ప్ర.జ.లు. 9. స్త్రీలూ- ఇన్ ఫిడిలిటీ లూ !
ప్రశ్న : మరి విదేశాలలో ఈ పరిస్థితి ఎట్లా ఉంది ? :
జవాబు : విదేశాలలో స్త్రీల ఇన్ ఫిడిలిటీ పరిస్థితి ‘ ఆశా జనకం ‘ గా ఉంది. ఒక అంచనా ప్రకారం, విదేశాలలో పురుషులలో యాభై నుంచి డెబ్బయి శాతం వరకూ ఉంటే , స్త్రీలలో ముప్పై నుంచి అరవై శాతం ఉంది. ఈ గ్యాప్ అతి త్వరగా తగ్గి పోతూ ఉన్నది.అంటే ఈ విషయం లో కూడా స్త్రీలు , పురుషులతో సమానత్వానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికా లో ప్రెసి డెన్ షియల్ కాండిడేట్ అనుకున్న సారా పాలిన్ తన భర్త బిజినెస్ పార్టనర్ తో తన రొమాంటిక్ పార్టనర్ షిప్ రహస్యం గా సాగించినది. దానితో ఆమె భర్త , తన బిజినెస్ లో అతని పార్టనర్ షిప్ కు ఉద్వాసన చెప్పాడు. రొమాంటిక్ పార్టనర్ షిప్ నిర్విఘ్నం గా కొనసాగించ డానికా అన్నట్టు ! స్త్రీలలో ఇన్ ఫిడిలిటీ అనేది కేవలం సాహసోపేత మైనదే కాక , డెస్పరేట్ అంటే తప్పని సరి పరిస్థితులలో జరుతుతుంది. డెస్పరేట్ ఎందుకంటే , స్త్రీలు తమ వ్యక్తి గత ప్రణయ సంబంధాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు.ఆ సంబంధాలలో తుఫాను వస్తే తట్టుకోలేరు. సుడి గాలికి తల్లడిల్లే పూ రెక్క అంటే petal of a flower లా విల విల లాడతారు. వారు ఆ సమయం లో తీసుకునే ఆ చర్య , అదే ఇన్ ఫిడిలిటీ , వారు సేద తీర్చుకోడానికి , ఆలంబన గా ఉండాలని భావిస్తారు.వారికి ఆ సమయం లో కావలసినది సేద తీర్చే ఒక నును వెచ్చని కౌగిలి , వారి ముఖం మీద ముంగురులు సరిచేస్తూ , వడి వడి గా కొట్టుకుంటున్న వారి ‘ గుండె సడి ‘ వినగలిగే స్నేహ పూర్వక మనసూ కల ఒక బల వంతుడైన పురుషుడు ! వారి నిర్ణయం సాహసోపేతమైనది కూడానూ ! ఎందుకంటే , వారు తీసుకునే ఆ నిర్ణయం తో , వారు ఒక సమూలమైన మార్పు , వారి జీవితాలలో రావాలని ఆశిస్తారు. అంటే వారు తీసుకునే ఆ సాహసోపేత నిర్ణయం ఒక క్యాటలిస్ట్ ( catalyst ) గా పని చేసి , తనువూ , అధరాలూ కూడా కలగలిసిపోయి, తమ జీవన రసాయన మిశ్రమం, ఒక మధురమైన నూతన నవ జీవన ప్రణయ కావ్య రసాయనం కావాలని కలలు కంటారు. ఇట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు , కేవలం వారికి ఒక స్థిరమైన ఉద్యోగం, ఇల్లూ, భర్తా, పిల్లలూ , లేనివారే తీసుకుంటా రనుకోవడం పొరపాటే ! కొన్ని సమయాలలో , ఉదయాన్నుంచీ , రాత్రి వరకూ , తీరిక లేని పనీ, బాధ్యతా, పిల్లల పోషణా బాధ్యతా , వారి హడావిడీ , షాపింగ్, క్లీనింగ్ , లాంటి మొనాటనస్ జాబ్స్ , అన్నీ కూడా కలిసి , స్త్రీ ని క్రమేణా నిరుత్సాహ పరుస్తూ ఉండడమే కాక , ఆమె మెదడులో ఉన్న డోపమిన్, సీరోటోనిన్, ఆక్సి టోసిన్, ఇంకా వాసో ప్రెసిన్ లాంటి రసాయనాలను తగ్గించి , ఆమెను మానసికం గా నిర్వీర్యం కూడా చేస్తాయి. ఆమె ఒక జటిలమైన వలలో బంధించ బడిన చేపలా ఫీల్ అవుతూ ,గిల గిల లాడుతూ ఉంటుంది. శక్తి హీనం గానూ , ఫీల్ అవుతూ , విపరీతమైన ఒంటరి తనం తో ఒక్క సారిగా , ఒక సాహసోపేత నిర్ణయానికి అంకురార్పణ చేయ వచ్చు.
ఆమె సాహసోపేత నిర్ణయానికి కొస మెరుపులా , ఆమె భర్త , ఎప్పటి లాగానే ఆమె సమస్యలు ఏవీ పట్టనట్టు , ప్రతి కలయిక లో , ఆమె ‘ మీద నుంచి ‘ ఆమె లో ‘ ప్రవేశించ డానికే ‘ ఉత్సాహం చూపుతాడు కానీ , ఆమె గుండె తలుపు తట్టి , ఆమె మనసు మాట వినడు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Very good and interesting.