Our Health

ప్ర.జ.లు. 21. అబార్షన్ – యువత కర్తవ్యం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 19, 2012 at 9:08 సా.

ప్ర.జ.లు. 21. అబార్షన్ – యువత కర్తవ్యం.  

Thank you parents, I had a great escape ! 

ప్రశ్న: అబార్షన్ గురించి టపాలలో, వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! మరి యువత అబార్షన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ? : 
జవాబు : ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO or world health organisation ) అంచనా ప్రకారం , ప్రపంచం మొత్తం మీదా  ప్రతి సంవత్సరం  నలభయి రెండు మిలియన్ల  అబార్షన్ లు జరుగుతున్నాయి. అంటే నాలుగు కోట్ల ఇరవై లక్షలు. అందులో  ఇరవై మిలియన్ల అబార్షన్ లు అరక్షితమైనవి అంటే అన్ సేఫ్ ( 20 million unsafe abortions per year worldwide ) అంటే అరక్షితమైన వాతావరణం లో చేయడమూ , ఇంకా  నిపుణులు కాని వారి చేత చేయ  బడ డమూ జరిగి , పర్యవసానం గా  షుమారు నలభయి ఏడు వేల మంది అమ్మాయిలూ , స్త్రీలూ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి ఏటా !  గమనించ వలసిన విషయం ఏమిటంటే , ఈ అరక్షితమైన అబార్షన్ లలో ఎక్కువ శాతం , అంటే భారత దేశం లాంటి  అభివృద్ధి చెందుతున్న దేశాలలో నే జరుగుతున్నాయి.  అందువల్లనే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే  స్త్రీలు , బాలికలూ ఎక్కువగా అంటే తొంభై ఎనిమిది శాతం, ప్రాణాలు కోల్పోతున్నారు ( అంటే  నలభయి ఏడు వేల మందిలో షుమారు నలభయి అయిదు వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయేది ఈ అభివృద్ధి చెందుతూన్న దేశాలలోనే ) అన్సేఫ్  అంటే అరక్షిత మైన అబార్షన్ లు  అంటే  నిపుణులు కాని వారిచే , కనీస ఆరోగ్య సూత్రాలు , శుభ్రతా పాటించని వాతావరణం లో చేయబడే అబార్షన్ లు. 
భారత దేశం లో పరిస్థితి:  2011 వ సంవత్సరం లో భారత దేశం మొత్తం లో పదకొండు మిలియన్ల అబార్షన్ లు జరిగాయి ఒక అంచనా ప్రకారం. కనీసం ఇరవై వేల మంది తల్లులు మరణించారు ఈ ఒక్క సంవత్సరం లోనే ! ఈ మొత్తం మరణాలూ  ఇల్లీగల్ అంటే చట్ట బద్ధం కాని అబార్షన్ ల వల్లే జరిగాయి. భారత దేశ పార్లమెంటు 1971 లో మొదటి సారిగా అబార్షన్ ల మీద ఒక చట్టం చేసి బిల్లు పాసు చేసింది. అప్పటి నుంచీ అబార్షన్ చట్టానికి కొన్ని సవరణలు కూడా జరిగాయి. కానీ  చట్ట బద్ధం గా లేని అబార్షన్ లూ , ఇంకా ఎక్కువ గా జరుగుతున్నాయి. తల్లుల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. లింగ నిర్ధారణ జరిగాక అబార్షన్ లు జరగడం కూడా విచ్చల విడి గా  మన భారత దేశం లో జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకర పరిణామం. 
ఈ అబార్షన్ ల విషయం లో యువత తెలుసుకోవలసినది, చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి.
1. ప్రతి జీవితమూ, అత్యంత విలువైనది. అంటే ఆ జీవితం , అంగుళాల పరిమాణం లో గర్భం లో  ఉన్నా ,  అడుగుల పరిమాణం లో భూమి మీద ఉన్నా ! 
2.   శారీరిక సంబంధాలు ఏర్పరుచుకుంటే , సెక్స్ విషయాలలో అప్రమత్తత వహించి ,  ఆచి తూచి అడుగులు వేయండి.
3.   సురక్షితమైన సెక్స్ ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
4. గర్భ నిరోధం, అంటే కాంట్రా సెప్షన్ గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. 
5.. అబార్షన్ కనుక అనివార్యం అవుతే , కనీసం పన్నెండు వారాల కన్నా తక్కువ గర్భం ఉన్నప్పుడే చేయించుకుంటే  ఎక్కువ సురక్షితం. ముఖ్యం గా గర్భవతులకు ! 
6.. అనుభవజ్ఞులైన , నిపుణులైన స్పెషలిస్టు డాక్టరు నే సంప్రదించడం చేయాలి , ఎందుకంటే , భారత దేశం లో, ప్రతి ఏటా జరిగే ఇరవయి వేల మరణాలూ , అర్హతలూ  అంటే క్వాలిఫికేషన్స్ , ఇంకా నిపుణత అంటే స్కిల్స్ లేని వారి చేత అబార్షన్ చేయించుకోవడం వలననే ! 
7.  యువత  అనాలోచిత, విచక్షణా రహిత చర్యలకు , గర్భం లో ఉన్న దేవుడి సమానులైన అమాయక శిశువులు , భారీగా , వారి ప్రాణాలు త్యాగం చేసి , మూల్యం చెల్లించ నవసరం లేదు కదా ! , 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 
 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: