ప్ర.జ.లు. 12. ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ?
ప్రశ్న: ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ?
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న. ( మనం ఇంతవరకూ స్త్రీలలో నూ , పురుషుల లోనూ , ఎఫైర్స్ , ఇన్ ఫిడిలిటీ కి కారణాలు ఏమిటి ? అనే విషయాన్ని సవివరం గా తెలుసుకున్నాము కదా ! ఏవైనా సందేహాలూ , ప్రశ్నలూ ఉంటే తెలియ చేయండి తెలుగులో కానీ , ఇంగ్లీషులో కానీ ! ) చాల సంబంధాలలో కారణాలు ఏమైనప్పటికీ , భాగ స్వాములు , ఆ సంబంధం విడి పోకూడదని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లాగే అనేక సంబంధాలలో ఈ ఎఫైర్స్ పెట్టుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ , అతి జాగ్రత్తగా , తమ గేమ్ లేదా ఆట ఆడుతూ ఉంటారు. ఇది అచ్చు , చిన్న తనం లో సహజం గా పిల్లలందరూ ఆడుకునే దొంగాట లాగా ఉంటుంది. చాటు మాటు గా , ఎవ్వరికీ దొరకకుండా అతి రహస్య ప్రదేశాలలో దాక్కోవడం !. ఈ గేమ్ ను ఎంత నిగూ డం గా , రహస్యం గా ఆడుతూ ఉంటే , అంత త్రిల్ గానూ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక వాస్తవం ఏమిటంటే ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ చాలా శాతం వరకూ పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే , ప్రేయసీ ప్రియులు చాలా పకడ్బందీ గా వ్యూహాలు పన్నుతూ ఉంటారు. అందుకే విదేశాలలో , అనేకమైన గూ ఢ చార ఏజెన్సీలు ఈ ఎఫైర్ లనూ ఇన్ ఫిడిలిటీ లనూ పట్టుకోడానికి అత్యంత ఆధునిక పరికరాలు , ఉపయోగించి , అనుభవజ్ఞులైన గూ ఢ చారుల చేత ఇన్వెస్టిగెట్ చేయిస్తూ ఉంటారు, భార్యలు కానీ భర్తలు కానీ ! భారత దేశం లో కూడా ఈ కొవ కు చెందిన ఏజెన్సీ లు పుట్ట గొడుగుల్లా వచ్చాయి. బాగా సొమ్ము కూడా చేసుకుంటున్నారు.
మరి ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ? ఒక జంట లో ఏ ఒక్కరు ఎఫైర్స్ కలిగి ఉన్నా , ఇంకొకరు ఎట్లా కనుగొన వచ్చు ? : పైన చెప్పుకున్నట్టు , ఈ ఎఫైర్స్ ను కనుక్కోవడం చాలా కష్టం. కానీ కొన్ని సూచనలను గమనిస్తే , ఇన్ ఫిడిలిటీ ని అనుమానించ వచ్చు.
1. ఎమోషనల్ గా దూరం గా ఉండడం : ఉదా: శోభ ! ఇరవై నాలుగు సంవత్సరాల వయసు. B.A ఫైన్ ఆర్ట్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాసవగానే పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తరువాత మూడేళ్ళూ ఆ జంట కు ఇరవై నాలుగు గంటలు సరిపోలేదు. ఎప్పుడూ, సరస సంభాషణలతో , ప్రణయ భావనలతో , కాలం గడిచిపోయేది. భర్త చాలా ‘ సంస్కారి ‘ శోభ తో తన బంధం పదిలం గా ఉండాలని కృత నిశ్చయం తో ఉండే వాడు. అంతే కాక , శోభతో ప్రేమ బంధం తో పాటుగా , ఒక విడదీయ రాని రాగ బంధం కూడా ఏర్పరుచు కున్నాడు. ఎందుకంటే ,కామ సూత్రాలు చాలా శ్రద్ధ గా చదివి ఆకళింపు చేసుకుని , శోభతో ఆ బొమ్మలు కూడా చూపించి , శోభతో ఎక్స్పరిమెంట్ చేసేవాడు. ఆ కాలం ఎంతో మధురం గా ఉండేది. కానీ ఒక్కసారిగా అతనిలో మార్పు వచ్చింది. ఎందుకో ఏమో , ఎమోషనల్ గా చాలా దూరం గా ఉంటున్నాడు. శోభకు భర్తను చూస్తె ఎంతో డిప్రెషన్ ఫీల్ అవుతున్న వాడిలా ఉండేవాడు. ఆమెకు ఎదురుగా లాంజ్ లో ఫ్లవర్ వాజ్ లో వాడి పోయి , వాలి పోయి ఉన్న పూవు కాడ లో అతను కనిపించాడు. సెక్స్ లో నిరాసక్తత చూపుతున్నాడు. బెడ్ టైం లో ముసుగు తన్ని పడుకుంటున్నాడు. చాలా తక్కువ గా మాట్లాడు తున్నాడు. ఎప్పుడూ ఏదో అత్యంత ముఖ్యమైన పని ఉన్నట్టు సెల్ ఫోన్ లో మాట్లాడడమూ చేస్తున్నాడు. ఇంట్లో , ఇదివరకటి లా పట్టించు కోవడం లేదు. ఎంత వెచ్చని , చిక్కని కౌగిలి ఇచ్చే వాడు ! ఏవి ఆ కౌగిళ్లు , ఏవి ఆ కామోచ్చ దశలు , ఏది ఆ కామ వాంఛ ? అతను తన వాడేనా ? అన్న అనుమానం కలుగుతుంది శోభకు. శోభ అనుమానం నిజమే ! అతని ప్రవర్తనలో మొదటి మార్పు ఎమోషనల్ గా శోభ తో దూరం గా ఉండడం, అతని ఇన్ ఫిడిలిటీ కి బీజాలు పడుతున్నట్టే !
ఇంకొన్ని లక్షణాలు ఇంకో టపాలో తెలుసుకుందాం !