Our Health

పీతలతో మెదడుకు మేత !

In మానసికం, Our minds on జూన్ 18, 2012 at 11:40 ఉద.

పీతలతో  మెదడుకు మేత ! 

 ( పైన ఉన్న మొదటి చిత్రం  స్క్విడ్ లు  (  పీత జాతి సముద్ర జంతువులు ) . రెండవ చిత్రం  ప్రోటాను ట్రాన్సిస్టర్ . అందులో చూపించిన ఖైటోసాన్ అనే (  పసుపు పచ్చని , పీతల  కవచాల నుంచి తయారు చేయ బడ్డ  )  పదార్దమే  ప్రోటానులను  ( తద్వారా సిగ్నల్స్ నూ , లేదా సంజ్ఞ లనూ ) మన దేహం లోని కణాలకు పంప  గలదు ). 

మన శరీరం లో అనేక బిలియన్ల  కణాలు ఉన్నాయి కదా ! అట్లాగే మన మెదడు లో కూడా అనేక మిలియన్ల  నాడీ కణాలతో నిర్మించ బడ్డది కదా !  
నిశితం గా గమనించి నట్టయితే మన దేహం లో ఉన్న ప్రతి కణం లోనూ నిరంతరం జరుగుతుండే మార్పులు,  అతి సూక్ష్మ పరిమాణం లో ప్రవహించే విద్యుత్తు వలన. ఉదాహరణకు మన చేతి వెలికి ఒక సూది మొన తగిలింది అనుకోండి. వెంటనే మన మెదడు కు ఎట్లా తెలుస్తుందనుకున్నారు? మన శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీ తంత్రులు విద్యుత్తు అంటే  ధన లేక ఋణ విద్యుత్తు ( పాజిటివ్ లేదా నెగెటివ్ చార్జ్  ) కలిగి ఉండడం వల్లనే ! అట్లాగే మన దేహం లో జరిగే ప్రతి చర్యా, అత్యంత సూక్ష్మం గా జరుతున్న ఈ మార్పుల సముదాయమే ! 
మన శరీరం  లో అనేక చర్యలు పాజిటివ్ చార్జ్ , అంటే ధన విద్యుత్తు ఉన్న ప్రోటానుల వల్ల  జరుగుతుంటాయి. ఉదాహరణకు , మనలో ఉన్న ప్రతి కండరం కదలికా  సున్నం అంటే క్యాల్సియం  ( ధన విద్యుత్తు కలిగిన అంటే ప్రోటాను ) అయానుల వల్లనే ! ఆ క్యాల్సియం అయానులు మనలో లేక పొతే మనం మన దేహం లో ఏ కండరాన్నీ కదిలించ లేము. అట్లాగే మన నాలుక మీద ఏదైనా ఆహార పదార్ధం ఏదైనా పెట్టుకోగానే , మనకు ఆ రుచి తెలిసేది , ధన విద్యుత్తు కలిగిన అయానులు ( ప్రోటానులు ) మెదడుకు ఇం పల్స్  ను చేరవేయడం వల్లనే. అంత  దాకా ఎందుకు  ? మనము కళ్ళు తెరవగానే కనపడే చరాచర సృష్టి అంతా కేవలం ధన విద్యుత్తు కలిగిన ( అంటే పాజిటివ్ చార్జ్ ఉన్న ) ప్రోటాను అయానులు మన రెటినా నుండి సంజ్ఞలు ( సిగ్నల్స్  లేదా   ఇం పల్స్ లు అనవచ్చు  )  మెదడు కు చేరవేయడం వల్లనే ! ఇట్లా మన దేహం లో జరిగే అనేక చర్యలు  ధన విద్యుత్తు కలిగిన ఖనిజాలు అంటే క్యాల్సియం, సోడియం , పొటాసియం ( ఈ మూడు ప్రధాన ధన విద్యుత్తు కలిగిన లేదా పాజిటివ్ గా చార్జ్ ఉన్న , అంటే వాటి ప్రోటానుల వలన నే ) అనబడే అయానుల వల్లనే !  
ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే,  మనం ఆరోగ్యం తో ఉన్నప్పుడు, నిరంతరం జరిగే ఈ జీవ చర్యలు, మన ఆరోగ్యం కుంటు పడ్డప్పుడు,  సరిగా జరగక పోవచ్చు. ఉదాహరణకు : అల్జీమర్స్ డిసీజ్  అనే మతి మరుపు వ్యాధి , వయసు మీద పడుతున్నకొద్దీ , మన మెదడు లోని నాడీ కణాలు ఒక దానితో ఒకటి అను సంధానం సరిగా జరగక వస్తుంది. అనుసంధానం సరిగా జరగక పోవడానికి, అక్కడ ఉండే ధన చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ ఉన్న అయానులు సరిగా సంజ్ఞ లను పంపుకోక పోవడం వల్లనే !   