ప్ర.జ.లు. 1.ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !
ప్రశ్న: ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ అంటే ఏమిటి ?
జవాబు: ఇన్ ఫిడిలిటీ ని సామాన్యం గా ‘ మోసం చేయడం ‘ ద్రోహం చేయడం’ లేదా ‘ ఎఫైర్స్ ఉండడం ‘ అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. భాగ స్వాములు , అంటే వారు భార్యా భర్తలే కావచ్చు , లేదా ప్రత్యెక సంబంధం ఉన్న స్నేహితులు కావచ్చు. స్త్రీ పురుషులు కావచ్చు. ఇన్ ఫిడిలిటీ నిర్వచనం ఏమిటంటే , ఇరువురి మధ్య ‘ సహజం గా ‘ ప్రత్యేకం గా ఉండే ఎమోషన్స్ కానీ , కామ పరమైన అనుభూతులు కానీ వారిరువురికే చెందక, ఇతర వ్యక్తుల తో పంచుకోవడం. అంటే ఇక్కడ ఇరువురి మధ్య ఉన్న ప్రగాఢమైన సంబంధం ఒకరికి తెలియ కుండా ఒకరు మూడో వ్యక్తీ , లేదా నాలుగో వ్యక్తి తో పంచుకోవడం. ఇక్కడ ‘ మోసం చేయడం, ద్రోహం చేయడం అనే పదాలు రెండో వ్యక్తి నుంచి డబ్బూ , లేక ఆస్తులు , దోచేయడం అనే అర్ధం తీసుకో రాదు.
నవీన కంప్యుటర్ యుగం , ఇంటర్నెట్ యుగం లో ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ చాలా సామాన్యం అవుతున్నాయి. ఒక ముఖ్య విషయం ఏమిటంటే , సర్వ సామాన్య మవుతున్న ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ మనం తెలుసుకున్నంత మాత్రాన ఎక్కువ అవ్వవు. తెలుసుకో నందు వల్ల తక్కువా అవ్వవు కదా !
మనం ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ వాటి తీరు తెన్నులు పరిశీలిద్దాం , వచ్చే టపా నుంచి !
good