ప్ర.జ.లు.14.ప్రెగ్నెన్సీ లో ప్రయాణం.
ప్రశ్న: ప్రెగ్నెన్సీ సమయం లో ప్రయాణం చేయ వచ్చా? అందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? :
జవాబు: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. గర్భవతులు ప్రయాణం చేయకూడదు అనే నియమం ఏదీ లేదు. కానీ అందరు గర్భ వతులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచు కోవాలి.
తాము వెళ్ళే చోట మంచి వైద్య వసతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. తమ వైద్య వివరాలు తెలిపే ఒక కార్డును కానీ, ఒక ఫైలు ను కానీ ప్రయాణ సమయం లో వారి దగ్గర ఉంచుకోవాలి తప్పని సరిగా. పాశ్చాత్య దేశాలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా , మంచి వైద్య వసతులు ఉంటాయి కనుక , అక్కడ నివశించే వారు విచార పడ నవసరం ఉండదు. కాక పొతే , మెడికల్ ఇన్స్యురెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వైద్య చికిత్స కు అయ్యే ఖర్చులు, దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి కనుక. తగిన వైద్య వసతులు, మీ వైద్య వివరాలు తెలుసుకున్న డాక్టరు , భారత దేశం లో ఎక్కడకు వెళితే , అక్కడ ఉండరు కదా ! అందువల్ల ఈ విషయం లో భారత దేశం లో ఉండే స్త్రీలు , ప్రత్యెక శ్రద్ధ వహించాలి.ఇక వివరాలు చూద్దాము.
ప్రశ్న : ఎప్పుడు ప్రయాణం చేయ వచ్చు? :
జవాబు : కనీసం మూడు నెలల గర్భం దాటిన తరువాత , దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ఉత్తమం. ఎందుకంటే , నెల తప్పిన మొదటి మూడు మాసాలలో , వికారం, కడుపు లో తిప్పడం, తీవ్రమైన అలసట , వాంతులు , ఇలాంటి లక్షణాలు తరచూ వచ్చేవే కదా ! సహజం గా మొదటి మొదటి మూడు మాసాలలో గర్భం పోవటానికి మిగతా నెలలలో కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది, గర్భవతులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినా , ఉన్న చోటే ఉన్నా ! అందువల్ల కొందరు స్పెషలిస్టులు , కొన్ని ప్రత్యెక కాంప్లికేషన్స్ ఉంటే తప్పితే , ప్రయాణం చేయ కూడదనే నిబంధన ఏమీ లేదు అని అభిప్రాయ పడతారు.
విమాన ప్రయాణం : సాధారణం గా ప్రతి ఎయిర్ లైన్స్ వాళ్ళూ , 28 వారాల గర్భం దాటిన తరువాత , ప్రయాణం చేయ దలుచుకుంటే , స్పెషలిస్టు అబ్స్తేట్రి షియన్ నుంచి ఒక ధ్రువ పత్రాన్ని అడుగుతారు, 34 వారాల గర్భవతులను సాధారణం గా ఎయిర్ లైన్స్ లో ప్రయాణాలకు అనుమతించరు. ఎందువంటే ఈ 34 వారాలు దాటిన తరువాత , కవలలు గర్భం లో ఉన్నప్పుడు, 37 వారాలు దాటిన తరువాత ఒక శిశువు గర్భం లో ఉంటేనూ ప్రసవ వేదన మొదలవడానికి అవకాశాలు హెచ్చు. విమానం లో ఎక్కువ సమయం ప్రయాణం చేసే గర్భవతులలో , వారి కాళ్ళ లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. దీనిని డీ వీ టీ ( డీప్ వీన్ త్రాంబోసిస్ అంటారు ) .
గర్భవతులు, ప్రయాణానికి ముందు అవసరమయే వాక్సినేషన్ అంటే టీకాలు వేయించు కోవచ్చా?:
జవాబు: చాలా పాశ్చాత్య దేశాలలో , ప్రజలు ఇతర దేశాలు ప్రయాణం చేయ దలుచుకుంటే , ఆ యా దేశాలలో ఉండే అంటు వ్యాధుల నివారణ లో భాగం గా వాక్సినేషన్ అంటే టీకాలు వేస్తారు. ఈ టీకాలు గర్భం లో ఉన్న శిశువు కు హాని కలిగించే ప్రమాదం ఉంది. అందు వల్ల , టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అయిన దేశాలు మీరు వెళ్ళడం మానుకోవడం ఉత్తమం. గర్భం లో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం. మలేరియా నివారణకు వేసుకునే మందులు కూడా గర్భం లో ఉన్న శిశువుకు హాని కలిగించ వచ్చ్చు. అందువల్ల మలేరియా మందులు తీసుకునే వారు కూడా స్పెషలిస్టు ను సంప్రదించాలి.
ప్రశ్న : గర్భవతులు కారు ప్రయాణం చేయ వచ్చా ? :
జవాబు: పాశ్చాత్య దేశాలలో పరవాలేదు. భారత దేశం లో కూడదు. ఎందుకంటే భారత దేశం లో కారు ప్రయాణం చాలా ప్రయాస తో కూడినది , గర్భవతులు కాని వారికే ! ఇక గర్భం లో ఉన్న శిశువు కు ఆ ప్రయాసలు అప్పుడే ఎందుకు ? ఒక వేళ కారు ప్రయాణం తప్పని సరి అయితే , తక్కువ దూరాలు మాత్రమె ప్రయాణం చేయడం , తరచూ అంటే ప్రతి రెండు గంటలకూ, ప్రయాణం ఆపి , విరామం తీసుకోవడం, తగిన శుభ్రమైన నీరు , ఆహారం కారులో ఉంచుకోవడం, లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారం, ద్రవాలు :
గర్భవతులు వారి ఇల్లు విడిచి ఎక్కడకు వెళ్ళినా , వారు తీసుకునే ద్రవాహారం , ఇంకా ఘనాహారం అంటే నీరు , పాలు , మజ్జిగ , పళ్ళ రసాలు, టీ , కాఫీ , లాంటి ద్రవాలు , ఇంకా తినే వంటలు – ఈ విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు ,గర్భవతులు గా ఉన్నప్పుడు ఏ ఇంఫెక్షనూ రాకుండా జాగ్రత్త వహించాలి. ఇన్ఫెక్షన్లు వారిని బలహీన పరచడమే కాకుండా, శిశువు పెరుగుదలను కూడా నిదానం చేస్తాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.
Excellent
ఎందువంటే ఈ 34 నెలలు దాటిన తరువాత , కవలలు గర్భం లో ఉన్నప్పుడు, 37 నెలలు దాటిన తరువాత ఒక శిశువు గర్భం లో ఉంటేనూ
——————–
నెలలను వారాలుగా మార్చాలని అనుకుంటాను.
నా పొరపాటే ! గమనించి నా దృష్టి కి తెచ్చినందుకు కృతఙ్ఞతలు.
మా ఆవిడ కు 31augst కు 35వారల 4 రోజులు గరబం పూర్తి అయినచో మేము Train లో 12Hrs రాత్రి సమయంలో ప్రయాణం చేయాలనుకుంటునాము. ఏదైనా సలహా ఇవ్వగలరు
హరిబాబు గారికి,
సామాన్యం గా దూర ప్రయాణాలు 35 వారాల గర్భం ఉన్నప్పుడు చేయడం శ్రేయస్కరం కాదు !
కానీ ఆ ప్రయాణం అత్యవసరం అవుతే , మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ను సంప్రదించి , తగిన సలహా తీసుకో గలరు !
ఇక ప్రయాణం చేయడమా లేదా అన్న విషయం , మీ భార్య కు ఇంతకు పూర్వం ఏమైనా
ఎబార్షన్ లు జరిగాయా? , ప్రస్తుతం గర్భం సరిగా నే ఉందా? ఆమె ఆరోగ్యం సరిగా ఉందా ? అన్న విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ! అందుకే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం !
అభినందనలు.