అబ్సెసివ్ వ్యక్తిత్వం.OCPD . 4.
క్రితం టపాలో ఈ వ్యక్తిత్వం ఉన్న వారి లక్షణాలు కొన్ని తెలుసుకున్నాము కదా ! వీరు చేసే ప్రతి పనీ అత్యంత జాగరూకత తో చేయడమే కాక , ప్రతి విషయానికీ విపరీతం గా అనుమాన పడుతూ , అనేక రకాలైన సందేహాలు తెచ్చు కుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికీ , అత్యంత శ్రద్ధ అంటే మెటిక్యులాస్ గా ఒక కాగితం మీద నోట్ చేసుకోవడమో. లేదా ఒక పుస్తకం లో వివరం గా రాసుకోవడమో చేస్తుంటారు. వీరు చేసే పనుల గురించీ , ఇతరులు చేసే పనుల గురించీ వీరికి రెండే రెండు అభిప్రాయాలు ఉంటాయి. అవి రైట్ అండ్ రాంగ్. అంటే సరైనది , లేదా తప్పు అయినది. ఇక మధ్యస్థం ఉండదు వీరి నిఘంటువులో !
అబ్సెసివ్ వ్యక్తిత్వ లక్షణాలకు కారణాలు :
1.జన్యువుల లోపం లేదా జీన్స్ లో లోపాలు : కొన్ని పరిశీలనల వల్ల ఒక ప్రత్యెక రకమైన జీన్స్ అంటే DRD3 అనే రకమైన జీన్ ఉన్న వారిలో ఈ అబ్సెసివ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
2.పరిసరాల ప్రభావం : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు , వారి చిన్న తనం నుంచీ , తల్లిదండ్రుల ద్వారా కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ ఈ వ్యక్తిత్వ లక్షణాలను తమకు తెలియకుండానో , తెలిసో , నేర్చుకుంటారు. అత్యంత క్రమ శిక్షణ తో , చాలా కఠినం గా వారిని పెంచితే , ఆ లక్షణాలు వారికి అలవడుతాయి. అంతే కాక , బాల్యం లో భౌతికం గా కానీ , ఎమోషనల్ గా కానీ, కామ పరం గా కానీ ఏ విధమైన అబ్యూజ్ కు లోనైనా , క్రమేణా ఆ విషాద కర అనుభవాలు , అబ్సెసివ్ వ్యకిత్వం గా పరిణితి చెందవచ్చు. అందువల్లనే , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు , వారి ఆందోళనా , ఆత్రుతా , తమ అబ్సెస్సివ్ వ్యక్తిత్వ లక్షణాలతో తగ్గించు కున్నట్టు అనిపించినా , వారు చాలా టెన్షన్ కు కూడా లోనవు తుంటారు.
OCPD కీ OCD కీ తేడా ఏమిటి ?:
అబ్సెసివ్ వ్యక్తిత్వం ( అంటే OCPD or Obsessive , compulsive, Personality disorder ) ఒక వ్యక్తిత్వ రీతి. అంటే వ్యక్తిత్వ లక్షణం. కానీ OCD అంటే Obsessive Compulsive Disorder ఒక మానసిక వ్యాధి. అంటే OCD ఉన్న వారు , వారు చేసే పనులు చాలా వ్యధా , బాధా కలిగిస్తున్నా , వారు ఆ పనులు చేయక పొతే వారి మనసు శాంతించదు. ఉదాహరణకు , OCD ఉన్న వారు వారి చేతులను కనీసం ఒక యాభై సార్లైనా కడుగుతూ ఉంటారు రోజులో ! వారి చేతులు ఎర్రగా సబ్భు తో కడిగీ కడిగీ కండి పోయినా కూడా , వారు వారి చేతులకు , ఇంకా ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమాన పడుతూ ఉంటారు. కానీ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు అంత విపరీతం గా ప్రవర్తించరు.
మరి ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారికి చికిత్స ఏమైనా ఉందా ?:
మానసికం గా పరివర్తన తీసుకు వచ్చే , సైకాలజికల్ చికిత్స లు పలు విధాలు గా వీరికి చేయవచ్చు.
అంటే కాగ్నిటివ్ బిహావియర్ థెరపీ , బిహావియర్ థెరపీ , ఇంకా కాగ్నిటివ్ అనలిటికల్ థెరపీ ( దీనినే మానసిక విశ్లేషణ చికిత్స అంటారు ) ఈ పద్ధతులలో ఏ ఒక్కటైనా ఉపయోగించి , వారి మనసులలో క్రమం గా మార్పు తేవచ్చు. ఈ మార్పు కొన్ని సమయాలలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్టి పరిస్థితులలో , మందుల సహాయం తో కూడా , ఈ వ్యక్తిత్వ లక్షణాలను కొంత వర కూ నియంత్రించ వచ్చు.
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
good going.
Thanks Sharma gaaru!