ఇంకో ఉదాహరణ: పార్కిన్సన్ డిసీజ్ అనే కండరాలు గట్టి పడే వ్యాధి ఉంది. ఆ వ్యాధి లో కూడా, ( అనేక కారణాలు ఉన్నప్పటికీ ) మెదడు లో ఈ ధన చార్జ్ లో అంటే పాజిటివ్ చార్జ్ లో అవక తవకలు ఏర్పడతాయి. ఇట్లాంటి పరిస్థితులలో , మన దేహం లోనూ , మెదడు లోనూ ఈ పాజిటివ్ చార్జ్ ల లో మార్పులు తెచ్చి , వ్యాధిని కొంత వరకైనా నియంత్రించ వచ్చు కదా అని శాస్త్రజ్ఞులలో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలను అమలు లో పెట్టడానికి ఒక పెద్ద అవరోధం ఏమిటంటే,  పైన చెప్పుకున్నట్టు , మన దేహం ఎక్కువ గా పాజిటివ్ గా చార్జ్ అయి ఉంటుంది. కానీ మనం వాడుతున్న అనేక ఎలెక్ట్రానిక్ పరికరాలు  నెగెటివ్ గా చార్జ్ అయి ఉంటాయి. అందువల్ల మన దేహం లో ఏదైనా సూక్ష్మ ( ఎలెక్ట్రానిక్  ) పరికరాన్ని ప్రవేశ పెట్టి ,  మనకు కావలసిన  మార్పు  , సంబంధించిన కణాలలో తెద్దామనుకున్నా,  ఆ కణాలు అన్నీ  పాజిటివ్ గా చార్జ్ అయి ఉండడం వల్ల ఎలెక్ట్రానిక్ పరికరం తో ‘ మాట్లాడ లేవు ‘ అంటే గుర్తు పట్టలేవు.  అందువల్ల ఈ ప్రయత్నాలన్నీ ఇప్పటి వరకూ విఫలమయ్యాయి. కానీ వాషింగ్ టన్  విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రోలాండి, ఆయన టీం తో కలిసి ఒక సూక్ష్మ పరికరం కనుక్కున్నారు.  దీని పేరే  ప్రోటాన్ ట్రాన్సిస్టర్ ( Rolandi’s device or proton transistor ).
మరి ఈ ప్రోటాన్ ట్రాన్సిస్టర్ కూ పీతలకూ సంబంధం ఏమిటి ? : 
ఈ ప్రొఫెసర్ రోలాండి గారు తాము కనిపెట్టిన  ఈ ట్రాన్సిస్టర్ లో  ఒక పదార్ధాన్ని వాడారు . ఆ పదార్ధం పేరు ‘  ఖైటోసాన్ ‘  ( chitosan ). ఈ పదార్ధము పీతల కవచాల నుంచీ , స్క్విడ్ లు అనబడే సముద్రం లో ఉండే పీతల జాతికి చెందిన జంతువులు – వీటి కవచాల నుండీ వేరు చేసిన చెక్కర వంటి పదార్ధం .  ఈ ఖైటోసాన్ ప్రత్యేకత ఏమిటంటే ,  దీని ద్వారా ప్రోటానులు అంటే పాజిటివ్ గా చార్జ్ అయి ఉన్న అయానులు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తాయి. అంటే మన దేహం లో కణాల మధ్య ప్రయాణం చేస్తున్నట్టు. అదే మనకు ( అంటే శాస్త్రజ్ఞులకు ) కావలసినది.  ఇప్పుడు  రోలాండి గారు,  ఈ ప్రోటాను ట్రాన్సిస్టర్ ను వైద్య పరం గా ఎంతగా ఉపయోగించ వచ్చో తేల్చే ప్రయత్నం లో ఉన్నారు.  ఫలితాలు కొంత కాలం పట్ట వచ్చు, కానీ ముఖ్యమైన ప్రోటాను ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది కదా ! జార్జియా ఇంస్టి ట్యూట్ అఫ్ టెక్నాలజీ లో జీవ నాడీ కణాల మీద  పని చేస్తున్న బెల్లం కొండ రవి  ఇట్లా అన్నారు ‘ ప్రోటాన్ ట్రాన్సిస్టర్ ల తో  ప్రతి కణం లోని ధన అయానులను (  అంటే పాజిటివ్ అయానులు ) అవసరమైన చోట  కణాల లోకి ఎక్కువగా పంపీ , లేదా అనవసరమైన వాటిని బయటికి లాగి వేసీ , ఈ మార్పులు జరుగుతున్న వ్యాధులకు చికిత్స చేయటం లో కొత్త దారులు ఏర్పరచ వచ్చు ‘ ఒక రకం గా చెప్పాలంటే ఈ ఖైటోసాన్ ఒక నానో ఫైబర్ గా ఏర్పడి ( నాడీ సంబంధ వ్యాదులలో ) తెగి పోయిన లేదా పాడయి పోయిన నాడీ తంత్రుల ను అనుసంధానం చేసి  వాటి మధ్య సంజ్ఞలు , లేదా సిగ్నల్స్  యధా విధి గా ప్రయాణించడానికి  అవకాశం ఏర్పడుతుంది’. 
ఇప్పుడు తెలిసింది కదా   భవిష్యత్తులో , పీతలతో మన మస్తిష్కాలకు మేత ఎట్లా వస్తుందో ! 
( ఈ టపా కూడా తాజా సంచిక  ‘ న్యూ సైంటిస్ట్ ‘ నుంచి  అనువదించ బడింది ). 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
  1. ప్రొటాన్ ట్రాన్సిస్టర్ కనుగొన్న రొలాండీ గారికి , సదరు వ్యాసాన్ని అనువదించి అందించిన మీకూ ధన్యవాదములు .

    • రాజా రావుగారూ , మీ మెదడుకు మేత అయ్యే ఒక ప్రశ్న : మన దేహం లో ఇతర జీవ చరాలు ఏ విధం గా ఉపయోగ పడుతున్నాయో చెప్ప గలరా ?

      • నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.
        జలగలు లేదా leeches: జలగలు మానవులు , ఇతర జంతువులు నీటిలో ఉన్నపుడు, వారి రక్తాన్ని పీలుస్తాయి. అట్లా పీల్చుతున్నపుడు , ఆ రక్తం గడ్డ కట్ట కుండా హైరుడిన్ అనే పదార్ధాన్ని స్రవిస్తాయి. ఈ హైరుడిన్ ను జలగలనుంచి తీసి వైద్య చికిత్స కు ఉపయోగిస్తున్నారు.
        అట్లాగే పాముల నుండి తీసిన విషాన్ని కూడా వివిధ పరీక్షలు చేసి, పాము కరిచినప్పుడు అందుకు విరుగుడు గా ఇచ్చే యాంటీ స్నేక్ వీనం ను తయారు చేస్తారు. ( భారత దేశం లో ఇట్లా తయారు చేసే సంస్థ ఒకటి తమిళ్ నాడు లో కూనూరు అనే పట్టణం లో ఉంది. )
        ఒక ప్రత్యెక రకమైన ఈగల గుడ్లు ( ఇంగ్లండు లో అమ్ముతారు ) కొన్ని రకాలైన కురుపుల మీద ఉంచుతారు. దానితో ఆ ఈగల గుడ్లు ( అంటే లార్వా అని అంటారు, అవి ) పెరిగి ఆ కురుపుల మీద ఉండే ( మనకు అనవసరమైన ) పదార్ధాలను తినివేస్తాయి.
        ఈ రకం గా వివిధ జీవ చరాలు మానవులకు ఇట్లా ఉపయోగ పడుతున్నాయి.

  2. శర్మ గారూ , నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.
    జలగలు లేదా leeches: జలగలు మానవులు , ఇతర జంతువులు నీటిలో ఉన్నపుడు, వారి రక్తాన్ని పీలుస్తాయి. అట్లా పీల్చుతున్నపుడు , ఆ రక్తం గడ్డ కట్ట కుండా హైరుడిన్ అనే పదార్ధాన్ని స్రవిస్తాయి. ఈ హైరుడిన్ ను జలగలనుంచి తీసి వైద్య చికిత్స కు ఉపయోగిస్తున్నారు.
    అట్లాగే పాముల నుండి తీసిన విషాన్ని కూడా వివిధ పరీక్షలు చేసి, పాము కరిచినప్పుడు అందుకు విరుగుడు గా ఇచ్చే యాంటీ స్నేక్ వీనం ను తయారు చేస్తారు. ( భారత దేశం లో ఇట్లా తయారు చేసే సంస్థ ఒకటి తమిళ్ నాడు లో కూనూరు అనే పట్టణం లో ఉంది. )
    ఒక ప్రత్యెక రకమైన ఈగల గుడ్లు ( ఇంగ్లండు లో అమ్ముతారు ) కొన్ని రకాలైన కురుపుల మీద ఉంచుతారు. దానితో ఆ ఈగల గుడ్లు ( అంటే లార్వా అని అంటారు, అవి ) పెరిగి ఆ కురుపుల మీద ఉండే ( మనకు అనవసరమైన ) పదార్ధాలను తినివేస్తాయి.
    ఈ రకం గా వివిధ జీవ చరాలు మానవులకు ఇట్లా ఉపయోగ పడుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: