ప్ర.జ.లు. 6. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !
ప్రశ్న: మిగతా కారణాలు ఏమిటి మగ వారి ఇన్ ఫిడిలిటీ కి ?
జవాబు: ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
19. ప్రతీకార వాంఛ : మూడు సంవత్సరాల నుంచీ తాను ఎంతగానో ప్రేమించుతున్న తన ఇల్లాలు కేవలం తన మద్య పానం వల్ల వదిలేసి పోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు బాగోలేదనీ , వారి దగ్గర తాను ఉండాలనీ కూడా చెప్పింది.కానీ చేసిందేమిటి?తల్లి దండ్రులు కుదిర్చిన ఇంకో సంబంధం చేసుకుని హాయి గా ఉంది. తనకేమీ తక్కువ కాలేదు , మద్యం ముట్టుకోవట్లేదు ఇప్పుడు , మగువలు కావాలనుకుంటే తప్పేంటి ? అనుకునే స్వభావం.ప్రతీకార భావం.
20. ‘ అది ‘ ఇంకా ఉందో లేదో ! : పిల్లలు కాలేజీ కీ వెళుతున్నారు. అయితే ఏం ? తనలో ఏమాత్రం ‘ అది ‘ తగ్గి పోవడం లేదు కదా , ఇంకా ఎక్కువ గా ఉంటుంది. ఈ రోజులలో ! తన భార్యామణి చాలా మంచిది. కానీ ‘ ఆ ‘ విషయాని కొస్తే , ‘ బాగా అలసి పోయాను ,మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీసు కు తయారవాలి అంటుంది. ఇక ఆది వారాలు పూజలూ , పునస్కారాలతో సతమతం అవుతుంది. తాను , తనకు తోచిన విధం గా ఇంకో దేవి పూజ చేసుకుంటే సరిపోతుంది ‘ అనుకునే ఆత్మ సమర్ధనాభావం. ఈ వయసులో వారు సామాన్యం గా తమ భార్య కంటే , తక్కువ వయసు వారితో కామ క్రీడలకు వ్యామోహ పడుతుంటారు.
21. రూల్స్ తనకు కాదు : తాను , చిన్న తనం నుంచీ , పెద్దగా రూల్స్ పట్టించు కున్నది లేదు. స్కూల్ లోనూ , కాలీజీ లోనూ తనకు మాత్రం లేవు రూల్స్. తన ఉద్దేశం లో రూల్స్ ను పట్టించుకునే వారు ఫూల్స్. ఒకరి కన్నా ఎక్కువ మంది స్త్రీలతో పొందు, తన రూలు.భార్య తోనే జీవితాంతం గడపడం ఏమి రూలు ?! అనుకునే ధిక్కార స్వభావం.
22. తాను ఆ పని చెయ్య గలడు : తనకు ఏ విధం గానూ లోపం లేదు ! మరి ఆ పని తాను ఎందుకు చేయ కూడదు ? అనుకుని పట్టుదలతో ఇంకో యువతిని పట్టుకునే స్వభావం.
23. నైతికమైన అంటే నీతి బద్ధమైన జీవితం మీద ఏమాత్రం నమ్మకం లేక పోవడం: వీరి దృష్టి లో మిగతా మగ వారంతా స్త్రీ లోలురే , మరి తాను ఎందుకు కాకూడదు అనే పొరపాటు స్వీయ సమర్ధనా భావం.
24. వ్యసన లోలురు అవడం అంటే వ్యసనాలకు అలవాటు పడడడం : సామాన్యం గా మూడు W లు అని అంటుంటారు ( Wealth, Wine and Women ). డబ్బు ఉండగానే , అలవాట్లకు అవకాశం ఎక్కువ అవుతుంది. అది మద్యమే కావచ్చు , ఇతర మాదక ద్రవ్యాలే కావచ్చు. వాటి తో ఇన్హి బిషన్స్ కోల్పోవడం సామాన్యం గా జరిగేదే. అంటే , యుక్తా యుక్త విచక్షణ , కామ వాంఛ ల మీద నియంత్రణ , కోల్పోవడం జరుగుతుంది. ఆ తరువాత , వేరే యువతి తో శృంగారం కూడా ‘ ఎంతో మత్తు గా ‘ ఉంటుంది.
25. సెక్స్ అడిక్షన్ : పైన ఉదాహరించిన వాటన్నిటి లోకీ , సెక్స్ అడిక్ షన్ ఒకటే అతనికి ఉంటే, అది క్షమార్హం. సెక్స్ అడిక్ షన్ అనే పరిస్థితి ఒక మెడికల్ కండిషన్. ఈ పరిస్థితి ఉన్న వారు నిరంతరం కామ వాంఛ తో ఉండి , అనేక మంది ఇతర యువతులతో,కామ క్రీడలకు ఎప్పుడూ అర్రులు చాస్తూ ఉంటారు. వారికి నిరంతరం కామ నామ స్మరణే ! కామ కార్య వాంఛ లే ! వారి ఆలోచనలు, వారి మెదడు కే పరిమితం కాక , వారు ఏమాత్రం సంకోచించ కుండా అనేక మంది స్త్రీలతో సంబంధాలు కూడా పెట్టుకుంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
quite interesting
మీ అభిప్రాయానికి కృతఙ్ఞతలు శర్మ గారూ ! కానీ అసలు మీకు ఆ అనుమానం వచ్చినందుకే నాకు ఆశ్చర్యం గా ఉంది !