ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవాలి ?.21.
మనం ఇంత వరకూ టపాలలో ఆప్టిమిజం గురించి చాలా వివరం గా తెలుసుకున్నాము కదా ! ముఖ్యం గా ఈ ఆప్టిమిజం వల్ల మనకు కలిగే లాభాలు కూడా స్పష్టం గా తెలిశాయి కదా! ఇప్పుడు మనం ఈ ఆశావాద ధోరణి ని అంటే ఆప్టిమిజాన్ని ఎట్లా నేర్చుకోవాలి ? ఎట్లా మన జీవితం లో భాగం గా చేసుకోవాలి ? అనే విషయాలు పరిశీలిద్దాము.
ఈ ఆప్టిమిజాన్ని ఏ వయసు నుండి నేర్చుకోవచ్చు? :
మనకు తెలిసింది కదా ఎక్స్ప్లనేటరీ అంటే విశదమైన ఆశావాదం లేక ఆప్టిమిజం మనకు ఎంతో లాభదాయకమని ! శాస్త్రవేత్తలు, కవలల మీద అనేక పరిశోధనలు చేసి మన జన్యువులలో అంటే జీన్స్ ( genes ) లో 25 నుంచి 50 శాతం వరకు మనం ఆశావాద దృక్పధం లక్షణాలు ఉంటాయి అని తేల్చారు. అంటే కొంత వరకూ ఈ ఆశావాద మనస్తత్వం అనువంశికం అంటే హెరి డి టరీ అన్న మాట. మరి మనం నేర్చుకునే ఆశావాదం మనకు, మిగతా 50 నుంచి 75 శాతం ఉపయోగ పడుతుంది. దీనిని మనం నేర్చుకోవడమే కాకుండా కుటుంబం లో ఉన్న చిన్న పిల్లలు కూడా ఈ విశదమైన ఆశావాదం ( మనలను చూసి ) నేర్చుకోవడానికి దోహద పడుతుంది. అట్లాగే పిల్లలు స్కూల్ కు వెళుతూ ఉన్నప్పుడు , వారి టీచర్ల ఆశా వాద మనస్తత్వం కూడా , వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ కోచెస్ కూడా ఈ ఆశావాద ధోరణి పిల్లలకు నేర్పటం లో ప్రధాన పాత్ర వహించ గలరు. అంటే పిల్లలు కూడా తమ చిన్న తనం లో తమ చుట్టూ ఉన్న వారు ( అంటే కుటుంబంలో, తల్లి , తండ్రి , స్కూల్ లో టీచర్లు , స్పోర్ట్స్ కోచెస్ ) ఏ దృక్పధం తో ఉంటారో , ఆ దృక్పధాన్ని తాము కూడా అలవరుచుకో గలరు.ఆల్బర్ట్ ఎల్లిస్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ ఈ ( ఆశావాద ) దృక్పధం నేర్చుకోవడానికి కొన్ని కిటుకులు సూచించాడు. ఈ కిటుకులు ఉపగించడం నేర్చుకుని , వాటిని మన నిత్య జీవితం లో భాగం గా చేసుకుంటే మనం చాలా లాభ పడగలం.మన జీవితాలను ఎక్కువ ఆనంద మయం చేసుకోగలం. మిగతా ప్రముఖ సైకాలజిస్ట్ లు అయిన సెలిగ్మన్, రీవిచ్ లు కూడా ఆల్బర్ట్ ఎల్లిస్ సూచించిన కిటుకులు పరిశీలించి , అవి ఎక్కువ ప్రయోగాత్మకం గా అంటే ప్రాక్టికల్ గా , అందరూ ఉపయోగించ గలిగేటట్టు ఉన్నాయని తేల్చారు. ఆల్బర్ట్ ఎల్లిస్ తాను సూచించిన ఈ పద్ధతికి ‘ ఏ బీ సి టెక్నిక్ ‘ ( ABC technique on building optimism ) అని పేరు పెట్టాడు.
వచ్చే టపాలో ఈ ఏ బీ సి టెక్నిక్ వివరాలు చూద్దాము !