Our Health

ప్ర.జ.లు.19. సక్షన్ తో అబార్షన్, సర్జికల్ అబార్షన్ అంటే ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 17, 2012 at 6:29 సా.

ప్ర.జ.లు.19. సక్షన్ తో అబార్షన్, సర్జికల్ అబార్షన్ అంటే ఏమిటి ? :  

ప్రశ్న:  క్రితం టపాలో గర్భం దాల్చిన తొమ్మిది వారాలలోపు గర్భం మందుల తో ఎట్లా  తీయించు కొవచ్చో తెలుసుకున్నాము కదా ! మరి మిగతా పద్ధతులు ఏమిటి ? : 
జవాబు:  క్రితం టపాలో చెప్పినట్టుగానే , గర్భ విచ్చిత్తి చేసే విధానం , స్త్రీ, ఎన్ని వారాల గర్భం తో ఉన్నది అనే విషయం మీద ఆధార పడి ఉంటుంది.
7 to 15 weeks of pregnancy :   7  నుంచి 15 వారాల మధ్య ఉన్న గర్భం తీయ వలసిన అవసరం ఏర్పడినప్పుడు   అమలు చేస్తారు. ఈ పద్ధతిని  వాక్యుం యాస్పిరేషన్ లేదా సక్షన్ టెర్మినేషన్  అని అంటారు. పైన ఉన్న చిత్రం లో వివరాలు చూడండి. శులభం గా అర్ధం చేసుకోవడం కోసం  స్త్రీ గర్భాశయం  భాగాలు నిలువు గా కోసి నట్టు ( అంటే మామిడి పండు ను నిలువుగా కోసినట్టు ) చిత్రం లో చూప బడింది. ఈ పధ్ధతి లో ముందుగా , అబార్షన్ చేయవలసిన స్త్రీకి , గర్భాశయం ద్వారం వద్ద అంటే సర్విక్స్ వద్ద మత్తు ఇస్తారు నొప్పి తెలియకుండా ఉండడానికి. కొన్ని పరిస్థితులలో  జెనరల్ అనేస్తీసియా కూడా ఇస్తారు. సర్విక్స్ మామూలు గా మూసుకుని ఉంటుంది. అందువల్ల, ఆ ప్రదేశం లో మొదట ఒక టాబ్లెట్ ఉంచడం కానీ లేదా నోటిలో వేసుకునే టాబ్లెట్ తో కానీ సర్విక్స్ ను వెడల్పు చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఒక సన్నని ప్లాస్టిక్ ట్యూబ్ సర్విక్స్ ద్వారా గర్భాశయం లో ప్రవేశ పెట్టి అక్కడ అటుక్కున్నట్టు గా ఉన్న ఎంబ్రియో ను కానీ , లేదా శిశువు ను కానీ  మెషీన్ ద్వారా పీల్చడం లేదా ‘ సక్ ‘ చేయడం జరుగుతుంది. ఆ పని అయిపోయిన తరువాత , స్త్రీని ఇంటికి పంపడం జరుగుతుంది. కానీ , స్త్రీకి , బ్లీడింగ్ కనీసం రెండు వారాల వరకూ కూడా ఉండ వచ్చు. చాలా మందిలో కేవలం రెండు మూడు రోజులకంటే బ్లీడింగ్ ఉండదు. కొందరిలో మూడు నాలుగు రోజులు ఉండవచ్చు. కొద్ది గా కండరాల నొప్పులు కూడా ఉండవచ్చు కొన్ని రోజుల వరకూ.
up to 13 weeks of pregnancy: పదమూడు  వారాల వరకూ మెడికల్ గా అబార్షన్ చేసే పధ్ధతి ఇంకోటి ఉంది. ఈ పధ్ధతి లో కూడా మేఫిప్రిస్టన్  ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టా గ్లాండిన్ మందు మాత్రం ఒక సారి మాత్రమె కాక , రెండు సార్లు ఇవ్వడం అవసరం ఉండ వచ్చు. అంతే కాక, కొన్ని సమయాలలో , ఒక చిన్న ఆపరేషన్ చేసి కూడా శిశువు భాగాలనూ , ప్లాసేంటా నూ బయటకు తీయడం జరుగుతుంది. 
up to 15 weeks of pregnancy : పదిహేను వారాల గర్భం లో సర్జికల్  డైల టేషన్  అండ్ ఎవాక్యు ఎషన్ అని ఇంకో పధ్ధతి అమలు చేస్తారు.పైన ఉన్న చిత్రం లో వివరాలు చూడండి. శులభం గా అర్ధం చేసుకోవడం కోసం  స్త్రీ గర్భాశయం  భాగాలు నిలువు గా కోసి నట్టు ( అంటే మామిడి పండు ను నిలువుగా కోసినట్టు ) చిత్రం లో చూప బడింది. ఈ పధ్ధతి లో  స్త్రీకి శరీరం మొత్తానికీ అనస్తీసియా ఇచ్చి ,  సర్విక్స్ ను కొద్దిగా  వెడల్పు చేసి , ఇంకో పరికరాన్ని గర్భాశయం లో ప్రవేశ పెట్టి , శిశువు భాగాలను , ప్లాసేంటా నూ బయటకు తీసి వేయడం జరుగుతుంది. ఈ పని అంతా పది, ఇరవై నిమిషాలలో పూర్తి అవుతుంది.  ఈ పధ్ధతి తరువాత కూడా స్త్రీకి రెండు వారాల వరకూ ఒక మాదిరి గా బ్లీడింగ్ కలగ వచ్చు వజైనా ద్వారా.
20-24 weeks of pregnancy :పైన ఉన్న చిత్రం లో వివరాలు చూడండి. శులభం గా అర్ధం చేసుకోవడం కోసం  స్త్రీ గర్భాశయం  భాగాలు నిలువు గా కోసి నట్టు ( అంటే మామిడి పండు ను నిలువుగా కోసినట్టు ) చిత్రం లో చూప బడింది.  లేట్ అబార్షన్ సాధారణం గా ఇరవై నుంచి ఇరవై నాలుగు వారాల మధ్య గర్భం ఉన్నప్పుడు, ఇంక వద్దు అనుకుంటే చేసే పధ్ధతి: ఈ పధ్ధతి లో గర్భం తో ఉన్న స్త్రీ హాస్పిటల్ లో ఉండడం మంచిది.  ఈ లేట్ అబార్షన్ కూడా రెండు పద్ధతులు గా ఉండ వచ్చు.మొదటి పధ్ధతి లో రెండు దశలు గా ఉంటుంది .   ముందుగా  మందుల సహాయం తో  గర్భం లో ఉన్న శిశువు గుండె ను ఆపి వేయడం ( అవును నిజమే ! ) , ఇంకా సర్విక్స్ ను అంటే గర్భ ద్వారాన్ని  వెడల్పు చేయడం జరుగుతుంది.ఇక రెండవ దశలో , గర్భాశయం లో ఉన్న ( మృత ) శిశువు ను కూడా ఉన్న ప్లాసేంటా , ఇంకా మావి పొరలను బయటకు తీసి వేయడం జరుగుతుంది. ఈ మొదటి పధ్ధతి లో జెనరల్ అనస్తీసియా అవసరం ఉంటుంది. 
రెండవ పధ్ధతి లో ,  కేవలం  మందులు మాత్రమె  రెండు దశలలోనూ  ఇచ్చి అబార్షన్ పూర్తి చేస్తారు. కేవలం కొన్ని పరిస్థితులలో మాత్రమె , పరికరాల సహాయం తో గర్భాశయం లో ఉన్న శిశువును , మిగతా గర్భ భాగాలనూ బయటకు తీసి వేయడం జరుగుతుంది. ఏ పధ్ధతి లో నైనా స్పెషలిస్టు డాక్టరు చేయవలసిన ముఖ్యమైన పని , గర్భాశయాన్ని ఖాళీ గా , అంటే గర్భాశయం లోపల శిశువు కానీ , శిశువుకు సంబంధించిన భాగాలు కానీ , ఏమాత్రం లేకుండా బయటకు తీసివేయడం. ఇట్లా చేయక పొతే , కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 
ప్రశ్న : మరి ఈ అబార్షన్ పద్ధతులు చూస్తుంటే , అబార్షన్ చాలా శులువు అని అనిపిస్తుంది. ఇట్లా అబార్షన్ చేయించుకుంటే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవా ? : 
జవాబు : వచ్చే టపాలో అబార్షన్ చేయించు కోవడం వల్ల కలిగే కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాము ! 
  1. బాగుంది. దీని తరవాత ఎంత కాలానికి మరల గర్భం ధరించడం మంచిది? వెంటనే మళ్ళీ గర్భం వచ్చే సావకాశాలున్నాయా?మందులు వాడాలా, గర్భం ధరించడానికి?

  2. మీరు అబార్షన్ తరువాత గర్భం దాల్చే సంగతి అడుగుతున్నారా ? లేక మిస్ క్యారేజ్ తరువాత గర్భం దాల్చే సంగతి అడుగుతున్నారా ?
    అబార్షన్ తరువాత గర్భం దాల్చడానికి , కాల పరిమితి అంటూ ఏమీ ఉండదు. కానీ వ్యక్తిగత పరిస్థితులు , అంటే ఆ స్త్రీ యొక్క శారీరిక , ఇంకా మానసిక ఆరోగ్యాన్ని పరిగణ లోకి తీసుకోవాలి, ఈ కాల పరిమితి నిర్ణయించడానికి. చివరకు ఆ నిర్ణయం, గర్భం దాల్చే స్త్రీ మీద ఆధార పడి ఉంటుంది కదా !
    ఇక మిస్ క్యారేజ్ తరువాత గర్భం దాల్చే సంగతి అయితే , ప్ర.జ.లు. టపా 17 లో సవివరం గా తెలియచేయడం జరిగింది. అది చదివాక కూడా సందేహాలుంటే తెలియ చేయండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: