ఉత్తేజం మనకు ఎట్లా ఉపయోగ పడుతుంది?. 2.
కదిలేదీ , కదిలించేదీ
మారేదీ , మార్పించేదీ ,
పాడేదీ , పాడించేదీ ,
పెను నిద్దుర వదిలించేదీ ,
మును ముందుకు సాగించేదీ ,
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ,
కావాలోయ్ నవ కవనానికి.
శ్రీ శ్రీ ( 03.08.1937. )
మహా కవి శ్రీ శ్రీ , అనేక దశాబ్దాల క్రితం వ్రాసిన కవిత్వం, ఆఖరి లైను లో ‘ ఉత్తేజం కావాలోయ్ నవ జీవనానినికి ‘ అని మనం , ఉత్తేజం ప్రాముఖ్యత ను గుర్తు పెట్టుకోవచ్చు.
మనందరికీ ఏ పని చేస్తున్నా , కొద్దో , గొప్పో , ఉత్తేజం ఉంటేనే ఆ పని చేయ గలుగుతున్నాము. కానీ ఉత్తేజం మనలో దిశా నిర్దేశనం చేస్తుంది. అంతే కాక , ఉత్తేజం మనం చేసే పని పట్ల మన అంకిత భావాన్ని అంతే మన డెడికేషన్ తీవ్రతను కూడా తెలియ చేస్తుంది.
మానవులు చేసే ప్రతి పని లోను , ఉత్తేజం ఉండడం సహజమే. అంటే మనం చేసే పని మంచిది అయినా , చెడు అయినా ఉత్తేజం మొదట పుట్టి ఆ పని కార్య రూపం దాల్చుతుంది.
అంతే కాక, మానవుల ప్రవర్తన, సాధారణం గా , వారి క్రోధం, భయం, ప్రతీకార వాంఛ, ఇంకా గిల్ట్ భావనలు ( guilt ) , ఇలాంటి నెగెటివ్ ఎమోషన్ ల వల్ల ఉత్తేజం పొందినదే !
అనేక పరిశోధనల వల్ల, మానవులు, వివిధ కార్యాలలో , తాము పొందే ఉత్తేజం తీవ్రతను పెంచుకో గలరని తెలిసింది. అంతే కాక, అట్లా పెంచుకున్న ఉత్తేజం తో ఎంతో లాభ పడగలరని కూడా పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి.
క్రితం టపాలో చదివినట్టు, ఉత్తేజాన్ని , అనేక మంది శాస్త్ర వేత్తలు , అనేక రకాలు గా విశ్లేషించి మనకు అందించారు. వాటిని తెలుసుకోవడం వల్ల మనం , మన జీవితాలను , మన ప్రవర్తననూ , వివిధ కోణాలలో చూసుకొని, తద్వారా , అవసరమైన మార్పులు చేసుకొని , అధికోత్తేజం తో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది.
అందువల్ల మనం, ఈ ఉత్తేజం వివరాలు తెలుసుకుందాము.
మిగతా సంగతులు , వచ్చే టపాలో !