( అప సవ్య ) వ్యక్తిత్వ రీతులు. ( personality disorders ):
మనం, జననం నుంచీ ఒక వ్యక్తి గా పరిణితి చెందే వరకూ , మనకైన కొన్ని ప్రత్యెక లక్షణాలు మనలో , అభి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ లక్షణాలు భౌతికం గా మనకు కనిపించేవి అవవచ్చు. లేదా మానసికం గా మన ఎదుగుదల ఆవ వచ్చు.ఈ మానసిక పరిణితి నే ‘ మన వ్యక్తిత్వం ‘ లేదా పర్సనాలిటీ అంటారు. ఈ వ్యక్తిత్వం , భౌతిక లక్షణాల లాగా, అంటే ఎత్తు , బరువు , రంగు లాంటి లక్షణాలతో కొలవ లేము కదా ! అందువల్ల ఈ వ్యక్తిత్వం, మన మెదడులో మన ఆలోచనల కు అనుగుణం గా , మన ప్రవర్తన లో కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన వ్యక్తిత్వం మనకంటూ ఒకటి ఏర్పడే వరకూ , అంటే, మనం బాలల నుంచి వ్యక్తులు గా పరిణితి చెందే వరకూ, ఈ వ్యక్తిత్వ లక్షణాలు మనకు పూర్తిగా తెలిసి కానీ , లేదా మనకు తెలియకుండా కానీ , మనలో ఒకటొకటి అభివృద్ధి చెందుతూ ఉండి , మనలను సంపూర్ణం గా వ్యక్తిత్వం కలిగిన అంటే ఒక పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు గా తయారు చేస్తాయి. మనం సాధారణం గా అనుకునే పర్సనాలిటీ కీ , వ్యక్తిత్వానికీ మనం తేడా గమనించాలి. మనం మన తెలుగు భాషలో ఆంగ్ల పదమైన పర్సనాలిటీ ని చాలా తరచూ ఉపయోగిస్తూ ఉంటాము. కానీ ఈ పదాన్ని కేవలం ఒక స్త్రీ భౌతిక లక్షణాలు , లేదా పురుషుల భౌతిక లక్షణాలూ వివరించడానికే వాడుతూ ఉంటాము.( ఉదాహరణకు మనం సర్వ సాధారణం గా సినిమా యాక్టర్ల ‘ పర్సనాలిటీ ‘ని వివరించే సమయం లో ) కానీ యదార్ధానికి పర్సనాలిటీ , లేదా వ్యక్తిత్వం ప్రధానం గా మన మనసును లేదా మెదడు ను, ఆలోచనలనూ , క్రియా రూపం లో ఉన్న మన ఆలోచనలను అంటే మన ప్రవర్తనను ప్రతి బింబిస్తూంది.
మరి పర్సనాలిటీ డిసార్డర్ అంటే ఏమిటి ? : అప సవ్య వ్యక్తిత్వం అన వచ్చు నేమో దీనిని. అంటే మనకు పైన చెప్పిన విధం గా కాల క్రమేణా మనకంటూ ఏర్పడిన వ్యక్తిత్వం , ఎప్పుడూ వంద శాతం మంచిగా సవ్యం గా ఏర్పడాలనే నిబంధన ఏదీ లేదు కదా ! అంటే మనం, మనకై , ప్రత్యేకం గా ఏర్పరచుకునే వ్యక్తిత్వం , అనేక కారణాల వల్ల, సవ్యమైనది కాక పోవచ్చు. వైద్య శాస్త్ర రీత్యా డిసార్డర్ అని మనం ఎప్పుడు అంటామంటే , మనకు ఉన్న లక్షణాలూ , లేదా లక్షణాల సముదాయం, మన రోజు వారీ కార్యక్రమాలకు, అవరోధం అయి, తద్వారా మన వ్యక్తిగత వికాసాన్నీ , అభివ్రుద్ధినీ కుంటు పరుస్తూ ఉన్నప్పుడు. ఆ రీత్యా చూస్తీ , ఈ ‘ అప సవ్య వ్యక్తిత్వ రీతులు లేదా పర్సనాలిటీ డిసార్డర్ లు మానసిక వ్యాధులు ఉన్న వారిలో, 40 నుంచి 60 శాతం మందికి ఉంటాయని ఒక పరిశీలనలో తెలిసింది.
ఈ అపసవ్య వ్యక్తిత్వ రీతుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ?:
ముఖ్యం గా , మనం వ్యక్తిత్వ రీతుల గురించి తెలుసుకుంటే, మనలో మనకు తెలియకుండా ఉన్న , అపసవ్య లేదా , అనవసరమైన లక్షణాలను, మనం ఆది లోనే గమనించి , మన ఆలోచనా రీతులలో , ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుని, వ్యక్తిత్వ వికాసం పొందడం కోసం. అంతే కాకుండా , ప్రధానం గా , మనం సంఘ జీవులం కదా ! భిన్న వ్యక్తిత్వాలు ఉన్న మనుషులతో మనం నిరంతరం, సంబంధాలు ఏర్పరుచు కుంటూ ఉంటాము కదా ! ఆ సమయాలలో, మనకు తెలిసిన ఈ వ్యక్తిత్వ రీతులతో, ఇతరులతో సంభంధాలు, అంటే, సత్సంబంధాలు శులభం గా ఏర్పరుచుకో గలుగుతాము ! అంతే కాకుండా , మనం చాలా సందర్భాలలో ‘ వాడి సంగతేంటో అంతు పట్టట్లేదు ‘ అని అనుకుంటూ ఉంటాము. అట్లాంటప్పుడు, మనకు ‘ వాడి ‘ గురించి కొంతైనా అవగాహన ఏర్పడుతుంది, మనం వ్యక్తిత్వ రీతుల గురించి ముందే తెలుసుకుని ఉంటే ! మరి ఇంత ముఖ్యమైన ఈ వ్యక్తిత్వ రీతుల గురించి తెలుసుకోవాలని ఉత్సాహం గా ఉందా ! అయితే ఇక ఈ టపాలను ఫాలో అవండి !
వచ్చే టపాలో ఈ వ్యక్తిత్వ రీతులు ( అపసవ్య వ్యక్తిత్వాలకు మారు గా ‘ వ్యక్తిత్వ రీతులు ‘ అనే పదం ఉపయోగించడం జరుగుతుంది. ) లేదా పర్సనాలిటీ డిసార్డర్ ల గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !
అపసవ్యం మనుషులున్నారంటారు,రావణుడిలా, బాగుంది.
శర్మ గారూ ,
ఇక్కడ మనం అప సవ్యం గా ఉన్న మనస్తత్వాల గురించే మాట్లాడు కుంటున్నామండీ ! మీరు నన్ను ఆట పట్టిస్తున్నారను కుంటున్నాను !
రావణుడు 40% బాగుండి 60% బాగోలేడు కదండీ అందుకన్నమాట. ఆట పట్టించటం కాదు 🙂
సత్యం. సరదాకి అన్నాను లెండి. రాముడైనా , రావణుడు అయినా వారి వ్యక్తిత్వాల వల్ల నే కదండీ ! ( అందువల్ల నే, మనం వాటి గురించి తెలుసుకోవడం ! )
Psychology మీద కొన్ని పుస్తకాలు సూచించగలరు. (For Understanding Basics / fundamentals).
ధన్యవాదాలు,
పద్మజ
పద్మజ గారూ ,
మీరు సైకాలజీ ని ఒక సబ్జెక్ట్ గా సీరియస్ గా చదవాలంటే ఒక రకమైనవీ, సరదాకు చదవాలంటే ఇంకో రకమైనవీ, మార్కెట్ లో లభ్యం అవుతాయి.
మీ ఉద్దేశం ఏమిటో తెలియ చేయ లేదు. ( ఇంగ్లీషు లో అనేకమైన బుక్స్ ఉన్నాయి , రెండు రకాలవీ )
అభినందనలతో ,
Dr.సుధాకర్.
సుధకర్ గారు,
సైకాలజీ ని ఒక సబ్జెక్ట్ గా సీరియస్ గా చదవలని అనుకుంటున్నను.
ధన్యవాదాలు,
పద్మజ
నాకు సబ్జక్ట్ పాఠాలు కాదుగాని మానవ మనస్తత్వం అర్ధం చేసుకోడానికి పుస్తకాలు చెప్పండి.
శర్మ గారూ , మీరు మళ్ళీ నన్ను ….. …… ! ! మానవ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే ఒక చిరు ప్రయత్నమే ఇది.
సముద్రం లోతు కనుక్కోవచ్చేమో కానీ , మానవ మస్తిష్కాలలో ఏముందో, ఖచ్చితం గా కనుక్కోవడం అసాధ్యం , విజ్ఞానం ఎంత పురోగమిస్తూ ఉన్నప్పటికీ.
అనుభవజ్ఞులు, మీకు తెలియాలి !