ప్ర.జ.లు.1.
1. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? :
ముఖ్యం గా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు రెండు రకాల రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్నాయి.
మొదటి రకానికి చెందిన రిస్కు ఫ్యాక్టర్ లను దాట వేసి , రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను నివారించు కోవచ్చు.రెండవ రకానికి చెందిన రిస్కు ఫ్యాక్టర్ లను ఆచరించడం ద్వారా నివారణ అవకాశాలను ఎక్కువ చేసుకోవచ్చు.
మొదటి రకం రిస్కు ఫాక్టర్ లు ఏమిటో తెలుసుకుందాము ( ఇవి సాధ్య మైనంత వరకు ఎవాయిడ్ చేయ గలిగిన రిస్కు ఫ్యాక్టర్ లు ) :
1.ఈస్త్రోజేన్ ( ఎన్దోజినస్ ఈస్త్రోజేన్ ) : స్త్రీలలో ఈస్త్రోజేన్ అనే హార్మోను ఎంత ఎక్కువ కాలం వారిలో ఉంటే , అంత గా రిస్కు పెరుగుతుంది. దీనినే మనం ఇంకో విధం గా చెప్పుకోవచ్చు. అతి తక్కువ వయసు అంటే పదకొండు సంవత్సరాలకూ , అంతకు ముందూ , రజస్వల అయినవారిలో , బహిష్టు లేదా ఋతు క్రమం ఆలస్యం గా ఆగి పోయిన వారిలోనూ, ఇంకా , ముప్పయి అయిదు సంవత్సరాల వయసు దాటాక సంతానం కలిగిన వారిలోనూ , లేదా అసలు సంతానమే లేని స్త్రీలలోనూ , ఈ ఈస్త్రోజేన్ హార్మోను ప్రభావం, వారి స్థనాల మీద హాని కరంగా ఉంటుంది.
2. గర్భ నిరోధానికి వేసుకునే హార్మోను మందులు: ఈ మందులలో ప్రధానం గా ఈస్త్రోజేన్ హార్మోనూ , ప్రోజేస్తోజేన్ హార్మోనూ కలిపి ఉన్న మందులు వాడు తున్న వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం గా ఉన్నట్టు అనేక పరిశోధనల వల్ల వెల్లడి అయింది.
3.రేడియేషన్ కు అతిగా ప్రభావితం కాకుండా ఉండడం: చాతీ ఎక్స్ రే తీయించు కోవడం కూడా , స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను అధికం చేస్తుంది. ప్రత్యేకించి , స్త్రీలకు ఇరవై సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసులో కనక చాతీ ఎక్స్ రే తీయించుకుంటే !
4.ఒబీసిటీ లేదా ఊబ కాయం: అతి బరువు ఉండే స్త్రీలలో , ప్రత్యేకించి బహిష్టు ఆగి పోయి అంటే ఋతు క్రమం పూర్తిగా ఆగి పోయిన, ఇంకా హార్మోనులు వాడని స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం గా ఉన్నట్టు గుర్తించారు.
5. ఆల్కహాలు లేదా మద్యం సేవించడం: ఆల్కహాలు తాగే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం , వారు తాగుతున్న ఆల్కహాలు పరిమాణం బట్టీ , వారు ఎంత కాలం నుంచి తీసుకుంటున్నారు అనే విషయం బట్టీ ఆధార పడి ఉంటుంది. అంటే, ఎక్కువ కాలం , ఎక్కువ మోతాదు లో కనుక స్త్రీలు మద్యం సేవిస్తూ ఉంటే , వారిలో రొమ్ము క్యాన్సర్ అధికం గా వస్తుందని విశదమైంది.
6.అనువంశికమైన రిస్కు: BRCA1 and BRCA2 అనే జీన్సు అనువంశికం గా సంక్రమించి నట్టయితే , ఆ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం హెచ్చుతుంది. అంతే కాక ఈ జీన్సు లేదా జన్యువులు కనుక సంక్రమించితే , వారిలో రొమ్ము క్యాన్సర్ వారి వయసు తక్కువ గా ఉన్నప్పుడే వస్తుంది.
మిగతా జాగ్రత్తలు వచ్చే టపాలో !
( ప్ర.జ.లు .( ప్ర = ప్రశ్నలూ , జ= జవాబులూ ) అనే కొత్త శీర్షిక లో సాధారణమైన వైద్య సమస్యలకూ , సందేహాలకూ , సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ‘బాగు ‘ ఉద్దేశం, చదువరులకు వైద్య విజ్ఞాన పరంగా ఎక్కువ అవగాహన కలిగించడానికే. వారికి చికిత్స చేయడానికి కాదు. చదువరులు వారి సమస్యలనూ , సందేహాలనూ పంప వచ్చు. వీలు ను బట్టి సమాధానం ఇవ్వడం జరుగుతుంది.
బాగు.నెట్ లో 200 వందల టపాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బాగు ను ఆదరిస్తున్న( ఇంత వరకూ 17,506 హిట్స్ ) సందర్శకులకు.కృతఙ్ఞతలు.)
Good idea. proceed. Best of luck and your service will be commended
First question.
I am aged 72 with normal health. BP 140/100 and sugar level 100/140. Suggest best exercise for me to burn calories.
Your BP is slightly higher and so is your blood sugar. It is better to review your diet habits to see if the salt and sugar in the diet are contributing to your symptoms ( of elevated BP and sugar levels )
Any gentle forms of exercise is fine for you. eg. gentle walks, more frequently than before. The idea is to NOT TO BURN CALORIES RAPIDLY.That is to avoid any rigorous exercises. Also, please get one test called HBA1C done every six months.( This test will give us an idea about how your blood sugar is over a period of three months instead of one reading which reflects only that particular time. )
Let me know if you need more details.Best wishes.
Thank you for your reply