ప్ర.జ.లు. 15. అబార్షన్ గురించి యువత ఏమి తెలుసుకోవాలి ? ఎందుకు తెలుసుకోవాలి ?
ప్రశ్న : అబార్షన్ అంటే ఏమిటి ? మరి అబార్షన్ కూ మిస్ క్యారేజ్ కూ తేడా ఏమైనా ఉందా ?
జవాబు: ఇది యువతీ యువకులు తెలుసుకో వలసిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న. అబార్షన్ అంటే గర్భాశయం నుంచి స్పెషలిస్టు వైద్యులు , ఏర్పడిన పిండాన్ని , మిగతా పిండ భాగాలనూ, లేదా శిశువునూ , బయటకు తీసి వేయడం. దీనినే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లేదా టెర్మినేషన్ అని క్లుప్తం గా అంటారు. మరి డెలివరీకీ , అబార్షన్ కూ ఉన్న తేడా ఏమిటంటే , డెలివరీ లో పూర్తిగా జీవించ గలిగే శక్తి ఉన్న శిశువును, గర్భాశయం నుంచి బయటకు తీయడం, డెలివరీ లో శిశువు సాధారణం గా జన్మించి, సహజం గా, ఆరోగ్యం గా ఉంటుంది.కానీ అబార్షన్ చేసినప్పుడు , శిశువు కానీ , పిండం కానీ స్వతంత్రం గా మన గలిగే పరిస్థితి లో ఉండవు.
ప్రశ్న: అయితే అబార్షన్ కూ , మిస్ క్యారేజ్ కూ తేడా ఉందా ? ఎందుకు ఈ రెండు విధాలు గా అంటుంటారు? :
జవాబు: మిస్ క్యారేజ్ అంటే సహజమైన కారణాలతో , పిండం కానీ , శిశువు కానీ , వైద్య ప్రమేయం ఏమీ లేకుండా గర్భాశయం నుంచి బయటకు వచ్చే పరిస్థితి. కానీ ముందుగా చెప్పుకున్నట్టు , అబార్షన్ సహజం గా కాక , కృత్రిమం గా స్పెషలిస్టు వైద్యులు చేసే పని. ( ఏ పరిస్థితులలో చేస్తారు అనే విషయం ముందు ముందు వివరం గా తెలుసుకుందాము ). వైద్య పరం గా, అభివృద్ధి చెందిన దేశాలలో ( అంటే అన్ని జాగ్రత్తలూ తీసుకుని ) చేసే అబార్షన్ చాలా సురక్షితమైనది. ఉదాహరణకు ఇంగ్లండు లో అబార్షన్ ఏ ఏ పరిస్థితులలో చేస్తారో చూద్దాము. ఇంగ్లండు లో అబార్షన్ లు ఎప్పుడు చేయాలి , ఏ ఏ పరిస్థితులలో చేయాలి అనే నిబంధనలు అమలు పరచడానికి ఒక శక్తి వంతమైన చట్టం ఉంది అంటే లా. ఈ లా ప్రకారం. 1. స్త్రీ కి వ్యక్తి గతం గా బలవంతమైన కారణాల వల్ల 2. గర్భం లో ఉన్న శిశువుకు ఏవైనా సీరియస్ వైద్య పరమైన వ్యాధులు కానీ జన్యు పరమైన, తీవ్రమైన లోపాలు కానీ ఉన్నప్పుడు.3.శిశువు జననం, తల్లి ఆరోగ్యాన్ని తీవ్రం గా ప్రభావితం చేసే సమయం లో కానీ. ఈ మూడు ప్రత్యెక పరిస్థితులలో , అబార్షన్ చేయడం సమ్మతం అవుతుంది. ఈ మూడు ప్రత్యెక పరిస్థితులలో , ఒకటి కానీ, రెండు కానీ లేదా అన్నీ కానీ పరిస్థితులను నిర్ణయించ డానికి కనీసం ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు అబార్షన్ చేయించు కోవలసిన స్త్రీని పరీక్ష చేయ వలసి ఉంటుంది. అంతే కాక, అబార్షన్ ఎప్పుడు చేయ వలసి వచ్చినా , అన్ని వసతులూ ఉన్న స్పెషలిస్టు హాస్పిటల్ లోనూ , లేదా లైసెన్స్ పొందిన ( అబార్షన్ చేయడానికి అన్ని వసతులూ ఉన్న ) క్లినిక్ లోనే చేయ వలసి ఉంటుంది. దాదాపు ప్రతి దేశం లోనూ ఏదో ఒక రూపం లో చట్టాలు ఉన్నాయి , అబార్షన్ సురక్షితం గా జరపడానికి. భారత దేశంలో ఈ చట్టాన్ని ఎట్లా అమలు పరుస్తున్నారో మీకు తెలిస్తే తెలియ చేయండి.
ప్రపంచం మొత్తం లో అబార్షన్ సంఖ్యలు ఏమిటి ? : ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరమూ , కనీసం నలభై నాలుగు మిలియన్ ల అబార్షన్ లు జరుగుతున్నాయి. అందులో కనీసం సగం అబార్షన్ లు సురక్షితం గా జరగట్లేదు. ఇట్లా సురక్షితం గా జరగని అబార్షన్ ల వల్ల ప్రతి ఏటా కనీసం డెబ్బయి వేల మంది స్త్రీలు ప్రాణాలు కోల్పో తున్నారు. అంతే కాక కనీసం అయిదు మిలియన్ ల మంది స్త్రీలు, అబార్షన్ వల్ల కలిగే కాంప్లికేషన్ ల తో బాధ పడుతున్నారు ప్రతి ఏటా !
మిస్ క్యారేజ్ / అబార్షన్ ల గురించి / మిగతా ప్ర.జ.లు. వచ్చే టపాలో !
What is mis carriage? What are the probable reasons for a mis carriage.
Please follow my next post.