క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు.
( reproduced from Young et al. courtesy: Macmillan publishers Ltd.)
క్రితం టపాలో , హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియం, జీర్ణాశయం లో అల్సర్ లు ఏర్పడడానికీ, జీర్ణాశయం లో క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఏర్పడడం లో ప్రధాన పాత్ర ఎట్లా వహిస్తుందో తెలుసుకున్నాము కదా ! కేవలం హెలికో బాక్టర్ పైలోరి నే కాకుండా , మిగతా బ్యాక్టీరియాలు కొన్ని కూడా మానవులలో క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.
సాల్మొనెల్లా టైఫి ( పిత్తాశయ క్యాన్సర్ కలిగింస్తుంది ) : ( పైన ఉన్న చిత్రం చూడండి . పైన ఉన్న చిత్రం లో మొదట సాల్మొనెల్లా టైఫి మ్యూరియం అనే బ్యాక్తీరియం ప్రేగు గోడల ( కణాల ) లోకి చొచ్చుకు పోవడం, తరువాత బీ కణాలు, టీ కణాల ద్వారా లింఫ్ గ్రంధి లోకి వెళ్ళడం చూప బడింది. అదే చిత్రం లో కుడి వైపున సాల్మొనెల్లా టైఫి అనే ( ఇది కూడా టైఫాయిడ్ కారక ) బ్యాక్టీరియం కూడా ప్రేగు కణాల గోడల లోకి చొచ్చుకు వెళుతుంది.తరువాత బీ కణాల లోకీ , టీ కణాల లోకీ వెళుతుంది. అక్కడ నుంచి ఎముకల మూలుగ అంటే బోన్ మారో లోకీ, ప్లీహం లోకీ అంటే స్ప్లీన్ లోకీ వెళ్లి పైత్యాశయం లేదా గాల్ బ్లాడర్ ను చేరుకుంటుంది. అక్కడ ఈ బ్యాక్టీరియాలు వృద్ధి అయి , నిలువ ఉండి, గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయ క్యాన్సర్ కు కారణమవుతుంది. ) ఈ బ్యాక్టీరియం సాధారణం గా మానవులలో టైఫాయిడ్ కలిగిస్తుంది. టైఫాయిడ్ జ్వరం కొందరిలో సరిగా మానక , ( దీనికి కారణం యాంటీ బయాటిక్ లు క్రమం గా తీసుకోక పోవడం వల్ల కానీ , లేదా కొన్ని పరిస్థితులలో చికిత్స సంపూర్ణం గా తీసుకున్నా , కొందరు క్రానిక్ క్యారియర్ స్థితి కి చేరుకుంటారు. అంటే వారు కొన్ని సంవత్సరాల తరబడి , వారి మలం లో టైఫాయిడ్ బ్యాక్టీరియాలను విసర్జించుతూ ఉంటారు. అంటే వారు టైఫాయిడ్ జ్వర లక్షణాలు ఏవీ కనబరచక పోయినా , టైఫాయిడ్ బ్యాక్టీరియాలు మాత్రం వారిలో కొంత నిర్ణీత సంఖ్య లో ఉత్పత్తి అవుతూ ఉండి, వారి మల మూత్రాదుల ద్వారా బయటకు వచ్చి , ఆరోగ్య వంతులైన మిగతా వారిని , ముట్టడి చేసి , వారిలో టైఫాయిడ్ లక్షణాలనూ , టైఫాయిడ్ నూ కలిగించ గలవు. అంతే కాకుండా , ఈ సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియాలు, గాల్ బ్లాడర్ లో అంటే, మన దేహం లో పైత్య రసాలు నిలువ చేసే ఒక సంచి లేదా తిత్తి , ఈ భాగం లో దాక్కుంటాయి. ఇట్లా సంవత్సరాల తరబడి పైత్యాశయం లేదా పిత్తాశయం లో దాక్కున్న సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాలు, ఆ పిత్తాశయం లోనే క్యాన్సర్ కలిగిస్తాయని పరిశోధనల వల్ల తెలిసింది.
స్త్రెప్తో కాకస్ బోవి (పెద్ద ప్రేగు క్యాన్సర్ కలిగిస్తుంది ) : ఈ బ్యాక్టీరియం స్త్రెప్తో కొకై అనే రకానికి చెందిన బ్యాక్టీరియం. సామాన్యం గా మానవుల పెద్ద ప్రేగు లో ఉంటుంది. కానీ ఈ బ్యాక్టీరియం కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చిన వారిలో నలభై నుంచి అరవై శాతం మందిలో క్యాన్సర్ కారకం అని నిర్ణయించారు, వివిధ పరిశీలనలలో. ఈ స్త్రెప్తో కాకస్ బోవి అనే బ్యాక్టీరియం మహా చెడ్డది ! దీని ఇన్ఫెక్షన్ సామాన్యం గా గుండె లోపలి గోడల లోనూ , ఇంకా గుండె కవాటాలనూ పాడు చేస్తుంది.ఇట్లా గుండె ఇన్ఫెక్షన్ సోకిన చాలా సంవత్సరాల తరువాత , పెద్ద ప్రేగులో క్యాన్సర్ కలిగించడం కూడా గమనించారు.
క్లామీడియా న్యుమోనియే (ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ కు కారణమవుతుంది ) : ఇది ఇంకో గ్రామ్ నెగెటివ్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియం. అమెరికాలో ఈ బ్యాక్టీరియం కనీసం యాభై శాతం మందిలో, వారి జీవిత కాలం లో ఎప్పుడో ఒక సారి న్యుమోనియా ఇన్ఫెక్షన్ అంటే ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సామాన్యం గా ఫ్లూ లాగా ఉండి కొన్ని రోజులలో తగ్గి పోతుంది. కానీ కొందరిలో క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే దీర్ఘ కాలికం గా ఈ బ్యాక్టీరియాలు వారి ఊపిరి తిత్తులలో ఉండి , ఒక రకమైన ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని క్లామీడియాల్ హీట్ షాక్ ప్రోటీన్ 60 అంటారు. ఈ ప్రోటీన్ అత్యంత రోగనిరోధక శక్తి ని మానవులలో కలిగిస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలికం గా ఉండి, దాని పరిణామాలు దీర్ఘ కాలిక వ్యాధి రూపం లో కనిపిస్తూ ఉంటుంది. ఒక సారి ఈ బ్యాక్టీరియా కలిగించిన దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్ వల్ల లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు హెచ్చుతాయి.
ఈ బ్యాక్టీరియాలు ఏ విధం గా క్యాన్సర్ కలిగిస్తాయి? :
బ్యాక్టీరియాలు అన్నీ కొన్ని విష పదార్ధాలను విడుదల చేస్తాయి. వీటిని బ్యాక్టీరియల్ టాక్సిన్ లు అంటారు. ఈ టాక్సిన్ లు మన దేహం లోని జీవ కణాలలో ఉన్న డీ ఎన్ ఏ అంటే జన్యు పదార్ధాన్ని ముట్టడి చేస్తాయి. అంతే కాక ఆ సహజమైన ఆరోగ్యమైన జన్యు పదార్ధాన్ని శాశ్వతం గా , అసహజం గా మార్చి వేస్తాయి. దానితో ఆ అసహజమైన జన్యు పదార్ధం ఉన్న జీవ కణాలు ఒక నియంత్రణ ఏమీ లేకుండా కణ విభజన జరిపి , లక్షలూ , కోట్ల సంఖ్య లో అసహజమైన క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తాయి, ఆ అసహజ , క్యాన్సర్ కణాల సముదాయమే కంతి లేక ట్యూమర్ అని అంటాము.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
good going