ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !
అఫైర్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ , భౌతికం గా అంటే శారీరికం గా సంబంధం కావచ్చు, లేదా ఎమోషనల్ గా సంబంధం కావచ్చు. అంతే కాక , కేవలం ఎమోషనల్ , ఇంకా శారీరికం గానే కాక ఈ సంబంధాలు , ఇరువురి మధ్యా ఉన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తాయి. అప్పుడు ఆ సంబంధాలు మోస పూరితం కూడా అవుతాయి. ఒక దేశం లో బహిరందం గా ఒకరి తో సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తి , అఫైర్ ఇంకో వ్యక్తి తో కలిగి ఉండవచ్చు.భావావేశ పూరితమైన అఫైర్స్ లేక సంభంధాలు కూడా శారీరికం గా ఇంకొకరికి కలిగించేంత బాధ కలిగించ గలవు.మానవ పరిణామం జరుగుతున్న కొద్దీ , ప్రపంచం లో వివిధ దేశాలలో ఈ అఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ , ఆ యా దేశ నాగరికతా సంస్కృతుల బట్టి మారుతూ ఉంటాయి.
ప్రశ్న: ఈ ఎఫైర్ లూ ఇన్ ఫిడిలిటీ లూ మన సమాజం లో ఎంత సామాన్యం ? :
జవాబు: కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం , ఈ రోజుల్లో , సంబంధం కలిగి ఉన్న ఇద్దరిలో ఒకరు, శారీరికం గా కానీ , మానసికం గా అంటే ఎమోషనల్ గా కానీ ఇంకొకరితో సంబంధం కలిగి ఉండడానికి, కనీసం 50- 50 చాన్స్ ఉంటుంది . అమెరికాలో వివాహం చేసుకున్న వారిలో 30 నుంచి 60 శాతం మంది, తమ జీవిత కాలం లో ఎప్పుడో ఒకప్పుడు ఎఫైర్స్ కలిగి ఉంటారని ఒక అంచనా ! ఇంకో అంచనా ప్రకారం , విడాకులు తీసుకున్న వారిలో, కనీసం తొంభై శాతం మంది , ఎఫైర్స్ అంటే వివాహేతర సంభంధాలు కలిగి ఉన్నారని తెలిసింది. అంతే కాక , ఇరవై ఏడు శాతం మంది ( అమెరికాలో ) వివాహం చేసుకుని ఆనందం గా ఉన్నామని చెప్పిన వారు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు !
ఇటీవల యాభై మూడు దేశాలలో విశ్వ విద్యాలయాలలో చదువుతున్న పదహారు వేల మంది విద్యార్ధులలో జరిపిన ఒక పరిశీలన లో 20 శాతం మంది దీర్ఘ కాలిక సంబంధాలు ఏర్పరుచుకున్న వారు, అప్పటి కే ఇంకోరితో కూడా సంభంధాలు కలిగి ఉన్నారు. ఇంకా పరిశీలనలలో తెలిసిన నిజం. నలభై శాతం మంది అవివాహితులూ , ఇరవయి శాతం మంది దాకా వివాహితులూ కూడా , కనీసం ఒకటైనా కామ పరమైన సంబంధం కలిగి ఉన్న వారే ! స్త్రీల కన్నా , పురుషులు అధికం గా ఈ ఇతర సంబంధాలు కలిగి ఉంటారు.
2003 లో ఇంగ్లండు లో ఉన్న ఒక యాభయి మంది లాయర్లను ఒక ప్రశ్న అడిగారు ఒక పరిశీలనలో. అతి సామాన్యం అయిన కారణం ఏమిటి మీ దగ్గరకు విడాకుల కోసం వచ్చే వారికి ‘ అని అడిగినప్పుడు , యాభై అయిదు శాతం విడాకులు పురుషులు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో , లేక నలభయి అయిదు శాతం విడాకులలో స్త్రీలు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో విడాకులు సంభవిస్తున్నాయి అని తెలిసింది. ఈ విధమైన వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం , వారు వారి భాగస్వాములతో తక్కువ సమయం గడపడం వలెనే అనీ , ఇంకా విద్యార్ధులు , వారి వివాహం అయ్యే లో గా వీలైనంత మంది తో శారీరిక సంభంధం కలిగి ఉండాలనుకునే కామ వాంఛ తో పాటు గా యునివర్సిటీ విద్యాలయాలలో వారికి కలుగుతున్న అవకాశాలు కూడా అని పరిశీలనలలో తెలిసింది.అంతే కాక వయసు మీద పడుతున్న వారి లో కూడా ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి అని తెలిసింది.
ప్రశ్న : మరి ఈ ఎఫైర్స్ , ఇన్ ఫిడిలిటీ లు కలిగి ఉండడం లో పురుషులు స్త్రీల కంటే ఎందుకు ముందున్నారు ?:
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాము !