ , మాటలు జాగ్రత్తగా రానీయి ‘ అని భార్యను తీవ్రం గా మందలించి తాను మాత్రం రమకు మొబైల్ లో ‘ రేపు ఆఫీసుకు పింకు చీర కట్టుకు రా ! చాలా అందం గా ఉంటావు అందులో , అలా ఆఫీసు అయ్యాక పార్కు దగ్గర కలుద్దాము ‘ అని టెక్స్ట్ పంపాడు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !